AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile Fast Charging: ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల ప్రయోజనాలు ఉన్నా.. నష్టాల గురించి మీకు తెలుసా?

Mobile Fast Charging: తాజా స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులో ఉన్న ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ అందరికీ నచ్చుతుంది ఎందుకంటే ఇప్పుడు మీరు ఫోన్‌ను గంటల తరబడి ఛార్జింగ్‌లో ఉంచాల్సిన అవసరం లేదు. మీ ఫోన్‌ కొన్ని నిమిషాల్లోనే ఛార్జ్ అవుతుంది. కానీ సూపర్‌ఫాస్ట్ వేగం..

Mobile Fast Charging: ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల ప్రయోజనాలు ఉన్నా.. నష్టాల గురించి మీకు తెలుసా?
Subhash Goud
|

Updated on: Mar 03, 2025 | 4:52 PM

Share

ఫాస్ట్ ఛార్జింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అందరికి ఇష్టమే. ఫోన్‌ కొనేముందు ఫోన్ ఎంత వేగంగా ఛార్జ్ అవుతుందో, ఎన్ని నిమిషాల్లో ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుందో చూసుకుంటారు. ప్రతి నాణేనికి రెండు వైపులా ఉంటాయని అంటారు. అందరికీ ప్రయోజనాలు తెలుసు కానీ మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న వేసుకోండి. ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.

తాజా స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులో ఉన్న ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ అందరికీ నచ్చుతుంది ఎందుకంటే ఇప్పుడు మీరు ఫోన్‌ను గంటల తరబడి ఛార్జింగ్‌లో ఉంచాల్సిన అవసరం లేదు. మీ ఫోన్‌ కొన్ని నిమిషాల్లోనే ఛార్జ్ అవుతుంది. కానీ సూపర్‌ఫాస్ట్ వేగం మీ ఫోన్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ‘ఆలస్యం అనేది ప్రమాదం కంటే మేలు’ అని రాసి ఉంటుంది. అలాగే వేగం అతి ప్రమాదకరం అనే బోర్డులు చూసి ఉంటారు. వేగం కంటే ఆలస్యం మేలు. నేడు సూపర్‌ఫాస్ట్ వేగం ప్రయోజనాలు కనిపిస్తున్నాయి కానీ దీర్ఘకాలంలో ఈ సూపర్‌ఫాస్ట్ వేగం ప్రతికూలతలు కూడా మొబైల్ ఫోన్‌లలో కనిపించడం ప్రారంభిస్తాయని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల కలిగే నష్టాలు:

ఫాస్ట్ ఛార్జింగ్ మంచిది కాదని చెప్పడం లేదు. కానీ కానీ ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీపై ప్రభావం చూపుతుంది. అలాగే దీర్ఘకాలంలో సూపర్ ఫాస్ట్ స్పీడ్‌లో ఛార్జ్ చేయబడిన ఫోన్ బ్యాటరీ లైఫ్ తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది మాత్రమే కాదు, మీరు గమనించే మరో ప్రతికూలత ఏమిటంటే ఫోన్ ఎంత వేగంగా ఛార్జ్ అవుతుందో, అంత ఎక్కువగా వేడెక్కడం ప్రారంభమవుతుంది.

ప్రతి ఫోన్ కొంత వేడిని ఉత్పత్తి చేస్తుంది. కానీ వేగంగా ఛార్జింగ్ చేయడం వల్ల కూడా ఓవర్ హీటింగ్ జరుగుతుంది. దీని కారణంగా ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంది. కొత్త ఫోన్ అయినప్పుడు అది ప్రారంభంలో వేగంగా ఛార్జ్ అవుతుంది. కానీ కొన్ని నెలల తర్వాత ఫోన్ ఛార్జింగ్ సమయం పెరిగినట్లు మీరే గమనించవచ్చు.

ఉదాహరణకు.. కొత్త ఫోన్ కొన్న తర్వాత ఫోన్‌తో పాటు అందించిన ఛార్జర్ మీ ఫోన్‌ను 40 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేస్తుంటే, 6 నెలలు లేదా ఒక సంవత్సరం తర్వాత ఛార్జింగ్ సమయం పెరిగి ఉండేది. ఛార్జింగ్ సమయం పెరగడానికి కారణం అర్థం కాలేదు. ఇది ఎలా జరిగిందో, 40 నిమిషాల్లో ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది. ఛార్జింగ్ సమయం పెరగడానికి అతిపెద్ద కారణం ఏమిటంటే, బ్యాటరీపై చెడు ప్రభావం కారణంగా ఛార్జ్ చేయడానికి మునుపటి కంటే ఎక్కువ సమయం పడుతోంది. ఇది చాలా మంది గమనించరు.

మొదటి ప్రయోజనం ఏమిటంటే, వేగవంతమైన ఛార్జింగ్ కారణంగా ఇప్పుడు మీరు మీ ఫోన్‌ను గంటల తరబడి ఛార్జింగ్‌లో ఉంచాల్సిన అవసరం లేదు. గతంలో గంటలు పట్టే ఈ పని ఇప్పుడు కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది. రెండవ ప్రయోజనం ఏమిటంటే మీరు ఎప్పుడైనా అత్యవసర పరిస్థితిలో ఫోన్ బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయితే, ఈ సందర్భంలో మీ దగ్గర ఫోన్ ఛార్జర్ ఉంటే, మీ ఫోన్ త్వరగా ఛార్జ్ అవుతుంది.

పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి:

ఫోన్‌తో వచ్చే ఒరిజినల్ ఛార్జర్ లేదా కేబుల్ పాడైతే, మార్కెట్‌కి వెళ్లి స్థానిక కంపెనీ నుండి ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ లేదా కేబుల్ కొనుగోలు చేసే పొరపాటు చేయకండి. మీరు చేసే ఈ చిన్న పొరపాటు ఫోన్‌లో పేలుడుకు కారణమవుతుంది. అంతేకాదు బ్యాటరీ మరింత దెబ్బతింటుందని గుర్తించుకోవాలని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి