వాట్సాప్ లో బగ్ .. మణిపూర్ కుర్రోడి టాలెంట్
వాట్సాప్ లో యూజర్ ప్రయివసీకి భంగం కలిగించే ఓ బగ్ ని కనిపెట్టిన మణిపూర్ కుర్రోడు జోలెన్ సౌగాజం ప్రతిభను ఫేస్ బుక్ గుర్తించింది. 22 ఏళ్ళ ఈ సివిల్ ఇంజినీర్ కి 5 వేల యుఎస్ డాలర్ల నగదు బహుమతిని ప్రకటించింది. పైగా ఇతని పేరును ‘ ఫేస్ బుక్ హాఫ్ ఆఫ్ ఫేమ్-2019 ‘ లో చేర్చింది. ప్రస్తుతం జోలెన్ పేరు 94 మంది జాబితాలో 16 వ స్థానంలో ఉంది. వాట్సాప్ ద్వారా […]
వాట్సాప్ లో యూజర్ ప్రయివసీకి భంగం కలిగించే ఓ బగ్ ని కనిపెట్టిన మణిపూర్ కుర్రోడు జోలెన్ సౌగాజం ప్రతిభను ఫేస్ బుక్ గుర్తించింది. 22 ఏళ్ళ ఈ సివిల్ ఇంజినీర్ కి 5 వేల యుఎస్ డాలర్ల నగదు బహుమతిని ప్రకటించింది. పైగా ఇతని పేరును ‘ ఫేస్ బుక్ హాఫ్ ఆఫ్ ఫేమ్-2019 ‘ లో చేర్చింది. ప్రస్తుతం జోలెన్ పేరు 94 మంది జాబితాలో 16 వ స్థానంలో ఉంది. వాట్సాప్ ద్వారా వాయిస్ కాల్ చేస్తున్నప్పుడు కాలర్ … రిసీవ్ చేసుకునే వ్యక్తికి తెలియకుండానే, అతని ఆమోదం పొందకుండానే వీడియో కాల్ గా అప్ గ్రేడ్ చేయడానికి ఈ బగ్ ఉపయోగపడుతోందని, దీనివల్ల అవతలి వ్యక్తి ఏం చేస్తున్నాడో అతనికి తెలిసిపోతుందని జోలెన్ అంటున్నాడు. ఈ బగ్ వల్ల రిసీవర్ ప్రయివసీకి భంగం కలుగుతుందని, ఈ విషయాన్ని తాను ఫేస్ బుక్ కి సంబంధించిన బౌంటీ ప్రోగ్రామ్ నిర్వాహకులకు తెలిపానని ఈ విద్యార్థి పేర్కొన్నాడు. తన రిపోర్టును ఫేస్ బుక్ సెక్యూరిటీ టీమ్ ఆమోదించి.. ఈ బగ్ విషయంలో తగు ‘ సవరణలు ‘ చేసిందని వెల్లడించాడు. ఇతనికి ఈ-మెయిల్ పంపుతూ.. 5 వేల యుఎస్ డాలర్ల బహుమతిని పంపుతున్నట్టు, ఇతని పేరును ఫేస్ బుక్ హౌస్ అఫ్ ఫేమ్ లిస్టులో చేర్చుతున్నట్టు ప్రకటించింది.