AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO: “అన్వేష” పేరుతో 2026లో ఇస్రో తొలి ప్రయోగం.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

2025 చివర్లో వందో ప్రయోగంతో గ్రాండ్ సక్సెస్ కొట్టిన ఇస్రో 2026లో తొలి ప్రయోగానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ నెల 12 న తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి PSLV-C62 రాకెట్‌తో 'అన్వేష్' (EOS N1) అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది. ఇది శత్రు కదలికలు, వాతావరణ మార్పులను పర్యవేక్షిస్తూ దేశ భద్రతలో కీలకంగా పనిచేయనుంది. 1485 కేజీల 'అన్వేష్'తో పాటు సింగపూర్, యూఏఈ సహా వివిధ దేశాలకు చెందిన 17 వాణిజ్య ఉపగ్రహాలను కూడా ఇస్రో కక్ష్యలోకి పంపనుంది.

ISRO: అన్వేష పేరుతో 2026లో ఇస్రో తొలి ప్రయోగం.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Isro Anvesh
Ch Murali
| Edited By: |

Updated on: Jan 07, 2026 | 3:02 PM

Share

2025 లో కీలక ప్రయోగాలు చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో) 2026లో భారీ ప్రయోగాలను లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఏడాది మొదట్లోనే తొలి ప్రయోగాన్ని చేపట్టేందుకు ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు భారత రక్షణ వ్యవస్థకు మూడో నేత్రంలా పనిచేస్తున్న ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లను అనేకం అంతరిక్షంలో ఇస్రో ప్రవేశపెట్టింది. తాజాగా జరుగుతున్న పీఎస్ఎల్వి సి.62 ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి పంపనున్న ఎర్త్ అబ్జర్వేషన్ సాటిలైట్ సిరీస్‌లో తొలిసారిగా ప్రత్యేక నామకరణం చేసింది ఇస్రో. శత్రుదేశాల కదలికలను గుర్తించేందుకు ఇస్రో చేపడుతున్న ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ల పరంపరలో ఈ ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు అన్వేష అనే నామకరణం చేశారు. ఇకనుంచి భూ పరిశీలన అలాగే సరిహద్దులో దేశ భద్రత కోసం రక్షణ కవచనంలో పనిచేసే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లను అన్వేష సీరిస్ లో ప్రయోగించాలని ఇస్రో నిర్ణయించింది.

సాటిలైట్ అన్వేష ప్రత్యేకలేమిటి?

వాతావరణంలో మార్పులు, విపత్తులు సంభవించే సమయంలో ముందస్తు సమాచారం కూడా ఈ ఉపగ్రహం సూచిస్తుంది. ఈనెల 12 న షార్ నుండి pslv..c62 రాకెట్ ప్రయోగం జరగనుంది.. ఇందుకోసం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. షార్ లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి pslv.. c62 ద్వారా నింగిలోకి పంపనున్న Eos N1 .( అన్వేష) శాటిలైట్ బరువు 1485 కేజీలు .600 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింక్రనైజ్ ఆర్బిట్ లోకి ఈ శాటిలైట్ ను ప్రవేశపెట్ట నున్నారు.

దీనితో పాటు 200 కేజీలు బరువు తో కూడిన మరో 17 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్న శాస్త్రవేత్తలు . సింగపూర్. లక్సెంబర్గ్, యూరప్, యునైటెడ్ స్టేట్స్, uae దేశాలు కు చెందిన మరో 17 చిన్న ఉపగ్రహాలను ఇస్రో ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి పంపనుంది. స్వదేశీ అవసరం కోసం మన దేశానికి చెందిన ఉపగ్రహాన్ని పక్షులకు పంపడంతో పాటు కమర్షియల్ గా కూడా ఇతర దేశాలకు చెందిన 17 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపి ఆదాయం మార్గంగా కూడా ఈ ప్రయోగం ఇస్రోకి దోహదపడుతోంది.

మరిన్ని సైన్స్‌ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టీమిండియా సెమీఫైనల్‌ చేరడం పక్కా.. ఏ టీంను ఢీ కొట్టనుందో తెలుసా?
టీమిండియా సెమీఫైనల్‌ చేరడం పక్కా.. ఏ టీంను ఢీ కొట్టనుందో తెలుసా?
రోజుకు కేవలం రూ.150 ఆదా చేస్తే చేతికి రూ.26 లక్షలు..
రోజుకు కేవలం రూ.150 ఆదా చేస్తే చేతికి రూ.26 లక్షలు..
సింగర్ చిన్మయిపై నెటిజన్ దారుణమైన కామెంట్స్.. స్ట్రాంగ్ కౌంటర్
సింగర్ చిన్మయిపై నెటిజన్ దారుణమైన కామెంట్స్.. స్ట్రాంగ్ కౌంటర్
ఈ లడ్డూ రోజుకి ఒకటి తిన్నారంటే.. ఈ సమస్యలకు చూమంత్రం వేసినట్టే
ఈ లడ్డూ రోజుకి ఒకటి తిన్నారంటే.. ఈ సమస్యలకు చూమంత్రం వేసినట్టే
మీ పిల్లల కోసం ల్యాప్‌టాప్‌ కొంటున్నారా?
మీ పిల్లల కోసం ల్యాప్‌టాప్‌ కొంటున్నారా?
పాలు విరిగిపోకుండా చేసే సైంటిఫిక్ పద్ధతులు తెలుసా
పాలు విరిగిపోకుండా చేసే సైంటిఫిక్ పద్ధతులు తెలుసా
తెలంగాణ విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు
తెలంగాణ విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు
20 రోజులకే ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్.. అధికారిక ప్రకటన
20 రోజులకే ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్.. అధికారిక ప్రకటన
నాసా నుండి భారత్ వరకు ఎవరికీ అంతుచిక్కని రహస్యాలు!
నాసా నుండి భారత్ వరకు ఎవరికీ అంతుచిక్కని రహస్యాలు!
నోరూరించే ఉసిరికాయ కూర.. ఓసారి ఇలా ట్రై చేయండి.. టేస్ట్ అదుర్స్
నోరూరించే ఉసిరికాయ కూర.. ఓసారి ఇలా ట్రై చేయండి.. టేస్ట్ అదుర్స్