AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లోనే థియేటర్​ అనుభూతి కోరుకుంటున్నారా? ఈ ప్రొజెక్టర్‌‌ గురించి తెలిస్తే పిచ్చెక్కిపోతారు

XElectron Techno Plus Android 14 Smart Projector.. ప్రస్తుతం సినిమా థియేటర్‌కు వెళ్లేవారి సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే నేటి ఆధునిక యుగంలో ఇంట్లోనే పెద్ద స్క్రీన్ మీద సినిమాలు చూస్తూ హోమ్ థియేటర్ ఫీలింగ్ పొందాలని చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అయితే పెద్ద సైజు స్మార్ట్ టీవీలు కొనాలంటే బడ్జెట్ భారీగా దాటిపోతుంది. ఇలాంటి సామాన్య కస్టమర్ల కోసం ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎక్స్‌ఎలెక్ట్రాన్ (XElectron) ఒక అద్భుతమైన ప్రొజెక్టర్‌ను తాజాగా మార్కెట్లోకి తీసుకువచ్చింది.

ఇంట్లోనే థియేటర్​ అనుభూతి కోరుకుంటున్నారా? ఈ ప్రొజెక్టర్‌‌ గురించి తెలిస్తే పిచ్చెక్కిపోతారు
Xelectron Techno Plus Android 14 Smart Projector
Nikhil
|

Updated on: Aug 20, 2026 | 6:40 AM

Share

ఎక్స్‌ఎలెక్ట్రాన్ సంస్థ టెక్నో ప్లస్ ఆండ్రాయిడ్ 14 స్మార్ట్ ప్రొజెక్టర్‌ను రూ.8,499 ధరకే విడుదల చేసింది. 200 అంగుళాల భారీ స్క్రీన్, 180 డిగ్రీల రొటేషన్ డిజైన్, ఇన్‌బిల్ట్ ఓటీటీ యాప్స్, వైఫై 6 సపోర్ట్‌తో వస్తున్న ఈ ప్రొజెక్టర్ ఇంట్లోనే హోమ్ థియేటర్ అనుభూతిని అందిస్తుంది. కేవలం రూ.8,499 సరసమైన ధరకే ‘టెక్నో ప్లస్’ (Techno Plus) పేరుతో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ప్రాసెసర్‌తో పనిచేసే స్మార్ట్ ప్రొజెక్టర్‌ను అందుబాటులోకి తెచ్చింది. టెక్ ప్రపంచంలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యాడ్జెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

180 డిగ్రీల రొటేషన్ ప్రత్యేకతలు

ఈ ఎక్స్‌ఎలెక్ట్రాన్ టెక్నో ప్లస్ ప్రొజెక్టర్ ద్వారా ఇంట్లోనే ఏకంగా 200 అంగుళాల వరకు బిగ్ స్క్రీన్ అనుభవాన్ని అద్భుతంగా పొందవచ్చు. ఇది ఫుల్ హెచ్‌డీ (1080p) రిజల్యూషన్‌తో వస్తుండగా, 4K కంటెంట్‌ను కూడా సులభంగా ప్లే చేయగలదు. ఇందులో 9000 ల్యూమెన్స్ బ్రైట్‌నెస్ మరియు 5000:1 కాంట్రాస్ట్ రేషియో ఉండటం వల్ల విజువల్స్ అత్యంత స్పష్టంగా కనిపిస్తాయి. ఇందులో వాడిన ఎల్‌ఈడీ లైట్ లైఫ్ దాదాపు 50,000 గంటల వరకు మన్నిక వస్తుందని కంపెనీ చెబుతోంది.

ముఖ్యంగా ఈ ప్రొజెక్టర్ యొక్క ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే, దీని డిజైన్ 180 డిగ్రీల వరకు సులభంగా తిరుగుతుంది. అంటే ఈ ప్రొజెక్టర్ ద్వారా కేవలం ఎదురుగా ఉన్న గోడపైనే కాకుండా, సౌకర్యంగా పడుకుని పైన ఉన్న సీలింగ్‌పై కూడా ప్రొజెక్ట్ చేసి సినిమాలు చూసేయొచ్చు. ఇమేజ్ సరిగ్గా బాక్స్ షేప్‌లో పర్ఫెక్ట్‌గా అడ్జస్ట్ అవ్వడానికి ఇందులో ఆటో కీస్టోన్ కరెక్షన్ ఫీచర్ కూడా అదనంగా అందుబాటులో ఉంది.

ఇన్‌బిల్ట్ ఓటీటీ యాప్స్

ఈ ప్రొజెక్టర్ నేరుగా లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా ఎలాంటి అదనపు టీవీ స్టిక్స్ వాడాల్సిన అవసరం ఉండదు. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5, సోనీలివ్ వంటి ప్రముఖ ఓటీటీ యాప్‌లను నేరుగా ఇందులో వాడేసుకోవచ్చు. సౌండ్ కోసం దీనిలో ప్రత్యేకంగా బేస్ స్పీకర్ కూడా అమర్చారు. ఒకవేళ ఆడియో ఇంకా ఎక్కువ కావాలనుకుంటే బ్లూటూత్ 5.0 ద్వారా సౌండ్‌బార్ లేదా హెడ్‌ఫోన్స్‌ను ఎంతో ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు.

వీటితో పాటు వైఫై 6 సపోర్ట్, తెలుగుతో సహా 25 వివిధ భాషల ఆప్షన్లు, ఏడాది వారంటీ వంటి అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అతి తక్కువ బడ్జెట్‌లో పెద్ద స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్ సెటప్ కోరుకునేవారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఈ ప్రొజెక్టర్ ప్రస్తుతం అమెజాన్, ఎక్స్‌ఎలెక్ట్రాన్ అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

Follow Us