- Telugu News Photo Gallery Technology photos Realme launch new 5g smartphone Realme 9i 5g price and features Telugu Tech News
Realme 9i 5g: తక్కువ ధరలో 5జీ ఫోన్ కోసం చూస్తున్నారా.? రియల్‌మీ నుంచి వచ్చిన కొత్త ఫోన్ మీకోసమే..
Realme 9i 5g: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఆగస్ట్ 24న తొలి సేల్ ప్రారంభం కానుంది. ఆకట్టుకునే ఫీచర్లతో రూపొందించిన ఈ ఫోన్ బడ్జెట్ ధరలోనే అందుబాటులోకి వస్తుండడం విశేషం..
Updated on: Aug 19, 2022 | 11:06 AM

దేశంలో మరికొన్న రోజుల్లో 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి రోజుకో కొత్త 5జీ ఫోన్ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రియల్‌మీ కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్‌మీ 9ఐ పేరుతో లాంచ్ చేసిన ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.6 ఇంచెస్ ఫుడ్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. 90Hz రిఫ్రెష్ రేట్, 400 nits బ్రైట్‌నెస్ ఈ డిస్‌ప్లే సొంతం.

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్‌ను అందించారు. మైక్రో ఎస్‌డీ కార్డు సహాయంతో మెమోరీని 1టీబీ వరకు పెంచుకోవచ్చు.

కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. 18 వాట్స్ క్విక్ చార్జ్ టెక్నాలజీతో కూడిన 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.

రియల్‌మీ 9ఐ ఫోన్ 4జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ధర రూ. 14,999 కాగా, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 16,999గా ఉంది. పలు బ్యాంకుల కార్డుతో కొనుగోలు చేసే రూ. 1000 డిస్కౌంట్ లభిస్తుంది.




