iPhone 14 Offer: ఐఫోన్‌ 14పై భారీ డిస్కౌంట్‌.. 13 కంటే తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం

త్వరలోనే మార్కెట్లోకి ఐఫోన్‌ 15 సిరీస్‌ను లాంచ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యాపిల్‌ మెగా ఈవెంట్‌లో ఐఫోన్‌ 15 సిరీస్‌తో పాటు మరికొన్ని ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ లాంచ్‌ చేయనున్నారు. ఈ క్రమంలోనే ఐఫోన్‌ 15 మార్కెట్లోకి లాంచ్‌ అవుతోన్న తరుణంలో ఐఫోన్‌ 14 ప్రో ఫోన్‌లను క్రమంగా నిలిపివేయనున్నారు. ఇప్పటికే ఐఫోన్‌ 14 తయారీ కూడా ఆపేసినట్లు తెలుస్తోంది. దీంతో ఐఫోన్‌ 14 ప్రో...

iPhone 14 Offer: ఐఫోన్‌ 14పై భారీ డిస్కౌంట్‌.. 13 కంటే తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం
Iphone 14

Updated on: Sep 04, 2023 | 12:45 PM

టెక్‌ మార్కెట్లో ఐఫోన్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జీవితంలో ఒక్కసారైనా ఐఫోన్‌ను ఉపయోగించాలని ఆశపడే వారు మనలో చాలా మంది ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐఫోన్‌లో ఉండే ఫీచర్లు, పనితీరు, సెక్యూరిటీకి సంబంధించిన అప్‌డేట్స్ ఈ ఫోన్‌కు అంతటి క్రేజ్‌ రావడానికి కారణాలుగా చెప్పొచ్చు. ఎప్పటికప్పుడ కొంగొత్త ఫీచర్స్‌తో అప్‌డేట్స్ వెర్షన్స్ను తీసుకొస్తూనే ఉంది యాపిల్‌ కంపెనీ. ఈ క్రమంలోనే తాజాగా ఐఫోన్‌ 15 సిరీస్‌ను తీసుకొచ్చే పనిలో పడింది యాపిల్‌.

త్వరలోనే మార్కెట్లోకి ఐఫోన్‌ 15 సిరీస్‌ను లాంచ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యాపిల్‌ మెగా ఈవెంట్‌లో ఐఫోన్‌ 15 సిరీస్‌తో పాటు మరికొన్ని ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ లాంచ్‌ చేయనున్నారు. ఈ క్రమంలోనే ఐఫోన్‌ 15 మార్కెట్లోకి లాంచ్‌ అవుతోన్న తరుణంలో ఐఫోన్‌ 14 ప్రో ఫోన్‌లను క్రమంగా నిలిపివేయనున్నారు. ఇప్పటికే ఐఫోన్‌ 14 తయారీ కూడా ఆపేసినట్లు తెలుస్తోంది. దీంతో ఐఫోన్‌ 14 ప్రో పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌ను ఏకంగా రూ. 66,999కే సొంతం చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఐఫోన్‌ 14 ప్రోపై ఊహకందని డిస్కౌంట్‌ను అందిస్తోంది. దాదాపు 50 శాతం డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను అందిస్తున్నారు. గతేడాది ఐఫోన్‌ 14 ప్రో లాంచ్‌ అయిన సమయంలో ఫోణ్‌ ధర రూ. 1,29,900గా ఉండేది. అయితే ప్రస్తుతం అన్ని ఆఫర్స్‌ కలుపుకొని ఈ ఫోన్‌ను రూ. 66,999కి సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. అంతేకాకుండా ఏదైనా స్మార్ట్ ఫోన్‌ ఎక్సేంజ్‌ చేయడం ద్వారా కూడా ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఎక్సేంజ్‌ ద్వారా గరిష్టంగా రూ. 50,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

ఇవి కూడా చదవండి

ఐఫోన్‌ 14 ప్రో ఫీచర్లు..

ఇదిలా ఉంటే ఐఫోన్‌ 14 ప్రో ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.1 ఇంచెస్‌ డిస్‌ప్లేను అందించారు. సూపరట్ రెటినా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లే ఈ స్మార్ట్ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఐఫోన్‌ 14 ప్రో ఏ16 బయోపిక్‌ చిప్‌తో పని చేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 48 మెగా పిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. కెమెరా అద్భుత క్లారిటీతో ఉండడం విశేషం.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..