HP Touch Chromebook: రూ. 10వేలలోనే టచ్‌ స్క్రీన్‌ ల్యాప్‌టాప్‌.. ఇలాంటి ఆఫర్‌ మళ్లీ రాదండోయ్‌..

హెచ్‌పీ టచ్‌ క్రోమ్‌బుక్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ల్యాప్‌టాప్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ ల్యాప్‌టాప్‌ అసలు ధర రూ. 37,241 కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా ఏకంగా 70 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ల్యాప్‌టాప్‌ను రూ. 10,990కి సొంతం చేసుకోవచ్చు. అయితే పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా...

HP Touch Chromebook: రూ. 10వేలలోనే టచ్‌ స్క్రీన్‌ ల్యాప్‌టాప్‌.. ఇలాంటి ఆఫర్‌ మళ్లీ రాదండోయ్‌..
HP
Follow us

|

Updated on: Sep 30, 2024 | 6:16 PM

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. బిగ్ బిలియన్‌ డేస్‌ సేల్‌ పేరుతో భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్స్‌ మొదలు గృహోపకరణాల వరకు అన్ని రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగా ల్యాప్‌టాప్‌లపై కూడా మంచి డీల్‌ లభిస్తోంది. తక్కువ ధరలో ల్యాప్‌ట్యాప్‌ను సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది. ఆ డీల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

హెచ్‌పీ టచ్‌ క్రోమ్‌బుక్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ల్యాప్‌టాప్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ ల్యాప్‌టాప్‌ అసలు ధర రూ. 37,241 కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా ఏకంగా 70 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ల్యాప్‌టాప్‌ను రూ. 10,990కి సొంతం చేసుకోవచ్చు. అయితే పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1250 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ల్యాప్‌టాప్‌ను రూ. 10వేల లోపే సొంతం చేసుకోవచ్చు.

ఇక ఈ ల్యాప్‌టాప్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. యూఎస్‌బీ పోర్ట్ 2.0 టైప్ ఏ పోర్ట్, ఒక సూపర్ స్పీడ్ యూఎస్‌బీ టైప్ సీ 5 జీబీపీఎస్ సిగ్నలింగ్ రేటు పోర్ట్ వంటివి అందించారు. ఇందులో 11.6 ఇంచెస్‌తో కూడిన టచ్‌ స్క్రీన్‌ను అందించారు. ఇంత తక్కువ ధరలో టచ్‌ స్క్రీన్ లభించడం విశేషం. ఇక ఈ స్క్రీన్ రెజల్యూషన్ 1366 x 768 పిక్సల్‌తో తీసుకొచ్చారు. స్క్రీన్ టైప్ హెచ్‌డీ, ఐపీఎస్, యాంటీ గ్లేర్ వంటి ఫీచర్లను అందించారు.

తక్కువ బరువులో ఉన్న ఈ ల్యాప్‌టాప్‌ను ఆప్టికల్ డిస్క్‌ డ్రైవ్‌ను అందించలేదు. ఇక ఈ ల్యాప్‌టాప్‌ మీడియాటెక్‌ ఎస్‌టీ8183 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 32 జీబీ స్టోరేజ్‌ను అందిచారు. ఇక 720పీ హెచ్‌డీతో కూడిన వెబ్‌ కెమెరాను అందించారు. కంపెనీ ఈ ల్యాప్‌టాప్‌ప ఏడాది క్యారీ ఇన్‌ వారంటీ అందించారు. ఇక ఇందులో స్పీకర్లు, మైక్ వంటివి కూడా ఉంటాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక