Motorola Smart TV: రూ. 809 చెల్లిస్తే చాలు.. 43 అంగుళాల 4కే టీవీ మీ సొంతం.. నమ్మశక్యం కానీ ఆఫర్..
మోటోరోలా ఎన్విజన్ 43-అంగుళాల అల్ట్రా హెచ్ డీ(4కే) ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీపై ఫిప్ కార్ట్ ఏకంగా 42శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీనిని మీరు కేవలం రూ. 22,999లకే కొనుగోలు చేయొచ్చు. ఒకవేళ మీరు ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేయాలనుకుంటే కేవలం నెలకు రూ. 809 చెల్లిస్తే సరిపోతుంది.
మంచి బ్రాండ్ లో టీవీ కొనాలనుకొంటున్నారా? అది కూడా 4కే రిజల్యూషన్ తో కావాలనుకొంటున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. 43 అంగుళాల టీవీ అది కూడా అల్ట్రా హెచ్ డీ రిజల్యూషన్ తో కేవలం రూ. 21,499కే లభిస్తోంది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ ఈ ఆఫర్ ని అందిస్తోంది. ఇంతకీ ఏ కంపెనీ టీవీనో తెలుసా? ప్రపంచంలో అత్యుత్తమ బ్రాండ్ లలో ఒకటైన మోటోరోలా. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో ఆఫర్ నడుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇది ఆఫర్..
మోటోరోలా ఎన్విజన్ 43-అంగుళాల అల్ట్రా హెచ్ డీ(4కే) ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీపై ఫిప్ కార్ట్ ఏకంగా 42శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీనిని మీరు కేవలం రూ. 22,999లకే కొనుగోలు చేయొచ్చు. ఒకవేళ మీరు ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేయాలనుకుంటే కేవలం నెలకు రూ. 809 చెల్లిస్తే సరిపోతుంది. అదే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా నెలకు రూ. 1,126 చొప్పున ఈఎంఐ చెల్లించేలా టీవీ కొనుగోలు చేయొచ్చు.
బ్యాంకు ఆఫ్ బరోడా కార్డ్ పై 10శాతం తగ్గింపు..
ఒకవేళ మీరు ఈ మోటోరోలా ఎన్విజన్ 43-అంగుళాల అల్ట్రా హెచ్ డీ(4కే) ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీని బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు వినియోగించి కొనుగోలు చేస్తే మీకు 10శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంటే మీరు ఈ టీవీని కేవలం రూ. 21,499కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాక ఈ టీవీ కొనుగోలుపై ఫ్రీ డెమో, ఫ్రీ ఇన్ స్టాలేషన్ కూడా అందిస్తుందని ఫ్లిప్ కార్ట్ పేర్కొంది.
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇవి..
మోటోరోలా ఎన్విజన్ 43-అంగుళాల అల్ట్రా హెచ్ డీ(4కే) ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీలో 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ ఉంటుంది. ఇది బెజెల్ లెస్ డిజైన్ తో వస్తుంది. ఈ టీవీలో 330 నిట్స్ బ్రైట్ నెస్ ఉంటుంది. అత్యంత కచ్చితత్వంతో కూడిన క్లియర్ విజువల్స్ మనం చూడొచ్చు. మీ ఫోన్ నుంచి టీవీకి మిర్రర్ చేయొచ్చు. ఈ టీవీలో 2జీబీ ర్యామ్ ఉంటుంది. బిల్ట్ ఇన్ గ్రాఫిక్స్ యూనిట్ ఉంటుంది. దీంతో సులభంగా, వేగంగా స్పందిస్తుంది. గేమ్స్ ఆడే వారి కోసం అయితే ఇది బెస్ట్ ఆప్షన్. ఇక సౌండ్ క్లారిటీ విషయానికి వస్తే 20 వాట్ల స్పీకర్స్, 4 సౌండ్ మోడ్లు ఉన్నాయి. అదిరిపోయే సౌండ్ క్లారిటీని అందిస్తుంది. దీనిలో మీడియా టెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంటుంది. మల్టీ టాస్కింగ్ కు బాగా ఉపకరిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..