Phone Storage Full: మీ స్మార్ట్‌ఫోన్‌ వీడియోలు, ఫోటోలతో స్టోరేజీ నిండిపోయిందా..? ఇలా చేయండి

చాలా మంది ఫోన్‌లో ఎంత స్టోరేజీ ఉన్నా.. ఫుల్లుగా నిండిపోతుంటుంది. ఇష్టానుసారంగా వీడియోలు సేవ్‌ చేయడం, ఫోటోలు ఎక్కువ ఉండటం వల్ల స్టోరేజీ నిండిపోతుంటుంది. అలాంటి సమయంలో..

Phone Storage Full: మీ స్మార్ట్‌ఫోన్‌ వీడియోలు, ఫోటోలతో స్టోరేజీ నిండిపోయిందా..? ఇలా చేయండి
Phone Storage Full

Updated on: Oct 09, 2022 | 11:32 AM

చాలా మంది ఫోన్‌లో ఎంత స్టోరేజీ ఉన్నా.. ఫుల్లుగా నిండిపోతుంటుంది. ఇష్టానుసారంగా వీడియోలు సేవ్‌ చేయడం, ఫోటోలు ఎక్కువ ఉండటం వల్ల స్టోరేజీ నిండిపోతుంటుంది. అలాంటి సమయంలో ఇబ్బందులు పడుతుంటారు. ఇంకో విషయం ఏంటంటే అవసరం లేని యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేస్తుంటారు. మీఫోన్‌లో స్టోరేజీ నిండి ఉంటే ఇలా చేస్తే ఫోన్‌లో స్టోరేజీ ఖాళీ అవుతుంది. మీరు Google Play Storeని ఓపెన్‌ చేసి యాప్స్‌పై నొక్కాలి. అప్పుడు అందులో ఎంత స్థలం నిండిపోయిందనే విషయం తెలిసిపోతుంది. ఆ తర్వాత మీరు తొలగించాలనుకుంటున్న యాప్‌లను ఎంచుకుని ఉపయోగించని యాప్స్‌ను తొలగించడం మంచిది. అప్పుడు మీ ఫోన్‌లో స్టోరేజీ ఏర్పడుతుంది.

  1. వాట్సాప్‌ని క్లియర్ చేయండి: వాట్సాప్‌ మెసేంజర్‌ (వాట్సాప్‌)భారతదేశంలో అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్. ఇది లేనిది ఏ ఫోన్‌ ఉండదు. ఉదయం లేచింది నుంచి పడుకోబోయే వరకు వాట్సాప్‌తోనే గడిపేస్తుంటారు చాలా మంది మీ యాప్ చాలా స్థలాన్ని ఆక్రమించే అనవసరమైన ఫోటోలు, వీడియోలు, ఆడియోలతో నిండి ఉండవచ్చు. ఇమేజ్‌లు లేదా ఇతర మీడియాను తొలగించుకోవాలి. మీరు చేయాల్సిందల్లా సెట్టింగ్‌లకు వెళ్లి నిల్వ , డేటాను క్లిక్ చేయడమే. ఇక్కడ మీరు 5MB కంటే పెద్ద అన్ని ఫైల్‌లను గుర్తించవచ్చు. అలాంటి ఫైళ్లను డిలిట్‌ చేయడం ద్వారా స్టోరేజీ పెరుగుతుంది.
  2. క్లౌడ్ సేవలో ఫోటోలను బ్యాకప్ చేయండి: క్లౌడ్ సేవను ఉపయోగించడం ద్వారా మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో స్థలాన్ని కూడా ఖాళీ చేయవచ్చు. Google ఫోటో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఫోన్ గ్యాలరీ నుండి మీ అన్ని ఫోటోలను బ్యాకప్ చేయండి. పూర్తయిన తర్వాత, మీరు మీ గ్యాలరీ నుండి ఫోటోలను క్లియర్ చేయవచ్చు, ఎందుకంటే అవి Google ఫోటోల యాప్‌లో సేవ్ చేయబడతాయి.
  3. కాష్‌ని క్లియర్ చేయండి: మీకు ఇప్పటికీ మీ స్మార్ట్‌ఫోన్‌లో అదనపు నిల్వ స్థలం అవసరమైతే, మీరు తప్పనిసరిగా అన్ని యాప్‌ల కాష్‌ను క్లియర్ చేయాలి. అలా చేయడానికి మీరు మీ ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి యాప్‌లను ఎంచుకోవాలి. దానిపై క్లిక్ చేసి క్లియర్ కాష్‌ని ఎంచుకోండి. ఇలా చేయడం ద్వారా కూడా ఫోన్‌లో స్టోరేజీ పెంచుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి