Google New Features: గూగుల్ మ్యాప్స్ న్యూ ఫీచర్స్.. అలా చేసి ఇకపై డబ్బు ఆదాచేసుకునే అవకాశం..
Google New Features: గూగుల్ మ్యాప్స్ లో త్వరలోనే కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. యూజర్లు వెళ్లాలనుకుంటున్న ప్రాంతాలకు దారిని చూపడంతో పాటు ఇప్పటికే ఎన్నో ఫీచర్లతో Google Maps వినియోగదారులకు సేవలు అందిస్తోంది.
Google New Features: గూగుల్ మ్యాప్స్ లో త్వరలోనే కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. యూజర్లు వెళ్లాలనుకుంటున్న ప్రాంతాలకు దారిని చూపడంతో పాటు ఇప్పటికే ఎన్నో ఫీచర్లతో Google Maps వినియోగదారులకు సేవలు అందిస్తోంది. రానున్న రోజుల్లో అప్‌డేట్ ద్వారా అందరికీ నూతన ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణించే రోడ్‌పై ఎన్ని టోల్ గేట్స్(Toll Gates) ఉంటుంటాయి. గమ్యానికి చేరేలోపు టోల్ ఫీజు ఎంత అవుతుందనే సమాచారాన్ని గూగుల్ మ్యాప్స్ తన కొత్త ఫీచర్లో వాహనదారులకు ఇకపై అందించనుంది. ఒకవేళ టోల్ గేట్లు లేని రూట్ కావాలన్నా దాని ప్రకారం మార్గాన్ని సూచించనుంది. వీటితో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ సదుపాయాన్ని కూడా తెస్తోంది.
మీరు వెళ్లాలనుకుంటున్న దారిలో గమ్య స్థానానికి చేరే లోపు ఎన్ని టోల్ ప్లాజాలు ఉంటాయి.. అక్కడ ఎంత ఖర్చు అవుతుందన్న అంచనా వివరాలను చూపించేలా Google Maps కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఎక్కడికి వెళ్లాలో మ్యాప్స్‌లో టైప్ చేసి.. డైరెక్షన్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ కనిపిస్తుంది. టోల్ చార్జీలను చూపించేందుకు See toll pass prices అనే ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ టోల్స్ లేని దారిలో వెళ్లాలనుకున్నా.. ఆ దారులను కూడా గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది. మధ్యలో టోల్ గేట్లు లేకుండా గమ్య స్థానానికి చేరే మార్గం కావాలనుకుంటే Avoid tolls ఫీచర్‌ను ఎంచుకోవచ్చు. ఒకవేళ టోల్స్ లేని మార్గం బాగా ఉండి దాన్ని ఎంచుకుంటే వాహనదారులు డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. అవాయిడ్ టోల్స్ ఫీచర్ గతం నుంచే మెనూలో ఉన్నా.. మరింత కచ్చిత్వంతో చేంజ్ టోల్ సెట్టింగ్స్‌లోనూ పొందుపరుస్తోంది గూగుల్. భారత్, అమెరికాతో పాటు మరిన్ని దేశాల్లో ఈ ఫీచర్లను గూగుల్ మ్యాప్స్ తీసుకొచ్చింది. నావిగేషన్ మ్యాప్స్‌లో మరింత సమాచారాన్ని కూడా గూగుల్ తీసుకొస్తోంది. ముఖ్యంగా వెళ్లే మార్గంలో ట్రాఫిక్ సిగ్నల్స్‌ను కూడా చూపించే సదుపాయాన్ని ప్రవేశపెడుతోంది. అలాగే కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో రోడ్ల విస్తీర్ణాన్ని కూడా తెలియజేయనుంది.
ఇవీ చదవండి..
Azim Premji: తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెడతామన్న అజీమ్ ప్రేమ్‌జీ.. ప్రభుత్వ పనితీరుపై కితాబు..
ELSS Investment: పన్ను ఆదాకోసం ELSS పెట్టుబడులు సరైన నిర్ణయమేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..