Renault And Nissan: ఆ రెండు కంపెనీలు కలిసి భారత్‌లో రూ.5300 కోట్ల పెట్టుబడి.. ఈవీల వృద్ధి కోసమేనా?
ముఖ్యంగా కొత్త వాహనాల ఉత్పత్తి, పరిశోధన, అభివృద్ధి ప్రయత్నాలకు మద్దతును ఇవ్వడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేయడం, కార్బన్-న్యూట్రల్ తయారీకి మారడం వంటి వివిధ అంశాలు ఉన్నాయి. ఈ పెట్టుబడితో చెన్నైలో ఉన్న రెనాల్ట్, నిస్సాన్ టెక్నాలజీ అండ్ బిజినెస్ సెంటర్‌లో 2000 కొత్త ఉద్యోగాలను రానున్నాయి.
ప్రముఖ కార్ల తయారీ సంస్థలు రెనాల్ట్, నిస్సాన్ రెండూ కలిసి ఉమ్మడి ప్రాజెక్ట్ ప్రకటించాయి. భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న ఈవీ వెహికల్స్ దృష్టి పెట్టాలని నిర్ణయించాయి. వీటి కోసం ఏకంగా రూ.5300 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు వెల్లడించాయి. ఈ రెండు సంస్థలు ఉమ్మడి ప్రణాళికను వెల్లడించిన తర్వాత ఈ స్థాయిలో భారీ పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి. ఈ ప్రణాళిక భారత్‌లో దీర్ఘకాలిక దృష్టితో పెడుతున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా కొత్త వాహనాల ఉత్పత్తి, పరిశోధన, అభివృద్ధి ప్రయత్నాలకు మద్దతును ఇవ్వడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేయడం, కార్బన్-న్యూట్రల్ తయారీకి మారడం వంటి వివిధ అంశాలు ఉన్నాయి. ఈ పెట్టుబడితో చెన్నైలో ఉన్న రెనాల్ట్, నిస్సాన్ టెక్నాలజీ అండ్ బిజినెస్ సెంటర్‌లో 2000 కొత్త ఉద్యోగాలను రానున్నాయి. ముఖ్యంగా 2045 నాటికి ఈ రెండు సంస్థలు తమ వాహనాలను కార్బన్-న్యూట్రల్‌గా మార్చనున్నాయి. కొత్తగా ఈ కంపెనీలు రూపొందించుకున్న ఫ్రేమ్ వర్క్ ప్రకారం రెనాల్ట్ నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తమ క్రాస్ ఓనర్ షిప్‌ను బ్యాలెన్స్ చేయనుంది. దీని కోసం తన వాటాను క్రమంగా 45 శాతం నుంచి 15 శాతం తగ్గించుకుంటుంది. అయితే నిస్సాన్ నిస్సాన్ రెనాల్ట్ ముఖ్యంగా ఈవీ యూనిట్‌లో పెట్టుబడి పెడుతుంది.
ముఖ్యంగా రెనాల్ట్, నిస్సాన్ భారతదేశంలోని దేశీయ, అంతర్జాతీయ వినియోగదారుల కోసం ఆరు కొత్త వాహనాలను ప్రవేశపెట్టాయి. ఈ ఆరు మోడల్స్‌లో ఒక్కో కంపెనీకి మూడు ఆప్షన్లు ఉంటాయి. ఈ మోడల్స్ చెన్నైలోని తయారీ సంస్థల్లో రూపొందించారు. అలాగే ఈ ఆరు మోడల్స్‌లో నాలుగు ఎస్‌యూవీలు, రెండు ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త మోడల్స్ ద్వారా దేశీయంగా కస్టమర్లను ఆకట్టుకోవడమే కాకుండా భారత్ నుంచి గణనీయంగా ఎగుమతులను ప్రోత్సహిస్తాయని కంపెనీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి