WhatsApp: భారత్‌లో 71 లక్షల అకౌంట్స్‌ను బ్యాన్ చేసిన వాట్సాప్.. కారణం ఏంటో తెలుసా?
ఇదే క్రమంలో భారత ఐటీ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వ్యక్తుల అకౌంట్స్‌పై నిషేధం విధిస్తూ వస్తోంది వాట్సాప్. విద్వేషపూర్తి సందేశాలు, అశ్లీలతకు సంబంధించిన సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వ్యక్తుల అకౌంట్స్‌ను బాన్ చేస్తున్న వాట్సాప్ తాజాగా భారత్‌లో భారీగా అకౌంట్స్‌ను నిషేధించింది. ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఏకంగా 71.1 లక్షల వాట్సాప్ అకౌంట్స్‌ను బ్యాన్ చేసింది. ఐటీ నిబంధనలకు అనుగుణంగా సెప్టెంబర్..
ఫేక్ న్యూస్, రెచ్చగొట్టే సందేశాలు, అశ్లీత.. ఇలాంటి సున్నితమైన అంశాల వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఎన్నో రకాల చర్యలు తీసుకుంటూనే ఉంది. యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ ఎన్నో రకాల ఫీచర్లను తీసుకొస్తుంది. వినియోగదారుల భద్రతకు భరోసా కల్పిస్తోంది. అ
అయితే ఇదే క్రమంలో భారత ఐటీ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వ్యక్తుల అకౌంట్స్‌పై నిషేధం విధిస్తూ వస్తోంది వాట్సాప్. విద్వేషపూర్తి సందేశాలు, అశ్లీలతకు సంబంధించిన సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వ్యక్తుల అకౌంట్స్‌ను బాన్ చేస్తున్న వాట్సాప్ తాజాగా భారత్‌లో భారీగా అకౌంట్స్‌ను నిషేధించింది. ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఏకంగా 71.1 లక్షల వాట్సాప్ అకౌంట్స్‌ను బ్యాన్ చేసింది. ఐటీ నిబంధనలకు అనుగుణంగా సెప్టెంబర్ 71.1 లక్షల ఖాతాలను నిషేధించినట్లు తాజా ఇంండియా నెలవారీ నివేదికను ప్రకటించింది.
ఇందులో భాగంగా 2023 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీల మధ్య ఏకంగా 71,11,000 అకౌంట్లను నిషేధించినట్లు వాట్సాప్ పేర్కొంది. ఇందులో మొత్తం 25,71,000 అకౌంట్లను యూజర్ల నుంచి ఎలాంటి కంప్లైంట్స్ రాకముందే ముందస్తుగా నిషేధించినట్లు వాట్సాప్ తెలిపింది. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా వాట్సాప్ పలు ఖాతాలను నిషేధిస్తూ వస్తుంది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వాటిపై వాట్సాప్ తీసుకున్న సంబంధిత చర్యలు, అలాగే ప్లాట్‌ఫామ్‌లో దుర్వినియోగాన్ని అరికట్టడానికి వాట్సాప్ చేపట్టిన సొంత నివారణ చర్యలు తదితర వివరాలు ‘యూజర్ సేఫ్టీ రిపోర్ట్’లో ఉన్నాయి.
ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 1 నుంచి 30 మధ్య గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ నుంచి వాట్సాప్‌కు ఆరు ఆర్డర్‌లు రాగా అన్నింటినీ పరిష్కరించింది. ఇదిలా ఉంటే సెప్టెంబర్‌తో పోల్చితే ఆగస్టు నెలలో నిషేధించిన ఖాతాల సంఖ్య తక్కువ కావడం గమనార్హం. ఆగస్టలో ఏకంగా 74 లక్షల ఖాతాలను నేషేధించారు. వీటిలో 35 లక్షల ఖాతాలను వాట్సాప్ ముంస్తుగానే బ్యాన్ చేసింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..