Fact Check: టాటా 150వ వార్షికోత్సవం.. కారు గెలుచుకోండి.. వాట్సప్ లో మెసేజ్ చక్కర్లు.. ఇందులో నిజమెంత? తెలుసుకోండి!
WhatsApp: టాటా గ్రూప్ 150 వార్షికోత్సవం సందర్భంగా నెక్సాన్ కారు బహుమతిగా ఇస్తోందా? వాట్సప్ లో చక్కర్లు కొడుతున్న ఈ బంపర్ ఆఫర్ మెసేజ్ వెనుక కథ ఏమిటి?

Fact Check: పండుగ సీజన్‌లో కార్ కంపెనీల నుండి అనేక ఆకర్షణీయమైన ఆఫర్ల ప్రకటనలు వస్తున్నాయి. చాలా మంది ప్రజలు నవరాత్రి నుండి దీపావళి వరకు వాహనాలు కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అదేవిధంగా చాలా మంది హ్యాకర్లు కూడా ప్రజల ఈ ఆఫర్లను అందిపుచ్చుకునే అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఒక సందేశం వాట్సప్ (WhatsApp)లో వేగంగా చక్కర్లు కొట్టేస్తోంది. టాటా గ్రూప్ 150 సంవత్సరాల వేడుకలు జరుపుకుంతోందనీ.. అందులో భాగంగా.. ప్రజలు ఉచిత కారును గెలుచుకునే అవకాశం ఉందనీ మెసేజ్ తో ఉన్న లింక్ ఉంటోంది. ఈ ఆఫర్ చూసిన ప్రజలు ఈ లింక్ ను అందరికీ ఫార్వార్డ్ చేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఇది విపరీతంగా వాట్సప్ లో షేర్ అవుతూ వస్తోంది.
ఒకవేళ మీకు అలాంటి సందేశం వచ్చినట్లయితే లేదా రాబోయే రోజుల్లో అటువంటి మెసేజ్ మీకు వస్తే..ఎటువంటి పరిస్థితిలోనూ దానిపై క్లిక్ చేసే పొరపాటు చేయవద్దు. ఈ సందేశం పూర్తిగా నకిలీ. టాటా అటువంటి ఆఫర్ ఏదీ ప్రకటించలేదు. ఈ విషయాన్ని టాటా కంపెనీ స్వయంగా చెప్పింది. మీరు ఈ లింక్‌పై క్లిక్ చేస్తే మీరు అనేక విధాలుగా బాధపడవచ్చు. ఈ లింక్ క్లిక్ చేస్తే వచ్చే పెద్ద నష్టం గురించి తెలుసుకుందాం.
టాటా గ్రూప్ 150 వార్షికోత్సవం సందేశంలో ఏం ఉంది?
ఈ సందేశం, ‘టాటా గ్రూప్. 150 వ వార్షికోత్సవ వేడుక !! ఈవెంట్‌లో చేరడానికి, కారును గెలవడానికి లింక్‌పై క్లిక్ చేయండి. సందేశం దిగువన లింక్ కూడా జత చేసి ఉంటోంది.
ఈ లింక్‌లో ఏముంది?
ఎవరైనా ఈ లింక్‌పై క్లిక్ చేసినప్పుడు, టాటా గ్రూప్ ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో టాటా ప్రముఖ ఎస్‌యూవీ నెక్సాన్ ఫోటో ఉంది. అలాగే – అభినందనలు! టాటా గ్రూపు150 వ వార్షికోత్సవ వేడుక! ప్రశ్నావళి ద్వారా, మీరు టాటా నెక్సాన్ EV ని పొందే అవకాశం ఉంటుంది.
దీనిని క్రిందికి స్క్రోల్ చేస్తున్నప్పుడు, వినియోగదారుని 4 ప్రశ్నలు అడుగుతున్నారు. వాటికి సమాధానం ఇవ్వడానికి మీరు కొన్ని ఎంపికలను కూడా పొందుతున్నారు. ఈ 4 ప్రశ్నలు ఇలా …
ప్రశ్న 1: మీకు టాటా గ్రూపులు తెలుసా. ? రెండవ ప్రశ్న: మీ వయస్సు ఎంత? ప్రశ్న 3: టాటా గ్రూపుల గురించి మీరు ఎలా అనుకుంటున్నారు. ? నాల్గవ ప్రశ్న: మీరు పురుషుడా లేక స్త్రీనా?
ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానమిచ్చిన తర్వాత, కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. దీనిలో వినియోగదారుని అభినందనలతో గిఫ్ట్ బాక్స్ ఎంచుకోమని కోరతారు. వినియోగదారుడు 12 బాక్సులలో 3 బాక్సులను ఎంచుకునే అవకాశాన్ని పొందుతారు. మొదటి రెండు బాక్సులను క్లిక్ చేసినప్పుడు ఖాళీగా వస్తాయి. అదే సమయంలో, టాటా నెక్సాన్ మూడవ పెట్టెలో బయటకు వస్తుంది.
ఇప్పుడు మీరు తదుపరి పేజీకి వెళ్లమని అడుగుతారు, కానీ దీని కోసం ఈ బహుమతి లింక్‌ను షేర్ చేసే షరతు వస్తుంది. అంటే, మీరు ఈ లింక్‌ను మీ వాట్సప్ (WhatsApp) పరిచయాలు.. సమూహాలకు పంపించాలి. దీని కోసం 3 షరతులు ఉన్నాయి.
1. స్నేహితులు లేదా గ్రూపులతో లింక్‌ను షేర్ చేయడానికి , దిగువ “షేర్” ఐకాన్‌పై క్లిక్ చేయండి. 2. వివిధ గ్రూపులు మరియు స్నేహితులతో షేర్ చేసిన తర్వాత, అది సమీక్షించబడుతుంది. 3. ఇప్పుడు “కొనసాగించు” పై క్లిక్ చేయడం ద్వారా మీ బహుమతిని క్లెయిమ్ చేయండి.
టాటా తన ప్రజలను అప్రమత్తం చేస్తుంది..
#FakeNotSafe Tata Group or its companies are not responsible for this promotional activity. Please do not click on the link and/or forward it to others.
Know more here: https://t.co/jJNfybI9ww pic.twitter.com/AA38T0oqHn
— Tata Group (@TataCompanies) October 1, 2021
టాటా గ్రూప్ తన సామాజిక ఖాతాలో ఒక సందేశంలో టాటా గ్రూప్ లేదా దాని కంపెనీలు అలాంటి ప్రమోషనల్ కార్యకలాపాలకు బాధ్యత వహించవని పేర్కొంది. దయచేసి అలాంటి లింక్‌లపై క్లిక్ చేయవద్దు. దానిని ఎవరికీ ఫార్వార్డ్ చేయవద్దు. సందేశానికి కంపెనీ #FakeNotSafe టాగ్ ని కూడా జోడించింది. దీనితో పాటు, అటువంటి నకిలీ సందేశాలను నివారించడానికి ఇది తన వినియోగదారులకు చిట్కాలను కూడా ఇచ్చింది. కంపెనీ చెప్పింది …
1. అటువంటి సందేశాల మూలాన్ని.. పంపినవారిని ధృవీకరించండి. 2. సందేశం ప్రామాణికతను తనిఖీ చేయడానికి అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియా హ్యాండిల్‌లను తనిఖీ చేయండి. 3. ఏదైనా యూఆర్ఎల్ (URL) పై క్లిక్ చేసే ముందు దాన్ని రెండుసార్లు తనిఖీ చేయండి. 4. ధృవీకరించని సందేశాన్ని ఫార్వార్డ్ చేయవద్దు.
లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మాల్వేర్‌కి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆఫర్‌ల తో కూడిన ఇటువంటి సందేశాలను విపరీతంగా ప్రజలు అందుకుంటున్నారనీ.. వినియోగదారుడు వీటితో నష్టపోయే అవకాశం ఉందని అంటున్నారు. అటువంటి సందేశాలలో ఇచ్చిన లింక్‌లపై క్లిక్ చేయడం వలన ఫోన్‌లో మాల్వేర్ ట్రోజన్ ఇన్‌స్టాల్ అవుతుంది. ఇవి మీ ఫోన్ డేటాను దొంగిలించే వైరస్ రకం. హ్యాకర్లు మీ ఫోన్‌లో జరిగే యాక్టివిటీ గురించి సమాచారాన్ని పొందవచ్చు. ఇది మీ బ్యాంక్ ఖాతాను కూడా ప్రమాదంలో పడేస్తుంది. ఒకవేళ మీకు అలాంటి ఆఫర్ ఏదైనా సందేశం వస్తే, దాన్ని కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో తప్పకుండా చెక్ చేయండి. అంటూ నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Reliance Jio network down: రిలయన్స్ జియో నెట్‌వర్క్ డౌన్.. ఇబ్బందులు పడ్డ వినియోగదారులు..!
Windows 11: విండోస్ 11 వచ్చేసింది.. దీనిని మీ కంప్యూటర్ లో ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చంటే..