Whatspp: చడీచప్పుడు లేకుండా కొత్త ఫీచర్ తీసుకొచ్చిన వాట్సాప్.. మీ యాప్‌లో ఈ తేడాను గమనించారా.?
Whatspp: స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్న వారికి వాట్సాప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను పరిచయం చేసే వాట్సాప్ రోజురోజుకీ యూజర్లను...
Whatspp: స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్న వారికి వాట్సాప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను పరిచయం చేసే వాట్సాప్ రోజురోజుకీ యూజర్లను పెంచుకుంటూ పోతోంది. పెరుగుతోన్న పోటీ తట్టుకునే క్రమంలోనే కొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను దూరం కాకుండా చేసుకుంటోంది. ఇప్పటికే పలు ఆసక్తికరమైన ఫీచర్లను పరిచయం చేసిన ఈ మెసేసింగ్ యాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను చడీ చప్పుడు లేకుండా తీసుకొచ్చింది. వాట్సాప్ యాప్‌లో ఈ కొత్త ఫీచర్ ఇప్పటికే యాడ్ అయిపోయింది. యాప్‌లో వచ్చిన ఈ కొత్త మార్పును చాలా మంది కనీసం గమనించి కూడా ఉండకపొవచ్చు.
మొన్నటి వరకు వాట్సాప్ ఓపెన్ చేయగానే పైన చాట్స్, స్టేటస్, కాల్స్ అనే మూడు ఆప్షన్స్ కనిపించేవి. కానీ ఇప్పుడు వాటికి తోడుగా కెమెరా ఐకాన్ కనిపిస్తోంది. ఓసారి చెక్ చేయండి. కనిపించిందా..? ఇంతకీ ఈ ఫీచర్ ఉపయోగమేంటనేగా మీ సందేహం. ఈ కెమెరా ఐకాన్‌ను క్లిక్ చేయగానే వెంటనే కెమెరా ఓపెన్ అవుతోంది. దీంతో ఫొటోను క్లిక్ మనిపించి మీకు నచ్చిన వారికి మెసేజ్ చేయడమో లేదా స్టేటస్‌గా పెట్టుకోవచ్చు.
ఇప్పటి వరకు అయితే మీరు ఎవరికి ఫొటో పంపాలనుకుంటున్నారో వారి చాట్ పేజ్ ఓపెన్ చేసి కెమెరాపై క్లిక్ చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు హోంలోనే కెమెరాను ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ గతంలో కేవలం ఐఓస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ప్రస్తుతం ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లోనూ ఫీచర్‌ను పరిచయం చేశారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..