Google: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి గూగుల్ గుడ్ న్యూస్.. ఇకపై..
టెక్నాలజీకి సంబంధించిన ప్రతీ రంగంలో కృత్రిమ మేథ అనివార్యంగా మారింది. ఈ క్రమంలోనే ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ సైతం ఏఐ ఫీచర్‌ను యాడ్ చేసిన విషయం తెలిసిందే. సెర్చ్ ఇంజన్‌కు మరింత మెరుగైన సేవలు అందించే క్రమంలో గూగుల్ ఏఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాయిస్ నుంచి టెక్ట్స్ రూపంలో మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తూ గూగుల్ ఈ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ క్రమంలోనే...

టెక్ మార్కెట్లో పెరుగుతోన్న పోటీ నేపథ్యంలో కంపెనీలు యూజర్లను పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేస్తున్నాయి. కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. పోటీ నేపథ్యంలో వినియోగదారులను కోల్పోకూడదనే ఉద్దేశంతో సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత టెక్ మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి.
టెక్నాలజీకి సంబంధించిన ప్రతీ రంగంలో కృత్రిమ మేథ అనివార్యంగా మారింది. ఈ క్రమంలోనే ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ సైతం ఏఐ ఫీచర్‌ను యాడ్ చేసిన విషయం తెలిసిందే. సెర్చ్ ఇంజన్‌కు మరింత మెరుగైన సేవలు అందించే క్రమంలో గూగుల్ ఏఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాయిస్ నుంచి టెక్ట్స్ రూపంలో మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తూ గూగుల్ ఈ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతోన్న వారి కోసం గూగుల్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.
సైన్స్, మ్యాథ్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ వంటి సబ్జెక్టుల ప్రశ్నలకు సమాధానాలు కనుగునేలా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. సెర్చ్ బార్‌లో మీ ప్రశ్నకు టైప్ చేస్తే చాలు ప్రశ్నలకు గూగుల్ బదులిస్తుంది. చాలా సింపుల్‌గా అర్థమయ్యేలా యూజర్ల కోసం ప్రత్యేక ఫీచర్‌ను అందించనుంది. ముఖ్యంగా గణితంలో క్లిష్టమైన ప్రశ్నలు, సమీకరణాలకు సమాధానాలు కావాలంటే ఇకపై యూజర్లు గూగుల్ సెర్చ్ బార్‌లో క్లిక్ చేస్తే చాలు సమాధానం వస్తుంది. సెర్చ్ బార్‌లో ప్రశ్నను టైప్ చేయడం లేదా, లెన్స్ ద్వారా ప్రశ్నకు స్కాన్ చేసినా వెంటనే ఆన్సర్ పొందొచ్చు.
చాట్ జీపీటీకి ఆదరణ పెరుగుతోన్న క్రమంలో గూగుల్ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో.. సైన్స్, ఫిజిక్స్, ఇంజనీరింగ్ సబ్జెక్టులు, సంక్లిష్టమైన కాలిక్యులస్, త్రికోణమితి సమస్యలకు కూడా గూగుల్ సమాధానం చెప్పేస్తుంది. ఇక సమాధానాలను కూడా అర్థవంతంగా, 3డీ కాన్సెప్ట్‌తో స్టెప్ బై స్టెప్ సమాధానం అందిస్తుంది. దీంతో యూజర్లు సులభంగా సమాధానాలను తెలుసుకోవచచు. గతంలో కూడా గూగుల్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చినా, ఎక్కువ సమయం పట్టేది అయితే ప్రస్తుతం తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌తో క్షణాల్లో సమాధానం తెలుసుకోవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..