- Telugu News Photo Gallery Technology photos Google launches smart watch Google pixel watch price and features Telugu Tech News
Google Pixel Watch: గూగుల్ స్మార్ట్ వాచ్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
ప్రముఖ సెర్చ్ ఇంజన్ దిగ్గజం ఎట్టకేలకు గూగుల్ పిక్సెల్ స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. అధునాతన ఫీచర్లతో రూపొందించిన ఈ వాచ్ ప్రస్తుతం అమెరికాలో అందుబాటులోకి రాగా త్వరలోనే భారత్‌లోనే అడుగుపెట్టనుంది..
Updated on: Oct 09, 2022 | 11:00 AM

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఎట్టకేలకు స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. గత కొన్ని రోజులుగా ఈ వాచ్ గురించి పలు వార్తలు వస్తున్నా అధికారికంగా గూగుల్ ఈ విషయాన్ని తాజాగా తెలిపింది.

గూగుల్ పిక్సెల్ పేరుతో తీసుకొచ్చిన ఈ వాచ్‌లో అమోఎల్‌ఈడీ సర్కిల్ షేప్ డిస్‌ప్లే, ఫిట్‌బిట్ హెల్త్ ఫీచర్లు, వేర్ ఓఎస్‌తో ఈ వాచ్ వస్తోంది. ఎగ్జినోస్ 9110 చిప్‌సెట్‌పై గూగుల్ పిక్సెల్ వాచ్ రన్ అవుతుంది.

2జీబీ ర్యామ్ ఉండే ఈ వాచ్‌లో 1.6 ఇంచుల AMOLED డిస్‌ప్లేను ఇచ్చారు. డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఫుల్ డే బ్యాటరీ లైఫ్ వస్తుంది.

ఇక హార్ట్‌రేట్ మానిటర్, ఈసీజీ ట్రాకర్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ ట్రాకర్ SpO2తో పాటు ఫిట్‌బిట్ లాంటి హెల్త్ ఫీచర్లను అందించారు. వేర్ఓఎస్ 3.5 వచ్చిన గూగుల్ తొలి స్మార్ట్‌వాచ్ ఇదే కావడం విశేషం.

ధర విషయానికొస్తే ఈ వాచ్ భారత కర్సెనీలో సుమారు రూ. 28,700, ఎల్‌టీఈ వేరియంట్ రూ. 32,800గా ఉండనుంది. ప్రస్తుతానికి అమెరికాతో పాటు మరికొన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ వాచ్ త్వరలోనే భారత్‌లోకి అందుబాటులోకి రానుంది.




