WhatsApp New Feature: ‘చాట్ లాక్’ ఆప్షన్ వచ్చేసింది. వాట్సాప్‌లో మీ చాట్ హిస్టరీ మరెవరూ చూడలేరు..

|

Apr 29, 2023 | 6:15 PM

వాట్సాప్ వినియోగదారుల డేటా భద్రతకు, వారి ప్రైవసీ కి చాలా ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే ఎప్పటికప్పుడు సెక్యూరిటీ, ప్రైవసీ ఫీచర్లను తీసుకొస్తుంది. ఇదే క్రమంలో ‘చాట్ లాక్’ అనే మరో సరికొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది.

WhatsApp New Feature: చాట్ లాక్ ఆప్షన్ వచ్చేసింది. వాట్సాప్‌లో మీ చాట్ హిస్టరీ మరెవరూ చూడలేరు..
Whatsapp Lock
Follow us on

ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యింది. దానిలోని ఫీచర్లు, ప్రైవసీ, గ్రూప్ లు వంటివి జనాల్లోకి వెళ్లిపోయాయి. దీంతో ప్రతి ఒక్కరూ సమాచార మార్పిడికి వాట్సాప్ ని వినియోగిస్తున్నారు. సామాన్యుల దగ్గర నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, డాక్టర్లు పలు సంస్థలు వీరు వారు అని కాదు.. ఆ కంపెనీ ఈ కంపెనీ అని కాదు అందరకీ వాట్సాప్ చాలా దగ్గరై పోయింది. ఇంతా కోట్లాది మంది వినియోగదారులకు సొంతం చేసుకున్న వాట్సాప్.. వారి డేటా భద్రతకు, వారి ప్రైవసీ కి చాలా ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే ఎప్పటికప్పుడు సెక్యూరిటీ, ప్రైవసీ ఫీచర్లను తీసుకొస్తుంది. ఇదే క్రమంలో ‘చాట్ లాక్’ అనే మరో సరికొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. దీంతో వినియోగదారులు మొత్తం యాప్ ను లాక్ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం ఒక చాట్ నే లాక్ చేసుకొనే సౌకర్యం ఇప్పుడు వచ్చింది. అంటే మీకు ఎవరి చాట్ అయితే వేరే వాళ్లు చూడకూడదు అని భావిస్తారో వారిది లాక్ చేసుకోవచ్చు. అలాగే వారి నుంచి వచ్చే చిత్రాలు, వీడియోలను కూడా ఎవరికీ కనబడకుండా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఫీచర్ పొందడం ఇలా..

  • కొన్ని రిపోర్టుల ప్రకారం.. వాట్సాప్ బీటా టెస్టర్లకు మాత్రమే ఈ చాట్ లాక్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇది మీ యాప్ మొత్తాన్ని లాక్ చేయకుండా కేవలం మీకు అవసరమైన చాట్ ను మాత్రమే లాక్ చేసేందుకు ఉపకరిస్తుంది. మీరు ఒకవేళ ఈ ఫీచర్ కావాలనుకుంటే గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి అప్ డేట్ కోసం చూడొచ్చు.
  • వాట్సాప్ అప్ డేట్ చేశాక.. మీరు వాట్సాప్ కాంటాక్ట్ లోని ప్రోఫైల్ సెక్షన్ లోకి వెళ్లాలి.
  • దానిలో కిందకి వెళ్తే వచ్చిన ఆప్షన్లలో ‘చాట్ లాక్’ అలే కొత్త ఫీచర్ మీకు కనిపిస్తుంది.
  • ఇప్పుడు మీరు దానిని ‘లాక్ దిస్ చాట్ విత్ ఫింగర్ ప్రింట్’ అని ఆప్షన్ ని ఎంపిక చేసుకొని ఎనేబుల్ చేసుకోవాలి.
  • ఈ ఫీచర్ త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది. కానీ కొన్ని బీటా వెర్షన్లలో అందుబాటులో ఉన్న నేపథ్యంలో ప్లే స్టోర్ కి వెళ్లి అప్ డేట్ కోసం సెర్చ్ చేయవచ్చు.

ఈ కొత్త అప్ డేట్ లో వినియోగదారులకు పూర్తి సౌకర్యాన్ని ఇస్తుంది. వాట్సాప్ మొత్తాన్ని లాక్ చేసుకోకుండా కేవలం కొన్ని చాట్లను మాత్రమే లాక్ చేసుకొనే వెసులుబాటు మీకు కలుగుతుంది. మీ ప్రైవసీని కాపాడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..