AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartwatch: యాపిల్ లుక్‌లో సరికొత్త స్మార్ట్ వాచ్.. అతి పెద్ద డిస్ ప్లే.. అదిరే ఫీచర్లు.. ధర కూడా తక్కువే..

ప్రముఖ ఫిట్ నెస్ బ్రాండ్ కల్ట్ డాట్ స్పోర్ట్ ఓ స్మార్ట్ వాచ్ ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. యాక్టివ్ టీ స్మార్ట్ వాచ్ పేరిట దీనిని విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ లో అతి పెద్ద డిస్ ప్లే ఉంటుంది. డిస్ ప్లే సైజ్ 2.01 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే ఉంటుంది.

Smartwatch: యాపిల్ లుక్‌లో సరికొత్త స్మార్ట్ వాచ్.. అతి పెద్ద డిస్ ప్లే.. అదిరే ఫీచర్లు.. ధర కూడా తక్కువే..
Cult.sport Active T Smartwatch
Madhu
|

Updated on: Jul 06, 2023 | 4:00 PM

Share

ప్రముఖ ఫిట్ నెస్ బ్రాండ్ కల్ట్ డాట్ స్పోర్ట్ ఓ స్మార్ట్ వాచ్ ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. యాక్టివ్ టీ స్మార్ట్ వాచ్ పేరిట దీనిని విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ లో అతి పెద్ద డిస్ ప్లే ఉంటుంది. డిస్ ప్లే సైజ్ 2.01 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే ఉంటుంది. ఇటీవల కాలంలో తక్కువ ధరలోనే స్మార్ట్ వాచ్ కంపెనీలు లాంచ్ చేస్తున్నాయి. ఫైర్ బోల్ట్, బోట్ వంటి కంపెనీలు అత్యాధునిక ఫీచర్లతో కూడిన వాచ్ లను లో బడ్జెట్ లోనే అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కల్ట్ డాట్ స్పోర్ట్ కంపెనీ కూడా తక్కువ ధరలోనే ఈ సరికొత్త స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

యాక్టివ్ టీ స్మార్ట్ వాచ్ స్పెసిఫికేషన్లు ఇవి..

కల్ట్ డాట్ స్పోర్ట్ యాక్టివ్ టీ స్మార్ట్ వాచ్ లో 2.01 అంగుళాల స్క్వేర్ డయల్ 240 x 296 పిక్సెల్ హెచ్ డీ డిస్‌ప్లే సన్నని బెజెల్‌లతో వస్తుంది. దీని డిజైన్ యాపిల్ వాచ్‌ని తలపిస్తుంది. 200+ క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్‌లకు కూడా ఇది మద్దతు ఇస్తుంది. ఈ సింగిల్-చిప్ బ్లూటూత్ కు మద్దతు ఇస్తుంది. డిజిటల్ మైక్రోఫోన్, స్పీకర్‌తో అనుబంధంగా ఉంటుంది. వన్-ట్యాప్ పెయిరింగ్, క్విక్ యాక్సెస్ డయల్‌ప్యాడ్ వంటి కొన్ని ముఖ్య ఫీచర్లు ఉన్నాయి. దీనిలో బ్యాటరీ ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే గరిష్టంగా 7 రోజుల స్టాండ్‌బై సమయాన్ని అందిస్తుంది. అవసరమైనప్పుడు, 90 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. అదనంగా, నీరు, ధూళి నిరోధకత కోసం అధికారిక ఐపీ67 రేటింగ్ ఉంది.

యాక్టివ్ టీ స్మార్ట్ వాచ్ ఫీచర్లు ఇవే..

ఈ స్మార్ట్ వాచ్ లో 100 స్పోర్ట్స్ మోడ్‌లు ఉంటాయి. రన్నింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ వంటి వ్యాయామాలను ట్రాక్ చేయవచ్చు. మీ ప్రోగ్రెస్, మెట్రిక్‌ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మీరు కల్ట్ స్పోర్ట్ వాచ్ యాప్ ను వినియోగించుకోవచ్చు. ఇంకా, మీ ఫిట్‌నెస్ ప్రయాణం వైపు మిమ్మల్ని ముందుకు నడిపించడానికి, స్మార్ట్‌వాచ్ మూడు నెలల కల్ట్ పాస్ హోమ్‌కి ఉచిత యాక్సెస్‌ ను అందిస్తోంది. 1000+ హోమ్ వర్కౌట్ వీడియోలకు యాక్సెస్‌ ఉంటుంది. దీనిలో బ్లడ్ ప్రెజర్ మానిటర్, హార్ట్ రేట్ సెన్సార్, ఆక్సిజన్ సెన్సార్, స్లీప్ ట్రాకింగ్, పీరియడ్ ట్రాకింగ్ వంటి మరెన్నో హెల్త్ ఫీచర్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

యాక్టివ్ టీ స్మార్ట్ వాచ్ ధర, లభ్యత..

కల్ట్ డాట్ స్పోర్ట్ యాక్టివ్ టీ స్మార్ట్ వాచ్ వాస్తవ ధర రూ. 2,499. కాగా ప్రారంభ ఆఫర్ కింద రూ. 1,599 కే దీనిని కొనుగోలు చేయొచ్చు. మీరు దీన్ని కల్ట్ డాట్ స్పోర్ట్ వెబ్‌సైట్, ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ నుంచి కొనుగోలు చేయొచ్చు. ఈ స్మార్ట్ వాచ్ గ్రే, బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆగస్టులో బ్యాంకులకు ఏకంగా 14 రోజులు సెలవులు.. RBI హాలిడే లిస్ట్!
ఆగస్టులో బ్యాంకులకు ఏకంగా 14 రోజులు సెలవులు.. RBI హాలిడే లిస్ట్!
సచిన్ సీక్రెట్ ఇదా.. ప్రతి మ్యాచ్‌కు ముందు ఈ చాయ్ ఉండాల్సిందేనట..
సచిన్ సీక్రెట్ ఇదా.. ప్రతి మ్యాచ్‌కు ముందు ఈ చాయ్ ఉండాల్సిందేనట..
టీమిండియాకు అసలైన గుడ్ న్యూస్ మయాంక్ యాదవ్
టీమిండియాకు అసలైన గుడ్ న్యూస్ మయాంక్ యాదవ్
ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం..ఢిల్లీ, ముంబై నగరాలకంటే పెద్దది
ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం..ఢిల్లీ, ముంబై నగరాలకంటే పెద్దది
కృష్ణ, ఎన్టీఆర్ మధ్య వివాదం రేపిన సినిమా..!
కృష్ణ, ఎన్టీఆర్ మధ్య వివాదం రేపిన సినిమా..!
అరెరె ఇంత ఈజీనా.. కల్తీ పాలని ఇంట్లోనే ఇలా గుర్తించండి..
అరెరె ఇంత ఈజీనా.. కల్తీ పాలని ఇంట్లోనే ఇలా గుర్తించండి..
ఆగస్టు 1 నుంచి తత్కాల్‌ టికెట్‌ బుకింగ్‌ సమయాల్లో మార్పులు..!
ఆగస్టు 1 నుంచి తత్కాల్‌ టికెట్‌ బుకింగ్‌ సమయాల్లో మార్పులు..!
కళ్ళు సరిగా కనబడని వాళ్ళు ఇది కప్పు తింటే కంటి చూపు డబుల్
కళ్ళు సరిగా కనబడని వాళ్ళు ఇది కప్పు తింటే కంటి చూపు డబుల్
వైభవ్ సూర్యవంశీ మళ్లీ మైదానంలోకి దిగేది ఎప్పుడో తెలుసా?
వైభవ్ సూర్యవంశీ మళ్లీ మైదానంలోకి దిగేది ఎప్పుడో తెలుసా?
సంజు కంటే అభిషేక్ తోపా.. మరెందుకీ వివక్ష? మండిపడ్డ భారత క్రికెటర్
సంజు కంటే అభిషేక్ తోపా.. మరెందుకీ వివక్ష? మండిపడ్డ భారత క్రికెటర్