Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Phone Hacked: మీ ఫోన్ హ్యాక్ లేదా మాల్వేర్ అటాక్ అయ్యిందేమో? ఇవే సంకేతాలు.. వెంటనే తెలుసుకోండి..

అసలు ఫోన్ హ్యాక్ అయినప్పుడు లేదా.. ఫోన్లో హైడ్ అయ్యి ఉంటూ మన కార్యకలాపాలను గమనిస్తుండే యాప్స్ మన ఫోన్లో ఇన్ స్టాల్ అయినప్పుడు అసలు మన ఫోన్ ఏవిధంగా ఉంటుంది? అది ఏవిధంగా ప్రవర్తిస్తుంది? అది చూపించే సంకేతాలు ఏంటి? అన్న అంశంలో కాస్త అవగాహన కలిగి ఉంటే మనకు నష్టం జరగకుండా కాపాడుకోవచ్చు. అవేంటో ఓసారి చూద్దాం రండి.

Phone Hacked: మీ ఫోన్ హ్యాక్ లేదా మాల్వేర్ అటాక్ అయ్యిందేమో? ఇవే సంకేతాలు.. వెంటనే తెలుసుకోండి..
Phone Hacked
Follow us
Madhu

| Edited By: Ravi Kiran

Updated on: Nov 03, 2023 | 8:20 AM

రెండు రోజులుగా మన దేశంలో ప్రతి పక్ష పార్టీలు అధికార పార్టీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులకు చెందిన ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని దుయ్యబడుతున్నారు. ఎందుకంటే వారు వాడే ఐ ఫోన్లకు గత మంగళవారం అంటే అక్టోబర్ 31న ఓ టెక్ట్ మెసేజ్ వచ్చింది. అదేంటంటే ‘స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్‌లు మీ ఐఫోన్‌ను లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చు’ అంటూ హెచ్చరిక వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్, శివసేన, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌తో సహా దేశంలోని పలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఈ తరహా హెచ్చరిక మెసేజ్ లు వచ్చాయి. దీంతో ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వం గూఢచర్యం చేస్తోందని సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఫోన్ హ్యాక్ అయినప్పుడు లేదా.. ఫోన్లో హైడ్ అయ్యి ఉంటూ మన కార్యకలాపాలను గమనిస్తుండే యాప్స్ మన ఫోన్లో ఇన్ స్టాల్ అయినప్పుడు అసలు మన ఫోన్ ఏవిధంగా ఉంటుంది? అది ఏవిధంగా ప్రవర్తిస్తుంది? అది చూపించే సంకేతాలు ఏంటి? అన్న అంశంలో కాస్త అవగాహన కలిగి ఉంటే మనకు నష్టం జరగకుండా కాపాడుకోవచ్చు. అవేంటో ఓసారి చూద్దాం రండి.

ఫోన్ బ్యాటరీ సాధారణం కంటే వేగంగా అయిపోతుంది.. బ్యాటరీ ప్రవర్తనను చూడటం ద్వారా మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా లేదా ఏదైనా మాల్ వేర్ ఫోన్లో ఉందా అనేది తెలుసుకోడానికి మొదటి మార్గం. పైగా ఇదే చాలా సులభమైన మార్గం. మీరు మీ ఫోన్‌ను చాలా తరచుగా ఛార్జ్ చేయాల్సి వస్తున్నా.. లేదా ఫోన్ బ్యాటరీ సాధారణం కంటే వేగంగా అయిపోతున్నా.. కొన్ని మాల్వేర్ లేదా మోసపూరిత యాప్‌లు మీ ఫోన్లో ఇన్ స్టాల్ అయ్యి ఉండే అవకాశం ఉంది. అవి నిరంతరం పని చేస్తాయి కాబట్టి మీ బ్యాటరీ త్వరగా అయిపోతుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న చాలా యాప్‌లు బ్యాటరీని కూడా తినేస్తాయి కాబట్టి బ్యాక్‌గ్రౌండ్‌లో పెద్ద సంఖ్యలో యాప్‌లు రన్ కావడం లేదని మీరు ముందుగా నిర్ధారించుకోవాలి.

ఫోన్ వేడెక్కుతుంది.. గేమింగ్ లేదా సినిమాలు చూడటం తదితర పనుల వల్ల ఫోన్ ఎక్కువసేపు వినియోగంలో ఉండి అది వేడెక్కడం సహజం. అయితే, మీరు ఏమీ చేయకుండానే మీ ఫోన్ వేడెక్కుతున్నట్లయితే, మీ ఫోన్‌ను హ్యాకర్లు నియంత్రించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియా అకౌంట్లలో.. వినియోగదారులు వారి ఫోన్‌లలో ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వంటి ఇతర ఖాతాలను ఉంటారు. మీ ఖాతాల్లో మీరు పోస్ట్ చేయకుండా మీరు చేసినట్లు ఇతర పోస్టులు ఉంటే వెంటనే వాటిని గుర్తించండి. మీ ఖాతాను సంరక్షించండి.

ఫోన్ పనితీరు స్లోగా ఉండటం.. మీ స్మార్ట్‌ఫోన్ అకస్మాత్తుగా స్లో అయిపోతుంది. నిదానంగా పని చేస్తుంది. దానికి కారణం స్టెల్త్ మాల్వేర్ అయ్యి ఉండవచ్చు.

ఫోన్ వింతగా ప్రవర్తిస్తుంది.. మీ ఫోన్ వింతగా పనిచేయడం ప్రారంభించిన సందర్భాలు ఉండవచ్చు. ఉదాహరణకు, యాప్‌లు తరచుగా క్రాష్ అవుతుండటం లేదా లోడ్ చేయడంలో విఫలమవుతుండటం జరుగుతంది. వినియోగదారు ఇన్‌పుట్ లేకుండా యాదృచ్ఛిక రీబూట్‌లు, షట్‌డౌన్‌లు అయిపోతుంటాయి. వీటికి కూడా మాల్వేర్ కారణం కావచ్చు.

విచిత్రమైన పాప్-అప్‌లు.. మీరు నకిలీ వైరస్ హెచ్చరికలు, ఇతర బెదిరింపు సందేశాల కోసం పుష్ నోటిఫికేషన్‌లను స్వీకరిస్తున్నట్లయితే, ఇది మీ మొబైల్ ఫోన్‌కు మాల్వేర్ సోకినట్లు సంకేతం కావచ్చు. దాని విధులను పూర్తి చేయడానికి వినియోగదారు ఇన్‌పుట్ అవసరం. అటువంటి నోటిఫికేషన్‌లు లేదా సందేశాలను ట్యాప్ చేయవద్దు.

యాప్‌ల జాబితాను తనిఖీ చేయండి.. వ్యక్తులు సాధారణంగా ఏ యాప్‌లను ఉపయోగిస్తున్నారో తెలుసుకుంటారు. మీ స్మార్ట్‌ఫోన్ యాప్ జాబితాను తనిఖీ చేయండి. మీరు గుర్తించని వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేయండి. ఎందుకంటే అవి స్పైవేర్ కావచ్చు. యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌లను డౌన్‌లోడ్ చేయండి. డౌన్‌లోడ్ చేయడానికి ముందు దాని స్పెల్లింగ్, డెవలపర్ సమాచారం, యాప్ వివరణను తనిఖీ చేయండి.

మొబైల్ డేటా వినియోగం పెరుగుతుంది.. మీ మొబైల్ డేటా వినియోగం అకస్మాత్తుగా పెరిగిందా మరియు సాధారణం కంటే ఎక్కువగా ఉందో లేదో తనిఖీ చేయండి. హానికరమైన యాప్‌లు లేదా సాఫ్ట్‌వేర్ మీ మొబైల్ డేటాను బ్యాక్‌గ్రౌండ్‌లో వినియోగించి ఉండవచ్చు.

మీ గ్యాలరీలో మీకు తెలియని ఫోటోలు.. మీ ఫోన్‌ల నుంచి పాత, ఉపయోగించలేని ఫోటోలను తీసివేయడం మంచి పద్ధతి. అయితే మీరు తీసిన ఫోటోలు, వీడియోలు మీ గ్యాలరీలో మీకు గుర్తులేకపోతే, మీ కెమెరాపై ఎవరైనా నియంత్రణ కలిగి ఉండవచ్చనే దానికి సంకేతం. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా, మీ ఫోన్ ఫ్లాష్‌ని అకస్మాత్తుగా ఆన్ చేసినట్లయితే, ఎవరైనా మీ పరికరాన్ని రిమోట్‌గా నియంత్రిస్తున్నట్లు గుర్తించాలి.

ఈ సంకేతాలను బట్టి మీ ఫోన్ హ్యాక్ లేదా మాల్వేర్ దాడికి గురైందని వెంటనే గుర్తించాలి. ఆ వెంటనే ఫోన్ ఫార్మేట్ చేసేయాలి. అవసరం అయితే సిమ్ ను కూడా తనిఖీ చేసి, బ్లాక్ చేసుకోవాలి. అన్ని బ్యాంకు ఖాతాలు, సోషల్ మీడియా ఖాతాలను సెక్యూర్ చేసుకొని, పాస్ వర్డ్ లు మార్చుకోవాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..