Gmail Scam: ఇది చాలా డేంజర్ బ్రో.. జీమెయిల్ నుంచే మీ బ్యాంకు ఖాతాను కొల్లగొడతారు! అవగాహన లేకపోతే అంతే..
ప్రజలు ఇటీవల కాలంలో డోర్ డెలివరీలకు బాగా అలవాటు పడ్డారు. ఒకసారి డెలివరీ వచ్చిన కంపెనీకి మరోసారి ఆర్డర్ ఇవ్వడంలో వినియోగదారులు రెండో ఆలోచన చేయరు. మొదటి సారి చక్కగా ఆర్డర్ డెలివరీ చేసిన కంపెనీయే కదా.. అని వెంటనే దానిని ఓకే చేస్తారు. స్కామర్లు సరిగ్గా దీనినే లక్ష్యంగా ఎంచుకున్నారు. కొన్ని మీడియా నివేదికల ప్రకారం, జీమెయిల్ స్కామ్ అనేది ఓ మెయిల్ ద్వారా ప్రారంభమవుతుంది.
సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త టెక్నిక్ లను వాడుతూ వినియోగదారులకు షాక్ లిస్తున్నారు. అంది వస్తున్న సాంకేతికతను ఒకరకంగా వారే అధికంగా వినియోగిస్తున్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండటం, ఫోన్ సెక్యూరిటీ చెక్ చేసుకోవడం ఒక్కటే ఆన్ లైన్ చోరీల నుంచి రక్షించుకునే మార్గం. అయితే ఇటీవల ఓ కొత్త సైబర్ దాడి వెలుగుచూసింది. కొత్తది అంటే కొత్తది కాదు.. పాత దాన్నే ఇంకొంచెం కొత్తగా ట్రై చేసి ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. కరోనా ప్యాన్ డెమిక్ రెండో వేవ్ సమయంలో ఈ కొత్త స్కామ్ బయటకొచ్చింది. దీనిని ఫిషింగ్ స్కామ్ అని పిలుస్తారు. జీమెయిల్ కి ప్రముఖ సర్వీసెస్ కంపెనీ, డెలివరీ ఏజెంట్స్ వంటి కంపెనీల నుంచి పంపుతున్నట్లు మీకు మెయిల్స్ వస్తాయి. వాటి ల్లో ఒరిజినల్ బ్రాండ్ లోగోలను నేరగాళ్లు వాడతారు. పైగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ లా మీతో మాట్లాడుతారు. అది నిజంగా కంపెనీ నుంచే వస్తున్నట్లు నమ్మితే మీ ఖాతాను కొల్లగొడతారు. ఇటువంటి స్కామ్ ల నుంచి ఎలా బయటపడాలి? తెలుసుకుందాం రండి..
జీమెయిల్ స్కామ్స్ ఎలా చేస్తారు..
ప్రజలు ఇటీవల కాలంలో డోర్ డెలివరీలకు బాగా అలవాటు పడ్డారు. ఒకసారి డెలివరీ వచ్చిన కంపెనీకి మరోసారి ఆర్డర్ ఇవ్వడంలో వినియోగదారులు రెండో ఆలోచన చేయరు. మొదటి చక్కగా ఆర్డర్ డెలివరీ చేసిన కంపెనీయే కదా.. అని వెంటనే దానిని ఓకే చేస్తారు. స్కామర్లు సరిగ్గా దీనినే లక్ష్యంగా ఎంచుకున్నారు. కొన్ని మీడియా నివేదికల ప్రకారం, జీమెయిల్ స్కామ్ అనేది ఓ మెయిల్ ద్వారా ప్రారంభమవుతుంది. అది కూడా మీరు ఇంతకు ముందు ఆర్డర్ రిసీవ్ చేసుకున్న కంపెనీ పేరు మీద వస్తుంది. పాత కంపెనీయే కదా అని ఏమరపాటుతో ఉంటారు. అయితే వాస్తవానికి ఆ మెయిల్ అసలు కంపెనీ నుంచి వచ్చింది కాదు. స్కామర్లు ఆ కంపెనీ స్ట్రక్చర్, లోగోలను డూప్లికేట్ చేసి ఇలా మెయిల్ చేస్తారు. ఆ మెయిల్ లో మీరు మొన్ననే కదా ఓ డెలివరీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన కాంప్లిమెంటరీ మీకు రావాల్సి ఉంది. మెయిల్ లో వచ్చిన లింక్ పై క్లిక్ చేసి మీ అడ్రస్ కన్ ఫర్మ్ చేయండి అని చెబుతుంది. వినియోగదారుడు అది నమ్మి లింక్ పై క్లిక్ చేసి అడ్రస్ పూరించగానే.. నామినల్ గా కొంత మొత్తం చెల్లించాలని సూచిస్తుంది. దాని కోసం మీరు క్రెడిట్ కార్డు వాడేలా ప్రేరేపిస్తారు. కార్డు వివరాలు నమోదు చేసి ఆ నగదు చెల్లిస్తే.. వారు ఆ వివరాలు చోరీ చేసి మీ క్రెడిట్ కార్డులోని మొత్తాన్ని కొల్లగొడతారు.
దీని నుంచి ఎలా బయటపడాలి..
- మీకు ఎప్పుడైనా ఈ మెయిల్ రాగానే ముందుగా దాని యూఆర్ఎల్ ను మీరు తనిఖీ చేయాలి.
- అదే అక్షరాలను ఒరిగినల్ వెబ్ సైట్లో కూడా ఉందో లేదో తనిఖీ చేసుకోవాలి.
- అలాగే ఏ డెలివరీ కంపెనీ కూడా అదనంగా డబ్బులు చెల్లించమని చెప్పదు. అడ్మినిస్ట్రేషన్ ఫీజులు కట్టమని అడిగే వెంటనే అనుమానించండి.
- టైలర్లను కన్ ఫర్మ్ చేసుకొని మీరు మీ ఆర్డర్లను ట్రాక్ చేయవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..