Viral: అంతరిక్షం నుంచి భూమి ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా.? అయితే మీకోసమే ఈ వీడియో.!
మన భూమి అంతరిక్షం నుండి ఎలా ఉంటుందో చూడాలని మనలో చాలా మంది కోరుకుంటారు?..
మన భూమి అంతరిక్షం నుండి ఎలా ఉంటుందో చూడాలని మనలో చాలా మంది కోరుకుంటారు? మన అందమైన భూమి అంతరిక్షం నుండి చూసినప్పుడు, అది ఎంత అందంగా కనిపిస్తుంది? ‘ఎర్త్ డే’ సందర్భంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి తీసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ దృశ్యాలను చూసిన తర్వాత మీరు కూడా మళ్లీ మళ్లీ చూడాలనుకుంటున్నారు.
ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 22న ఎర్త్ డే జరుపుకుంటారు. ఇక ఇప్పటివరకు 53 వేల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. ఎర్త్‌డే సందర్భంగా ఈ వీడియోను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా.. నెటిజన్లు రీ-ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు.
ఈ వీడియోను వేలాది మంది చూశారు..
ఈ వీడియోను ఇప్పటివరకు 53 వేలకు పైగా నెటిజన్లు వీక్షించడమే కాకుండా లైకులు వర్షం కురిపించారు. ఈ వీడియోను ఆస్వాదించడంతో పాటు ప్రజలు తమ అనుభవాలను పంచుకుంటున్నారు.