AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐఫోన్‌ కొనాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌..! ఏకంగా రూ.10 వేలు సేవ్‌ అవుతాయి..

ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభమైంది! ఆపిల్, శామ్‌సంగ్, నథింగ్ వంటి బ్రాండ్ల నుండి స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ICICI, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డులతో 10 శాతం తక్షణ తగ్గింపు, నో-కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటు లో ఉన్నాయి.

ఐఫోన్‌ కొనాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌..! ఏకంగా రూ.10 వేలు సేవ్‌ అవుతాయి..
Iphone
SN Pasha
|

Updated on: Aug 01, 2025 | 2:53 PM

Share

ఫ్లిప్‌కార్ట్ కూడా తన కొత్త ఫ్రీడమ్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో ఆపిల్, శామ్‌సంగ్, నథింగ్, రియల్‌మీ, వివో, మోటరోలా వంటి బ్రాండ్‌ల నుండి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై గణనీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఆగస్టు 1న మధ్యాహ్నం 12 గంటల నుంచే సేల్‌ స్టార్ట్‌ అయిపోయింది. ఈ సేల్ ఎనిమిది రోజుల పాటు కొనసాగనుంది. దీనిని మరింత పొడిగించే అవకాశం కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్‌లో అందుబాటులో ఉన్న అద్భుతమైన ఆఫర్‌లను ఒకసారి చూద్దాం..

ఈ సేల్‌లో ICICI బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డులతో చేసిన కొనుగోళ్లకు 10 శాతం తక్షణ తగ్గింపు ఉంటుంది. ఇది EMI లావాదేవీలపై కూడా వర్తిస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్‌లతో పాటు, వినియోగదారులు నో-కాస్ట్ EMI ఎంపికలు, ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు అదనపు ప్రయోజనాన్ని పొందుతారు. అదనపు పొదుపు కోసం సూపర్ కాయిన్‌లను రీడీమ్ చేసుకునే అవకాశం ఉంది.

  • ఐఫోన్ 16ను కేవలం రూ.69,999లకే సొంతం చేసుకోవచ్చు. దీని లాంచ్ ధర రూ.79,900గా ఉంది. అంటే రూ.10 వేలు ఆదా అయినట్లే..
  • రూ.25,999 ధర కలిగిన మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ రూ.20,999 లకే లభిస్తోంది.
  • మీరు Samsung Galaxy S24 FEని కేవలం రూ.35,999కే కొనుగోలు చేయవచ్చు, దీని అసలు ధర రూ.59,999
  • Samsung Galaxy S24 ధర కూడా భారీగా తగ్గింది. ఇప్పుడు రూ.46,999కి అందుబాటులో ఉంది.
  • ఐఫోన్ 16e ని రూ.54,900 లకే సొంత చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.59,900గా ఉంది.
  • నథింగ్ ఫోన్ 3a దాని లాంచ్ ధర రూ.27,999 నుండి తగ్గింపుతో రూ.21,999కి అందుబాటులో ఉంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి