Whatsapp: మీ స్మార్ట్ ఫోన్ పోయిందా.? మరి మీ వాట్సాప్ పరిస్థితి ఏంటి.?
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ వాట్సాప్‌ను ఉపయోగిస్తున్న రోజులివీ. వ్యక్తిగత చాటింగ్స్, ఫొటోలు, వీడియోలు ఇలా ఎన్నింటికో వాట్సాప్ వేదికగా మారింది. మరి పొరపాటున మీ ఫోన్ పోతే... ఫోన్ తీసుకున్న వ్యక్తి మీ వాట్సాప్ అకౌంట్‌ను చూసే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా పోయిన ఫోన్‌లో ఉన్న వాట్సాప్ అకౌంట్‌ను ఎలా రీస్టోర్ చేసుకోవాలి.? వాట్సాప్‌ను సదరు ఫోన్‌లో నుంచి ఎలా డీయాక్టివేట్ చేయాలి.?
ప్రస్తుతం వాట్సాప్ వినియోగం అనివార్యంగా మారింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ వాట్సాప్‌ను ఉపయోగిస్తున్న రోజులివీ. వ్యక్తిగత చాటింగ్స్, ఫొటోలు, వీడియోలు ఇలా ఎన్నింటికో వాట్సాప్ వేదికగా మారింది. మరి పొరపాటున మీ ఫోన్ పోతే… ఫోన్ తీసుకున్న వ్యక్తి మీ వాట్సాప్ అకౌంట్‌ను చూసే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా పోయిన ఫోన్‌లో ఉన్న వాట్సాప్ అకౌంట్‌ను ఎలా రీస్టోర్ చేసుకోవాలి.? వాట్సాప్‌ను సదరు ఫోన్‌లో నుంచి ఎలా డీయాక్టివేట్ చేయాలి.? లాంటి వివరాలు మీకోసం..
* మీ ఫోన్ పోయిన వెంటనే వాట్సాప్‌ను డీయాక్టివేట్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం వాట్సాప్ సపోర్ట్‌కు మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం support@whatsapp.com మెయిల్ ఐడీకి మీ ఫోన్ పోయిన విషయాన్ని వివరిస్తూ, అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయమని మెయిల్ పంపించాల్సి ఉంటుంది. ఇందులో మీ ఫోన్ నెంబర్‌ను పేర్కొనాల్సి ఉంటుంది. అయితే మీ మెయిల్ ఐడీకి కూడా అదే ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి.
* ఒకవేళ ఫోన్ పోతే చాట్ హిస్టరీ ఎలా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఇందుకోసం కూడా ఓ ఐడియా ఉంది. వాట్సాప్ అకౌంట్ చాట్‌ను ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకుంటే మీ ఫోన్ పోయినా చాట్ హిస్టరీని రిస్టోర్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు చాట్ బ్యాకప్ అయ్యేలా సెట్టింగ్స్‌లో మార్చుకుంటే బ్యాకప్ పొందొచ్చు. ఇందుకోసం వాట్సాప్ సెటింగ్స్ లోకి వెళ్లి, చాట్స్ ఆప్షన్ సెలక్ట్ చేసుకుని, చాట్ బ్యాకప్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
* ఇక మీ ఫోన్ పోయిన వెంటనే మీ పాత ఫోన్ నెంబర్‌ను బ్లాక్ చేయించాలి. టెలికం కంపెనీ వెంటనే కొత్త సిమ్ కార్డును అందిస్తుంది. దీంతో కొత్త సిమ్ కార్డుతో మళ్లీ వాట్సాప్‌లోకి లాగిన్ అయ్యి.. చాట్ హిస్టరీని రీస్టోర్ చేసుకోవచ్చు. పాత ఫోన్ నుంచి లాగవుట్ అయ్యి, కొత్త ఫోన్‌లో లాగిన్ అవ్వొచ్చు.
* ఒకవేళ మీ ఫోన్ పోతే మీ వాట్సాప్ అకౌంట్‌ను ఇతరులు యాక్సెస్ చేయకుండా ఉండాలంటే టూ స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకోవాలి. ఇందుకోసం వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం అకౌంట్ సెక్షన్‌లో టూ స్టెప్ వెరిఫికేషన్ సెలక్ట్ చేసుకోవాలి. వెంటనే ఆరు అంకెల కోడ్ సెట్ చేసుకోవాలి. దీంతో వాట్సాప్ ఓపెన్ చేసిన సమయంలో పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీంతో మీరు వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు 6 అంకెల్ పిన్ ఎంటర్ చేస్తేనే వాట్సాప్ ఓపెన్ అవుతుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..