AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oppo New Phone: ఒప్పో మడతపెట్టే ఫోన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫీచర్స్ తెలిస్తే మతిపోతుందంతే..!

ఫిబ్రవరి 15 న అప్పో ఫైండ్ ఎన్2 ఫోన్‌ను కంపెనీ రిలీజ్ చేయనుంది. అప్పో ఎ 78, అప్పో రెనో 8 టి తర్వాత 2023లో తొలిసారిగా కంపెనీ ఈ గ్లోబల్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. అలాగే అప్పో ఫైండ్ ఎన్ 2 ధర రూ.82,999గా ఉంటుందని కంపెనీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి.

Oppo New Phone: ఒప్పో మడతపెట్టే ఫోన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫీచర్స్ తెలిస్తే మతిపోతుందంతే..!
Oppo Foldable
Nikhil
|

Updated on: Feb 14, 2023 | 11:58 AM

Share

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తన కొత్త ఫోన్ లాంచ్ డేట్‌ను ప్రకటించింది. గత కొన్నిరోజులుగా వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ తన మడతపెట్టే (ఫోల్డబుల్) ఫోన్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది. సామ్‌సంగ్ తర్వాత ఒప్పో కంపెనీనే ఫోల్డబుల్ ఫోన్‌ను ప్రవేశపెట్టడం విశేషం. ఒప్పో ఫైండ్ ఎన్2 పేరుతో రిలీజ్ చేస్తున్న ఈ ఫోన్ ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులో ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒప్పో ఫైండ్ ఎన్ 2 ఫోన్ ముఖ్యంగా సామ్‌సంగ్ జెడ్ ఫ్లిప్ 4తో పోటీ పడుతుందని పేర్కొంటున్నాయి. ఫిబ్రవరి 15 న ఒప్పో ఫైండ్ ఎన్2 ఫోన్‌ను కంపెనీ రిలీజ్ చేయనుంది. ఒప్పో ఎ 78, ఒప్పో రెనో 8 టి తర్వాత 2023లో తొలిసారిగా కంపెనీ ఈ గ్లోబల్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. అలాగే ఒప్పో ఫైండ్ ఎన్ 2 ధర రూ.82,999గా ఉంటుందని కంపెనీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. 2022 డిసెంబర్ జరిగిన లాంచ్ ఈవెంట్‌లో మొదటిసారిగా చైనాలో ఈ ఫోన్ లాంచ్ చేశారు.

ఒప్పో కంపెనీ రిలీజ్ చేసిన ఫోల్డబుల్ ఫోన్ డిజైన్ వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. ఈ ఫోన్ పింక్, బ్లాక్ కలర్లలో వస్తుంది. అలాగే ఫోన్‌ను అన్ ఫోల్డ్ చేయకుండానే నోటిఫికేషన్లు, ఫొటో చూసేలా డిజైన్ ఉంది. అలాగే 6.8 అంగుళాల డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అలాగే ఔటర్ డిస్‌ప్లే 3.62 అంగుళాలతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. మిడియా టెక్ ప్రాసెసర్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 16 జీబీ+512 జీబీబీ వేరియంట్‌తో వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా సెటప్ ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అలాగే 5 జీ సపోర్ట్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 44 వాట్స్ సూపర్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. వీటితో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో పాటు ఇతర అడ్వాన్స్డ్ ఫీచర్లు అన్నీ ఉన్నాయి. 

అయితే ఈ ఫోన్ భారతదేశంలో ఒప్పో రిలీజ్ చేసే మొదటి ఫోల్డబుల్ ఫోన్ అయినప్పటికీ సామ్‌సంగ్ ఇప్పటికే నాలుగు వేరియంట్ల ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేసి విక్రయిస్తుంది. కాబట్టి ఈ ఫోన్ భారతీయ కస్టమర్లను ఆకట్టుకునే విషయంలో కాస్త వెనకబడవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పలు నివేదికల ప్రకారం ఈ ఫోన్ భారతదేశంలో 8 జీబీ + 256 జీబీ వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంటుందని వెల్లడిస్తున్నాయి. ఈ ఫోన్ ధర కూడా రూ. 71,000గా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి