AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon offers: రూ. 940కే 5జీ ఫోన్‌.. బంపర్‌ ఆఫర్‌ కొద్ది రోజులు మాత్రమే.. త్వరపడండి

మీరు వేగవంతమైన కనెక్టివిటీతో పాటు, అధిక సామర్థ్యంతో కూడిన పనితీరు కావాలనుకుంటే మీకిదే బెస్ట్‌ ఆప్షన్‌. 6జీబీ ర్యామ్‌ తో పాటు 128జీబీ ఇంటర్నెల్‌ స్టోరేజీ సామర్థ్యంతో వస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ పై అమెజాన్‌ లో బంపర్‌ ఆఫర్‌ ఉంది.

Amazon offers: రూ. 940కే 5జీ ఫోన్‌.. బంపర్‌ ఆఫర్‌ కొద్ది రోజులు మాత్రమే.. త్వరపడండి
Oppo A74 5g
Madhu
|

Updated on: Mar 21, 2023 | 1:53 PM

Share

దేశంలో 5జీ వేగంగా విస్తరిస్తోంది. ఎయిర్‌టెల్‌, జియో వంటి టెలికాం సంస్థలు 5జీ సేవలను ప్రజలకు చేరువచేస్తు‍న్నాయి. ఇదే క్రమంలో మార్కెట్లోకి ఇబ్బడిముబ్బడిగా 5జీ సపోర్టుతో కూడిన స్మార్ట్‌ ఫోన్లు వచ్చిపడుతున్నాయి. అన్ని బ్రాండ్లలోనూ 5జీ స్మార్ట్‌ ఫోన్లు మార్కెట్లో కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ఒప్పో సంస్థ కూడా పలు మోడళ్లను తీసుకొచ్చింది. దానిలో ఒప్పో ఏ74 5జీ ఒకటి. మీరు వేగవంతమైన కనెక్టవిటీతో పాటు, అధిక సామర్థ్యంతో కూడిన పనితీరు కావాలనుకుంటే మీకిదే బెస్ట్‌ ఆప్షన్‌. ఇది 6జీబీ ర్యామ్‌ తో పాటు 128జీబీ ఇంటర్నెల్‌ స్టోరేజీ సామర్థ్యంతో వస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ పై అమెజాన్‌ లో బంపర్‌ ఆఫర్‌ ఉంది. కంపెనీ అందిస్తున్న 26శాతం డిస్కౌంట్‌ తో పాటు అదనంగా పాత ఫోన్‌ ఎక్చేంజిపై భారీ డిస్కౌంట్‌ లభిస్తుంది. మొత్తమ్మీద అన్ని ఆఫర్లు కలిపి ఈ ఫోన్‌ రూ. 940కే పొందవచ్చు. అదెలాగో చూద్దాం రండి..

ఇది ఫోన్‌.. 

ఒప్పో ఏ74 5జీ స్మార్ట్‌ ఫోన్‌ 6GB/128GB కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంటుంది. లాంచింగ్ సమయంలో ఈ హ్యాండ్‌సెట్ ధర రూ. 20,990/- గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌ లో దీని ధర రూ. 15,490గా ఉంది.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..

ఒప్పో ఏ74 5జీ స్మార్ట్‌ ఫోన్‌ 90Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.49 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. 6జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ సామర్థ్యంతో వస్తోంది. దీనిలో క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్ 480 5జీ ప్రాసెసర్ ఉంటుంది. వెనుకవైపు 48ఎంపీ+2ఎంపీ+2ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు వైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది.ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంది. 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 18 వాట్స్‌ ఛార్జర్ ఇస్తారు. కనెక్టివిటీ పరంగా 5జీ డ్యూయల్ సిమ్‌లు, వైఫై 5, బ్లూటూత్ 5.1, జీపీఎస్‌, ఎన్‌ఎఫ్‌సీ, హెడ్‌ఫోన్ జాక్, టైప్-సి పోర్ట్‌ ఉన్నాయి. స్క్రీన్ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ఉంటుంది.  ఈ హ్యాండ్‌సెట్ ఫ్లూయిడ్ బ్లాక్, స్పేస్‌ సిల్వర్‌ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభ్యమవుతోంది.

ఇవి కూడా చదవండి

రూ. 940లకే పొందండిలా..

ప్రస్తుతం అమెజాన్‌లో దీని ధర రూ. 15,490గా ఉండగా.. మీ పాత ఫోన్‌ ఎక్స్‌ చేంజ్‌ పై దాదాపు రూ.14,550 వరకూ ఆదా చేసుకోవచ్చు. అంటే కేవలం రూ. 940లకే మీరు ఒప్పో ఏ74 5జీ స్మార్ట్‌ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..