AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బలహీనపడ్డ భూ అయస్కాంత క్షేత్రం.. సెల్‌ఫోన్, శాటిలైట్లు పనిచేయకపోవచ్చు!

ప్రస్తుతం కరోనా వైరస్‌తో నానా ఇబ్బందులు పడుతున్న వేళ శాస్త్రవేత్తలు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. అదేంటంటే.. మన భూమి చుట్టూ అయస్కాంత క్షేత్రం ఉంటుంది కదా. అందులో కొంత భాగం బలహీనంగా అయిపోయిందట. ఎందుకూ అన్నది వారికి..

బలహీనపడ్డ భూ అయస్కాంత క్షేత్రం.. సెల్‌ఫోన్, శాటిలైట్లు పనిచేయకపోవచ్చు!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 25, 2020 | 1:52 PM

Share

ప్రస్తుతం కరోనా వైరస్‌తో నానా ఇబ్బందులు పడుతున్న వేళ శాస్త్రవేత్తలు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. అదేంటంటే.. మన భూమి చుట్టూ అయస్కాంత క్షేత్రం ఉంటుంది కదా. అందులో కొంత భాగం బలహీనంగా అయిపోయిందట. ఎందుకూ అన్నది వారికి కూడా అర్థం కావడం లేదు. టెలీకమ్యునికేషన్, శాటిలైట్లు పని చేయాలంటే భూ అయస్కాంత క్షేత్రంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో ఇలా జరగడంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆఫ్రికా, దక్షిణ అమెరికాల మధ్య భూమిలో ఉన్న అయస్కాంత క్షేత్రం బలహీనపడినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలకు మరో న్యూస్ తెలిసింది.

సౌత్ అట్లాంటిక్ ఎనోమలీ అని పిలిచే ఏరియా.. కొన్నేళ్లుగా విస్తరిస్తూ ఉంది. అంటే అయస్కాంత క్షేత్రాల బలహీనత తగ్గుతుందని అర్థం. ఇంతకు ముందు 24000 నానా టెస్లాస్ ఉండే అయస్కాంత క్షేత్ర బలం.. కాస్త తగ్గి 22000 నానోటెస్లాస్‌కి చేరిందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) సైంటిస్టులు పేర్కొన్నారు. అంటే భూమి మొక్క ఉత్తర ధృవం, దక్షిణ ధృవాల మొక్క అయస్కాంత క్షేత్రం 7,80,000 సంవత్సరాల క్రితం జరిగిందని గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో మరొకటి జరగాలంటే ఇంకా చాలా సమయం పడుతుందని చెబుతున్నారు.

అటు ఎప్పటి నుంచో ఈ ఎనామలీపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు శాస్త్రవేత్తలు. తాజాగా నైరుతీ ఆఫ్రికాలో మరో కొత్త ఎనామలీ మొదలైంది. అది అంతకంతకూ పెరుగుతూనే పోతుంది. ఇక ఈ మార్పులతో భూమిలోపల ఎలాంటి చర్యలు చోటుచేసుకుంటాయో కనుగొనడం తమకు అతి పెద్ద సవాల్ అని నిపుణులు చెబుతున్నారు.

మొత్తానికి ఈఎస్‌ఏ చెప్పిన దాని ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా శాటిలైట్ల కమ్యునికేషన్ కొంతవరకూ దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అలాటే టెలీకమ్యునికేషన్, మొబైల్ ఫోన్లు కూడా పనిచేయకపోవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే ఆ రెండు ఎనామలీలు ఉన్న ప్రాంతాల్లో విమానాలకు కూడా టెక్నికల్ సమస్యలు ఎదురయ్యే ప్రమాదముందన్నారు. అయినా అయస్కాంత క్షేత్రం తిరగబడటానికి చాలా సమయం ఉంది కాబట్టి ఈ ప్రమాదం జరిగే అవకాశం చాలా తక్కువగా ఉందని అంటున్నారు.

Read More: ‘మన పాలన – మీ సూచన’లో సీఎం జగన్ కీలక పాయింట్స్

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్