AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart: ఫ్లిప్‌కార్ట్ నుండి అద్భుతమైన ఆఫర్.. రూ.75,999 ఫోన్‌ కేవలం రూ.32 వేలకే!

గూగుల్ ప్రసిద్ధ స్మార్ట్‌ఫోన్ గూగుల్ పిక్సెల్ 8ని అతి తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం మీకు త్వరలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన చిప్‌సెట్, అద్భుతమైన డిజైన్‌కు ప్రసిద్ధి చెందింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024లో మీరు దీన్ని అతి తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశాన్ని పొందుతారు..

Flipkart: ఫ్లిప్‌కార్ట్ నుండి అద్భుతమైన ఆఫర్.. రూ.75,999 ఫోన్‌ కేవలం రూ.32 వేలకే!
Subhash Goud
|

Updated on: Sep 22, 2024 | 4:46 PM

Share

గూగుల్ ప్రసిద్ధ స్మార్ట్‌ఫోన్ గూగుల్ పిక్సెల్ 8ని అతి తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం మీకు త్వరలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన చిప్‌సెట్, అద్భుతమైన డిజైన్‌కు ప్రసిద్ధి చెందింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024లో మీరు దీన్ని అతి తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశాన్ని పొందుతారు. గూగుల్ పిక్సెల్ 8 రూ.75,999తో ప్రారంభమైంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో రాబోయే సేల్‌లో అదే ఫోన్ రూ.32,000 తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది.

టీజర్ ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో గూగుల్ పిక్సెల్ 8 ధర రూ.32,000 కంటే తక్కువకు తగ్గుతుంది. ఈ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో అతిపెద్ద సేల్‌గా పరిగణిస్తారు. ఈ సంవత్సరం గూగుల్‌ పిక్సెల్‌ 9ని ప్రారంభించింది. గత జనరేషన్ ఫోన్‌ కాబట్టి ఈ ధరను తగ్గించనున్నట్లు తెలుస్తోంది.

ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్:

ఇవి కూడా చదవండి

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్‌లో గూగుల్ పిక్సెల్ ధర రూ.31,999. అయితే, ఈ ధరలో బ్యాంక్ ఆఫర్‌లు, క్యాష్‌బ్యాక్, ఎక్స్చేంజ్, ఈఎంఐ ఆప్షన్లు ఉన్నాయి. ఇలాంటి కారణాల వల్ల ఈ ఫోన్‌ ధర తగ్గే అవకాశం కనిపిస్తోంది. మీరు ఈ ఫోన్‌ని ఈఎంఐలో కొనుగోలు చేయాలనుకుంటే, నెలకు రూ. 5,554 ఈఎంఐలో కొనుగోలు చేయవచ్చు.

స్పెసిఫికేషన్‌లు:

గూగుల్‌ పిక్సెల్‌ 8 ఫీచర్ల గురించి మాట్లాడితే, ఈ ఫోన్ 6.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది కాకుండా, గొరిల్లా గ్లాస్‌లో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ గరిష్ట బ్రైట్‌నెస్‌ 2,000 నిట్‌ల వరకు ఉంటుంది. ఇది 8జీబీ ర్యామ్‌+256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీతో ఉంటుంది.

చిప్‌సెట్, కెమెరా:

పనితీరు కోసం టెన్సర్ G3 చిప్‌సెట్‌, టైటాన్ M2 కోప్రాసెసర్ మద్దతు అందించింది. ఈ ఫోన్ Android 14 OSలో నడుస్తుంది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు 7 సంవత్సరాల పాటు అందుబాటులో ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 27W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,575mAh బ్యాటరీకి మద్దతు ఇస్తుంది. పిక్సెల్ 8లో 50MP ప్రధాన కెమెరా ఉంటుంది. ఇది OISతో వస్తుంది. ఇది కాకుండా, 12MP అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంది. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 10.5MP ఫ్రంట్ కెమెరా అందించింది కంపెనీ.

Google Mobile

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి