WhatsApp Web: మీ డెస్క్‌టాప్‌లో వాట్సాప్ సరిగా పనిచేయడం లేదా? ఈ టిప్స్‌తో సమస్యకు పూర్తి పరిష్కారం..

డెస్క్ టాప్ లలో వినియోగించడానికి తప్పనిసరిగా వాట్సాప్ క్యూఆర్ కోడ్ ఫోన్ నుంచి స్కాన్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్బాల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ కాకపోవడం, స్కాన్ అయినా వాట్సాప్ లోడ్ కాకపోవడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. మరి అలాంటి సమస్యను ఎలా అధిగమించాలి?

WhatsApp Web: మీ డెస్క్‌టాప్‌లో వాట్సాప్ సరిగా పనిచేయడం లేదా? ఈ టిప్స్‌తో సమస్యకు పూర్తి పరిష్కారం..
Whatsapp Web
Follow us
Madhu

|

Updated on: Apr 26, 2023 | 3:45 PM

అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ లలో వాట్సాప్ కూడా ఒకటి. సామాన్యలు దగ్గర నుంచి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు అందరూ దీనిని వినియోగిస్తున్నారు. ఎక్కువశాతం మంది దీనిని తమ స్మార్ట్ ఫోన్లలోనే వాడుతారు. అయితే ఉద్యోగులు తమ ఆఫీసుల్లోని డెస్క్ టాప్ లలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇలా డెస్క్ టాప్ లలో వినియోగించడానికి తప్పనిసరిగా వాట్సాప్ క్యూఆర్ కోడ్ ఫోన్ నుంచి స్కాన్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్బాల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ కాకపోవడం, స్కాన్ అయినా వాట్సాప్ లోడ్ కాకపోవడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. మరి అలాంటి సమస్యను ఎలా అధిగమించాలి? అది పరిష్కారం అవుతుందా? చూద్దాం రండి..

ఇన్ బిల్ట్ స్కానర్ వాడాలి.. వాట్సాప్ వెబ్ క్యూఆర్ అనేది వాట్సాప్ అందించే ఇన్ బిల్ట్ క్యూఆర్ కోడ్ ద్వారా మాత్రమే పనిచేస్తుంది. వేరే యాప్ ల స్కానర్ లు వాడకూడదు. కొందరు ర్యాండమ్ క్యూర్ కోడ్ లు వినియోగిస్తారు. వీటి వల్ల మీకు సమస్య రావచ్చు.

కెమెరా లెన్స్ క్లీన్ చేయండి.. మీరు వెబ్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ముందు మీ స్మార్ట్ ఫోన్ కెమెరా లెన్స్ ను శుభ్రం చేయండి. ఎందుకంటే దానిపై ఉండే దుమ్ము, ధూళి వంటివి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడంలో ఇబ్బందిని కలుగజేయొచ్చు.

ఇవి కూడా చదవండి

ఇంటర్ నెట్ కనెక్షన్, స్పీడ్.. పై రెండు మార్గాల్లో సమస్య పరిష్కారం కాకపోతే తర్వాత మీరు చేయాల్సింది.. మీ ఇంటర్ నెట్ కనెక్షన్ ను తనిఖీ చేయడం. కనెక్షన్ మంచిగా ఉందా? నెట్ స్పీడ్ ఎలా ఉంది వంటివి చూసుకోవాలి. అవసరం అయితే నెట్ స్పీడ్ టెస్ట్ చేయాలి.

క్యాచీని క్లియర్ చేయాలి.. మీ బ్రౌజర్ లోని క్యాచీ ఫైళ్లు మీ సిస్టమ్ వేగాన్ని తగ్గిస్తాయి. వాటిని తక్షణమే డిలీట్ చేస్తే. సిస్టమ్ వేగం పుంజుకొనే అవకాశం ఉంటుంది.

డార్క్ మోడ్ ఆఫ్ చేయండి.. పైన చెప్పనవన్నీ చేసినా వాట్సాప్ వెబ్ లోడ్ కాకపోతే మీ డెస్క్ టాప్ డార్క్ మోడ్ లో ఉందేమో ఓ సారి చూసుకోవాలి. ఒకవేళ డార్క్ మోడ్లో ఉంటే దానిని డిజేబుల్ చేయాలి.

లింక్డ్ డివైజెస్ లిస్ట్.. వాట్సాప్ లో మీరు నాలుగు డివైజ్ ల వరకూ డెస్క్ టాప్ లో వెర్షన్కు కనెక్ట్ చేయవచ్చు. ఒకవేళే మీకు వాట్సాప్ వెబ్ యాక్సెస్ కావడంలో ఇబ్బంది ఏర్పడితే.. ఆ లిస్ట్ లోని ఇతర డివైజ్ లను డిలీట్ చేయండి. మీరు ఎక్కువగా వినియోగించని వాటిని డిలీట్ చేయండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..