Spam Calls: స్పామ్‌ కాల్స్‌తో విసిగిపోయారా.? ఇలా చేయండి, దెబ్బకు కాల్స్‌ బంద్‌..

ఎక్కడో లోన్‌ కోసం ఎంక్క్వైరీ కోసం ఫోన్‌ నెంబర్‌ ఎంటర్‌ చేస్తాం, లేదా ఒక ఫ్లాట్‌ కొనుగోలు చేద్దామని ఆన్‌లైన్‌లో విచారణ చేపడుతాం, లోన్‌ కోసం ఆన్‌లైన్‌ సెర్చ్‌ చేస్తాం. ఇంకేముంది రోజుకు పది కాల్స్‌ వస్తాయి. రకరకా కంపెనీల నుంచి స్పామ్‌ కాల్స్‌ వస్తూనే ఉంటాయి. మనం అవసరం తీరిన తర్వాత కూడా ఫోన్‌ కాల్స్‌ సమస్య వేధిస్తూనే ఉంటుంది. అయితే ఇలా ఇబ్బంది పెట్టే స్పామ్‌ కాల్స్‌లో సింపుల్‌ చిట్కాలతో చెక్‌ పెట్టొచ్చు, ఇంతకీ స్పామ్‌ కాల్స్‌కు...

Spam Calls: స్పామ్‌ కాల్స్‌తో విసిగిపోయారా.? ఇలా చేయండి, దెబ్బకు కాల్స్‌ బంద్‌..
Spam Call
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 03, 2023 | 8:05 AM

స్పామ్‌ కాల్స్‌.. మొబైల్ ఫోన్‌ ఉపయోగించే వారు ప్రతీ ఒక్కరూ ఎదుర్కొనే సమస్యే ఇది. ఏదో ముఖ్యమైన పనిలో ఉంటాం అంతలోనే ఫోన్‌ మోగుతుంది. ఏదో ఇంపార్టెంట్‌ కాల్ కావొచ్చు అని లిఫ్ట్ చేసే సరికి, తీరా అది కస్టమర్‌ కేర్‌కు చెందిదైంది ఉంటుంది. ఇలాంటి అనుభవాన్ని మనలో చాలా మంది ఎదుర్కొనే ఉంటారు.

ఎక్కడో లోన్‌ కోసం ఎంక్క్వైరీ కోసం ఫోన్‌ నెంబర్‌ ఎంటర్‌ చేస్తాం, లేదా ఒక ఫ్లాట్‌ కొనుగోలు చేద్దామని ఆన్‌లైన్‌లో విచారణ చేపడుతాం, లోన్‌ కోసం ఆన్‌లైన్‌ సెర్చ్‌ చేస్తాం. ఇంకేముంది రోజుకు పది కాల్స్‌ వస్తాయి. రకరకా కంపెనీల నుంచి స్పామ్‌ కాల్స్‌ వస్తూనే ఉంటాయి. మనం అవసరం తీరిన తర్వాత కూడా ఫోన్‌ కాల్స్‌ సమస్య వేధిస్తూనే ఉంటుంది. అయితే ఇలా ఇబ్బంది పెట్టే స్పామ్‌ కాల్స్‌లో సింపుల్‌ చిట్కాలతో చెక్‌ పెట్టొచ్చు, ఇంతకీ స్పామ్‌ కాల్స్‌కు ఎలా అడ్డుకట్ట వేయాలి.? ఇందుకోసం పాటించాల్సిన టిప్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

* ఎస్‌ఎమ్‌ఎస్‌ ద్వారా స్పామ్‌ కాల్స్‌ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. ఇందుకోసం ముందుగా ఫోన్‌లోని మెసేజ్‌ ఓపెన్‌ చేసి. 1909 నెంబర్‌కి ‘బ్లాక్‌’ అనే మెసేజ్‌ పంపించాలి. వెంటనే మీకు మరో మెసేజ్‌ వస్తుంది. అందులో మీ పర్సనల్ నెంబర్‌ను ఎంటర్‌ చేయాలి, ఎలాంటి రకం కాల్స్‌ వద్దనుకుంటున్నారో సమాచారం అందించాలి. దీంతో 24 గంటల్లో స్పామ్‌ కాల్స్‌ నిలిపివేస్తారు.

* జియో యూజర్లు స్పామ్‌ కాల్స్‌కు చెక్‌ పెట్టేందుకు ఓ ఆప్షన్‌ను అందించింది. ఇందుకోసం ముందుగా ‘మై జియో’ యాప్‌ని ఫోన్‌ల ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తర్వాత యాప్‌ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం సర్వీస్‌ సెట్టింగ్‌లో డోంట్‌ డిస్బర్బ్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. ఇందులో ఈ క్యాటగిరీలో మీరు డీఎన్‌డీ సర్వీస్‌ను యాక్టివేట్ చేయాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకొని యాక్టివేట్ చేసుకుంటే చాలు

* ఇక ఒకవేళ మీరు ఎయిరల్‌ యూజర్లు అయితే.. ముందుగా airtel.in/airtel-dndకి వెళ్లాలి. అనంతరం వెబ్‌సైట్‌లో ముందుగా మీ నంబర్‌ను ఎంటర్ చేయాలి. అనంతరం మీ ఫోన్‌ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయగానే మీరు బ్లాక్ చేయాలనుకున్న క్యాటగిరీలను సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది.

* మీరు వోడఫోన్‌ ఐడియా నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తుంటే.. ముందుగా Discover.vodafone.in/dndకి వెళ్లాలి. అనంతరం మొబైల్ నంబర్, ఈ మెయిల్ ID, పేరును ఎంటర్‌ చేయాలి. తర్వాత మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న క్యాటగిరీలను సెలక్ట్ చేసుకొని ఓకే చేస్తే చాలు.

* వీటితో పాటు ఆండ్రాయిడ్ యూజర్లు స్పామ్‌ కాల్స్‌కు చెక్‌ పెట్టే అవకాశం ఉంది. ఇందుకోసం ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫోన్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి. అనంతరం కుడివైపు పైన మూడు చుక్కలపై క్లిక్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం కాలర్‌ ఐడీ అండ్ స్పామ్‌ ప్రొటెక్షన్‌పై క్లిక్‌ చేస్తే కాలర్‌ ఐడీ అండ్‌ స్పామ్‌ ప్రొటెక్షన్ ఫోన్‌లో యాక్టివేట్ అవుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..