iQOO 12 5G: ఐకూ నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. అల్టిమేట్ ఫీచర్స్, స్టన్నింగ్ లుక్..
ఐకూ 12 సిరీస్‌లో భాగంగా ఈ కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. ఐకూ 12, ఐకూ 12 ప్రో పేరుతో రెండు కొత్త ఫోన్‌లను తీసుకురానున్నారు. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. డిసెంబర్ 12వ తేదీన ఐకూ 12 సిరీస్ ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు. అమెజాన్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఐకూ 11 సిరీస్‌కు కొనసాగింపుగా...

భారత్‌లో 5జీ నెట్‌వర్క్ విస్తృతి రోజురోజుకీ పెరుగుతోన్న నేపథ్యంలో 5జీ ఫోన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థలు సరికొత్త మోడల్స్‌ను లాంచ్ చేస్తూ వస్తున్నాయి. 5జీ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చిన తొలినాళ్లలో ఫోన ధరలు భారీగా ఉండగా, కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రంమలోనే తాజాగా చైనాకు చెందిన మరో స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐకూ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనుంది.
ఐకూ 12 సిరీస్‌లో భాగంగా ఈ కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. ఐకూ 12, ఐకూ 12 ప్రో పేరుతో రెండు కొత్త ఫోన్‌లను తీసుకురానున్నారు. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. డిసెంబర్ 12వ తేదీన ఐకూ 12 సిరీస్ ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు. అమెజాన్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఐకూ 11 సిరీస్‌కు కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు.
ఇక ఐకూ 12 స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే 6.78 ఇంచెస్‌తో కూడిన 1.5కే బీఓఈ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందించారు. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేయనున్న ఈ ఫోన్‌లో 16 జీబీ ర్యామ్‌ను అందించనున్నారు. అలాగే 1 టీబీ స్టోరేజ్ ఈ ఫోన్ సొంతం. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్స్‌తో కూడి రెయిర్ కెమెరాను అందించనున్నారు. అలాగే సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు.
ఇక బ్యాటరీ విషయానికొస్తే ఐకూ 12 సిరీస్‌లో 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. ఇక ఈ ఫోన్‌లో దుమ్ము, ధూళి, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ64 రేటింగ్‌ను అందించనున్నారు. డిసెంబర్ 12వ తేదీన లాంచింగ్ సమయంలోనే ఈ ఫోన్ ధరకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్లు కంపెనీ పేర్కొంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..