Flipkart News: రూ.549 కే పోకో ఎం4 5జీ ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్… ఎలా పొందాలో తెలుసా?
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ వ్యాలెంటైన్ వీక్ సేల్ నడుస్తుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై వివిధ ఆఫర్లను ప్రకటిస్తుంది. ప్రస్తుతం పోకో ఎం4 5జీ ఫోన్‌పై అద్భుత ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ.549 కే ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చని తెలిపి సంచలనం సృష్టించింది. అయితే ఈ ఆఫర్ ఎక్స్చేంజ్ కింద తమ పాత ఫోన్లను ఇచ్చే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది.
దేశంలో ఈ-కామర్స్ రంగం దూసుకుపోతుంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ఇటీవల పలు రకాల సేల్స్ నిర్వహిస్తూ కస్టమర్ల మనస్సును గెలుచుకుంటుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ వ్యాలెంటైన్ వీక్ సేల్ నడుస్తుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై వివిధ ఆఫర్లను ప్రకటిస్తుంది. ప్రస్తుతం పోకో ఎం4 5జీ ఫోన్‌పై అద్భుత ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ.549 కే ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చని తెలిపి సంచలనం సృష్టించింది. అయితే ఈ ఆఫర్ ఎక్స్చేంజ్ కింద తమ పాత ఫోన్లను ఇచ్చే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. భారతదేశంలో కొన్ని నెలల క్రితం అందుబాటులోకి వచ్చిన పోకో ఎం4 5జీ ఫోన్ 4జీబీ+64 జీబీ వేరియంట్లో అందుబాటులో ఉంటుంది. దీని అసలు ధర రూ.15,999. అయితే ప్రస్తుతం రూ.11,999కు ఆఫర్ ప్రైస్‌లో ఉంది. అలాగే పలు బ్యాంకుల ద్వారా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా రానుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన ఎక్స్చేంజ్ ఆఫర్‌లో రూ.11,450 వరకూ ఎక్స్చేంజ్ ప్రైస్‌ను పొందవచ్చు. ఆ ఎక్స్చేంజ్ ప్రైస్‌ను ఒరిజినల్ రేట్ నుంచి తీసేస్తే రూ.549 కే ఫోన్ అందుబాటులోకి వస్తుంది. అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ మీరు ఇచ్చే ఫోన్ కంపెనీ, అలాగే స్థితిపై ఆధారపడి ఉంటుందని గమనించాలి. ముఖ్యంగా మీరు రీప్లేస్ చేస్తునన ఫోన్‌పై ఎలాంటి గీతలు లేకుండా ఉంటే ఫుల్ ఎక్స్చేంజ్ ప్రైస్‌ను మీరు పొందుతారు.
పోకో ఎం4 5జీ స్పెసిఫికేషన్లు ఇవే
- 6.58 అంగుళాల డిస్‌ప్లే, 1080X2400 రిజుల్యూషన్.
- మీడియా టెక్ డైమన్‌సిటీ ప్రాసెసర్‌తో పాటు ఆండ్రాయిడ్ 12 సపోర్ట్
- 4 జీబీ+64 జీబీ, 6 జీబీ+128 జీబీ వేరియంట్లు
- 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
- 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి