Laptop tips and tricks: హే బంటి.. మీ ల్యాప్‌టాప్‌ స్లోనా ఏంటి? ఈ టిప్స్‌ ఫాలో అవ్వు చాలు.. ఇక ఎప్పటికీ సూపర్‌ ఫాస్టే..

అకస్మాత్తుగా షట్ డౌన్ అవ్వడం లేదా యాప్‌లు, వెబ్‌పేజీలు నెమ్మదించడం వంటివి జరుగుతుంటాయి. ఇది సాధారణంగా అందరికీ ఎదురయ్యే సమస్యే. ఇదే సమస్య మీరు కూడా ఫేస్‌ చేస్తూ ఉంటే ఈ ఐటెం మీకోసమే..

Laptop tips and tricks: హే బంటి.. మీ ల్యాప్‌టాప్‌ స్లోనా ఏంటి? ఈ టిప్స్‌ ఫాలో అవ్వు చాలు.. ఇక ఎప్పటికీ సూపర్‌ ఫాస్టే..
Laptop
Follow us
Madhu

|

Updated on: Feb 14, 2023 | 10:30 AM

కోవిడ్‌ మహమ్మారి కారణంగా డిజిటలైజేషన్‌ చాలా వేగాన్ని పుంజుకుంది. పాఠశాలల నుంచి ఆఫీసుల వరకూ అంతా ల్యాప్‌ టాప్‌ లను వినియోగిస్తున్నారు. ఫలితంగా దేశంలో ల్యాప్‌టాప్‌లకు డిమాండ్ పెరిగింది. డెస్క్‌టాప్ వినియోగదారుల సంఖ్య నెమ్మదిగా తగ్గుతోంది. దీనికి ప్రధాన కారణం కరోనా విజృంభించిన సమయంలో అందరూ ఇంటి నుంచి పని చేశారు. ఆ సమయంలో లాప్‌ ట్యాప్‌ల వినియోగం పెరిగింది. ప్రస్తుతం ప్రముఖ ల్యాప్‌టాప్ కంపెనీలు కూడా బడ్జెట్ ధరలకు ఆకర్షణీయమైన ఫీచర్లతో ల్యాప్‌టాప్‌లను విక్రయిస్తున్నాయి. కాబట్టి అవి వినియోగదారుల చేతికి సులభంగా చేరుతున్నాయి. మార్కెట్‌లో కొన్ని అద్భుతమైన ల్యాప్‌టాప్‌లు ఉన్నప్పటికీ.. కొన్ని సార్లు అవి అకస్మాత్తుగా షట్ డౌన్ అవ్వడం లేదా యాప్‌లు, వెబ్‌పేజీలు నెమ్మదించడం వంటివి జరుగుతుంటాయి. ఇది సాధారణంగా అందరికీ ఎదురయ్యే సమస్యే. ఇదే సమస్య మీరు కూడా ఫేస్‌ చేస్తూ ఉంటే ఈ ఐటెం మీకోసమే.. కొన్ని ట్రిక్‌ లను వినియోగించి మీ ల్యాప్‌ టాప్‌ వేగాన్ని పెంచుకోవచ్చు. విండోస్‌ 11 ఓఎస్‌ పై పనిచేసే ల్యాప్‌ టాప్‌ వినియోగదారులు ఈ ట్రిక్స్ ద్వారా తమ ల్యాప్‌టాప్‌ వేగాన్ని పెంచుకోవచ్చు. అవేంటో చూద్దాం..

పవర్‌ మోడ్‌లో ఉంచాలి.. మీ ల్యాప్‌ టాప్‌ కాస్త మోడ్రన్ ది అయితే దానిలో పవర్‌ మోడ్‌ ను సెట్‌ చేసుకోవాలి. దీని ద్వారా ల్యాప్‌ టాప్‌ పనితీరు బాగా మెరుగవుతుంది. విండోస్‌ 11 వినియోగదారులు ఈ ఆప్షన్‌ వినియోగించుకోవడానికి మొదటిగా సెట్టింగ్స్‌ లోకి వెళ్లి దానిలో సిస్టమ్‌ ఆప్షన్‌ ను సెలెక్ట్‌ చేసుకొని తర్వాత పవర్‌ అండ్‌ బ్యాటరీలోకి వెళ్లాలి. దానిలో బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ ఆప్షన్ను ఎంపిక చేసుకోవాలి. కొన్ని ల్యాప్‌ టాప్‌లలో చార్జర్‌ కనెక్ట్‌ అయి ఉన్నప్పడు మాత్రమే ఈ ఆప్షన్‌ కనిపిస్తుంది. దీని ద్వారా సీపీయూ, జీపీయూ అత్యధిక క్లాక్‌ స్పీడ్‌తో పనిచేస్తాయి.

ఓఎస్‌ అప్‌డేట్‌ చేసుకోవాలి.. మీ ల్యాప్‌ టాప్‌ బాగా పనిచేయాలి అంటే అందుబాటులో ఉన్న లేటెస్ట్‌ సాఫ్ట్‌వేర్‌ ను అప్‌డేట్‌ చేసుకోవాలి. ఇది మీ ల్యాప్‌ టాప్‌ ఓవరాల్‌ పెర్ఫార్మెన్స్‌ని ప్రభావితం చేస్తుంది. దీనికోసం సెట్టింగ్స్‌ లోకి వెళ్లి విండోస్‌ అప్‌ డేట్‌ ఏమైనా ఉందేమో చెక్‌ చేసుకొని, ఉంటే వెంటనే అప్‌డేట్‌ కొట్టాలి.

ఇవి కూడా చదవండి

రెడీబూస్ట్‌ టెక్నాలజీని ఎనేబుల్‌ చేయాలి.. మీ ల్యాప్‌ టాప్‌లో తక్కువ సామర్థ్యం ఉన్న ర్యామ్‌ ఉందా.. అలాంటప్పుడు ఈ రెడీబూస్ట్‌ టెక్నాలజీ బాగా ఉపకరిస్తుంది. దీని ద్వారా వర్చువల్‌ ర్యామ్‌ను పొందవచ్చు. మీ ఎస్డీ కార్డ్‌, లేదా పెన్‌ డ్రైవ్‌ ద్వారా దీనిని వినియోగించుకోవచ్చు. కనీసం 500 ఎంబీ సామర్థ్యం వరకూ ర్యామ్‌ ను ఈ రెడీ బూస్ట్‌ టెక్నాలజీ ద్వారా పెంచుకోవచ్చు. దీని కోసం ఫైల్‌ మేనేజర్‌ లోకి వెళ్లి రైట్‌ క్లిక్‌ చేసి, ఎక్స్‌టర్నల్‌ మెమరీ నుంచి ప్రాపర్టీస్‌లోకి వెళ్లి దాని నుంచి రెడీ బూస్ట్‌ ఆప్షన్‌ సెలెక్ట్‌ చేసుకొని అవసరమైన మెమరీని వర్చువల్‌ ర్యామ్‌ కింద మార్చుకోవచ్చు.

డిస్క్‌ క్లీన్‌ చేసుకోండి.. విండోస్‌ ఓఎస్‌లో డిస్క్‌ క్లీన్‌ అప్‌ అనేది బిల్ట్‌ ఇన్‌ టూల్‌. డిస్క్‌ క్లీన్‌ అప్‌ ఆప్షన్‌ కోసం సెర్చ్‌ బార్‌లో సెర్చ్‌ చేసుకొని వినియోగించుకోవచ్చు. సాధారణంగా ఇది లోకల్‌ డిస్క్‌(సీ)లోని క్యాచీ ఫైల్స్‌ని క్లీన్‌ చేస్తుంది. తద్వారా సిస్టమ్‌ స్పీడ్‌ మెరుగువుతుంది.

థర్డ్‌ పార్టీ యాప్స్‌ డిలీట్‌ చేయాలి.. కొన్ని ల్యాప్‌ టాప్‌లలో కొన్ని థర్డ్‌ పార్టీ యాప్‌ వస్తాయి. ఇవి సిస్టమ్‌ లోని స్పేస్‌ ని తినేస్తాయి. ఇది ఓవరాల్‌ సిస్టమ్‌ పెర్ఫార్మెన్స్‌ని దెబ్బతిస్తుంది. దీనిని అరికట్టడానికి సెట్టింగ్స్‌ లోకి వెళ్లి యాప్స్‌ ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేసుకొని ఇన్‌స్టాల్డ్‌ యాప్స్‌లోకి వెళ్లి మీరు వినియోగించని యాప్‌లను డిలీట్‌ చేసేయండి. ఇది ఇంటర్నల్‌ మెమరీని పెంచుతుంది. తద్వారా సిస్టమ్‌ స్పీడ్‌ అధికమవుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..