- Telugu News Photo Gallery Technology photos In Just 2 hours 30,000 Realme gt 5 5g smartphone sold, check here for features and price details
Realme GT 5 5G : రెండు గంటల్లో 30 వేల ఫోన్‌లు అమ్ముడుపోయాయి.. ఇంతకీ ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటనేగా
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మీ తాజాగా మార్కట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్‌మీ జీటీ 5 పేరుతో లాంచ్ చేసిన ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేయగా త్వరలోనే భారత మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ఇటీవల చైనాలో ఈ ఫోన్ తొలి సేల్ నిర్వహించగా అనూహ్య స్పందన వచ్చింది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? ఈ ఫోన్‌లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
Updated on: Sep 04, 2023 | 8:28 AM

రియల్‌మీ జీటీ 5 5జీ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇందులో 24 జీబీ ర్యామ్‌ను అందించారు. ప్రస్తుతం వరల్డ్ వైడ్‌గా 24 జీబీతో పనిచేస్తున్న స్మార్ట్ ఫోన్‌లు కేవలం రెండు మాత్రమే ఉన్నాయి. అందులో రియల్‌మీ జీటీ5 ఒకటి.

ఇక ఇటీవల ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించి నిర్వహించిన తొలి సేల్‌లో రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరిగాయి. కేవలం 2 గంటల్లోనే ఏకంగా 30 వేలకిపైగా ఫోన్‌లు అమ్ముడు పోవడం విశేషం.

ఈ ఫోన్ ధర విషయానికొస్తే 12 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ ధర రూ. 35,000కాగా, 16 జీబీ ర్యామ్, 512 స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,500కాగా, 24 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 43,000గా ఉంది.

ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.74 ఇంచెస్‌తో కూడిన 1.5 కే ఓ ఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు.

కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఆన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఇచ్చారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 240 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4600 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.





























