Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్లు షురూ..ఆ టీవీలపై భారీ తగ్గింపు

|

May 23, 2023 | 6:15 PM

తాజాగా ఫ్లిప్‌కార్ట్‌లో గ్రాండ్ హోమ్ అప్లైన్సెస్ సేల్ నడుస్తుంది. ఈ సేల్‌లో వివిధ ఉత్పత్తులపై అతి భారీ తగ్గింపులను అందిస్తున్నారు. మే 25తో పూర్తయ్యే ఈ సేల్‌లో ముఖ్యంగా కొన్ని స్మార్ట్ టెలివిజన్‌లపై భారీ తగ్గింపును అందిస్తున్నారు.

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్లు షురూ..ఆ టీవీలపై భారీ తగ్గింపు
Online Frauds
Follow us on

గతంలో మన ఇంట్లోని టీవీలు కొనడానికి స్థానిక రిటైల్ స్టోర్స్‌ను సందర్శించి అక్కడ ఉన్న మోడల్స్‌లో ఏదో ఒకదాన్ని కొనుగోలు చేసుకునే వాళ్లం. అయితే మనకు కేవలం అక్కడ ఉన్న సేల్స్ రిప్రంజెటేటివ్, మనకు తెలిసిన ఒకరిద్దరి ఫ్రెండ్స్ సూచనలతో ఏ వస్తువైనా కొనుగోలు చేసేవాళ్లం. అయితే పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ వ్యాపారం వేగంగా పుంజుకుంది. అలాగే గతంలో ఆ వస్తువు వాడిన వారు కూడా రివ్యూలిచ్చే అవకాశం ఉండడంతో ఆ వస్తువుకు సంబంధించి ప్లస్, మైనస్‌లను బేరీజు వేసుకుని కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి షాపింగ్ సైట్ల రాకతో సరికొత్త మోడల్స్ టీవీలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ సైట్స్‌లో సేల్స్ పెడుతూ అత్యంత తగ్గింపు ధరలకే వస్తువులను వినియోగదారులకు అందిస్తున్నారు. తాజాగా ఫ్లిప్‌కార్ట్‌లో గ్రాండ్ హోమ్ అప్లైన్సెస్ సేల్ నడుస్తుంది. ఈ సేల్‌లో వివిధ ఉత్పత్తులపై అతి భారీ తగ్గింపులను అందిస్తున్నారు. మే 25తో పూర్తయ్యే ఈ సేల్‌లో ముఖ్యంగా కొన్ని స్మార్ట్ టెలివిజన్‌లపై భారీ తగ్గింపును అందిస్తున్నారు. సామ్‌సంగ్, సోనీ, ఎంఐ వంటి స్మార్ట్ టీవీలపై డిస్కౌంట్లను అందిస్తున్ానరు. ఈ సేల్‌లో ఏయే టీవీలపై ఎలాంటి తగ్గింపు ఆఫర్లు ఇస్తున్నారో? ఓ సారి తెలుసుకుందాం. 

వన్ ప్లస్ వై1

డాల్బీ సౌండ్ సపోర్ట్‌తో వచ్చే వన్ ప్లస్ వై1 32 అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ. ప్రస్తుతం ఈ టీవీ కేవలం రూ.12,999కు అందుబాటులో ఉంది. అలాగే ఈ టీవీని సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈఎంఐలో కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గిపు లభిస్తుంది. అలాగే మీ పాత టీవీ ఎక్స్చేంజ్‌పై రూ.7600 తగ్గింపు ధరతో వస్తుంది. ఈ టీవీ అన్ని స్ట్రీమింగ్ యాప్‌లకు మద్దతు ఇస్తుంది. అలాగే 20 వాట్స్ సౌండ్ అవుట్‌పుట్‌తో 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 

కొడాక్ 7 ఎక్స్ ప్రో

కొడాక్ నుంచి 43 అంగుళాల రేంజ్‌లో అల్ట్రా హెచ్‌డీ 4 కే టీవీ ఈ సేల్‌లో రూ. 18,249కు అందుబాటులో ఉంది. ఈ టీవీలో 40 వాట్స్ సౌండ్ అవుట్‌పుట్, బెజెల్-లెస్ డిజైన్‌తో వస్తుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ సపోర్ట్‌తో వస్తుంది. దీంతో ఈ టీవీలో అన్ని స్ట్రీమింగ్ యాప్‌లు పని చేస్తాయి. ఈ సేల్‌లో ఈ టీవీని ఏయూ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. అలాగే ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే మాత్రం రూ.2000 వరకూ 10 శాతం తగ్గింపుతో వస్తుంది. అలా మీ పాత టీవీపై రూ.4789 వరకూ తగ్గింపు లభిస్తుంది 

ఇవి కూడా చదవండి

సామ్‌సంగ్ హెచ్‌డీ రెడీ

ఫ్లిప్‌కార్ట్‌లో 32-అంగుళాల సామ్‌సంగ్ హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టైజెన్ టీవీ రూ.13,290కి అందుబాటులో ఉంది. ఈ టీవీని సిటీ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈఎంఐ లావాదేవీలపై కొనుగోలుదారులు అదనంగా 10 శాతం తగ్గింపు (రూ. 2,000 వరకు) పొందవచ్చు. అలాగే ఏకంగా రూ. 11,000 వరకు పాత టీవీలపై ఎక్స్చేంజ్ ద్వారా పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ అన్ని టాప్ స్ట్రీమింగ్ యాప్‌లకు మద్దతు ఇస్తుంది. ఈ టీవీ 20 వాట్స్ సౌండ్ అవుట్‌పుట్, 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..