Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: వాట్సాప్‌లో మరో అమేజింగ్‌ ఫీచర్‌.. మీ భద్రత మరింత భద్రం.

అన్‌నోన్‌ నెంబర్స్‌, మీ కాంటాక్ట్‌లో సేవ్‌లేని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ రింగ్‌ కాకుండా సైలెన్స్ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్‌కు యూజర్ల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ఫీచర్‌కు కొనసాగింపుగా వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఐపీ అడ్రస్‌, లొకేషన్‌ ప్రొటెక్షన్‌ ఫెసిలిటీ పేరుతో సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది వాట్సాప్‌. ఈ ప్రొటెక్షన్‌ ఫీచర్‌తో...

WhatsApp: వాట్సాప్‌లో మరో అమేజింగ్‌ ఫీచర్‌.. మీ భద్రత మరింత భద్రం.
Whatsapp
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 02, 2023 | 7:59 AM

వాట్సాప్‌ మెసేజింగ్ యాప్‌కు ఇంతటి క్రేజ్‌ దక్కడానికి ప్రధాన కారణం ఇందులోని సెక్యూరిటీ ఫీచర్స్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూజర్ల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చే వాట్సాప్‌ అందుకు అనుగుణంగా ఎన్నో సెక్యూరిటీ ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ప్రొఫెల్‌ ఫొటోలు, స్టేటస్‌లు విషయంలో పలు ప్రైవసీ ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

అన్‌నోన్‌ నెంబర్స్‌, మీ కాంటాక్ట్‌లో సేవ్‌లేని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ రింగ్‌ కాకుండా సైలెన్స్ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్‌కు యూజర్ల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ఫీచర్‌కు కొనసాగింపుగా వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఐపీ అడ్రస్‌, లొకేషన్‌ ప్రొటెక్షన్‌ ఫెసిలిటీ పేరుతో సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది వాట్సాప్‌. ఈ ప్రొటెక్షన్‌ ఫీచర్‌తో ఆడియో కాల్స్‌, వీడియో కాల్స్‌ చేసినా లొకేషన్‌, ఐపీ అడ్రస్‌ వంటి వివరాలు అవతలి వ్యక్తులకు తెలియనివ్వకుండా చేసుకోవచచు.

సాధారణంగా ఈ ఫీచర్‌ అందుబాటులో లేని సమయంలో యూజర్లు ఎక్కడి నుంచి కాల్‌ చేస్తున్నారన్న విషయాన్ని లొకేషణ్‌, ఐపీ అడ్రస్‌ ఆధారంగా తెలుసుకునే అవకాశం ఉండేది, అయితే ప్రస్తుతం వాట్సాప్‌ తీసుకొచ్చిన ఈ ఫీచర్‌తో ఇకపై ఈ సమస్య ఉండదు. వాట్సాప్‌ ఇప్పటికే ఈ ఫీచర్‌ను కొందరు ఎంపిక చేసిన యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మిగతా యూజర్లకు కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది.

ఈ ఫీచర్‌న్‌ యాక్టివేట్ చేసుకోవాలంటే ముందుగా వాట్సాప్‌ యాప్‌ ఓపెన్‌ చేయాలి. అనంతరం కుడివైపు త్రీ డాట్స్‌ మెనూలోని ప్రైవసీలోకి వెళ్లాలి. అనంతరం అక్కడ ఉన్న అడ్వాన్స్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్‌ ఇన్‌ కాల్స్‌ అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. దీంతో మీరు ఎక్కడుండి ఫోన్‌ మాట్లాడుతున్నారన్న విషయాన్ని అవతలి వ్యక్తి తెలుసుకునే అవకాశం ఉండదు. అయితే ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవడం వల్ల కాల్ క్వాలిటీ కొంత తగ్గుతుందని వాట్సాప్‌ తెలిపింది.

యూజర్లకు ఈ కొత్త ఫీచర్‌ అదనపు సెక్యూరిటీ కల్పిస్తుందని వాట్సాప్‌ వాబీటా ఇన్‌ఫో తెలిపింది. ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓస్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. మరెందుకు ఆలస్యం మీకు కూడా ఈ కొత్త ఫీచర్‌ వచ్చేందేమో చెక్‌ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి. లేదంటే.. వాట్సాప్‌ లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ అవ్వండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..