WhatsApp: ఈ పేరుతో వాట్సాప్‌కి ఏదైనా లింక్‌ వచ్చిందా.? క్లిక్‌ చేశారో..

ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగించని వారు లేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందులోనూ వాట్సాప్‌ను ఉపయోగించని వారు కూడా ఉండరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌ వాట్స్‌నే తమ నేరాలకు అస్త్రంగా మార్చుకుంటున్నారు కేటుగాళ్లు. వాట్సాప్‌లో రకరకాల లింక్‌లను...

WhatsApp: ఈ పేరుతో వాట్సాప్‌కి ఏదైనా లింక్‌ వచ్చిందా.? క్లిక్‌ చేశారో..
Whatsapp
Follow us

|

Updated on: Jun 17, 2024 | 12:29 PM

పెరుగుతోన్న టెక్నాలజీతో పాటు నేరాల తీరు కూడా మారుతోంది. ప్రపంచంలో ఏదో మూలన కూర్చొని మన ఖాతాల్లోని డబ్బులను కాజేస్తున్నారు కేటుగాళ్లు. ఇందుకోసం రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎన్ని రకాల మోసాలు వెలుగులోకి వస్తున్నా, మరో కొత్త రకం మోసంతో ప్రజలను నిండా ముంచేస్తున్నారు. అధికారులు ఎన్ని రకాల జాగ్రత్తలు చెబుతున్నా మోసాలు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ మోసం వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగించని వారు లేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందులోనూ వాట్సాప్‌ను ఉపయోగించని వారు కూడా ఉండరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌ వాట్స్‌నే తమ నేరాలకు అస్త్రంగా మార్చుకుంటున్నారు కేటుగాళ్లు. వాట్సాప్‌లో రకరకాల లింక్‌లను పంపిస్తూ ఫోన్‌లను హ్యాక్‌ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ భాగోతం తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాకు చెందన ఇచ్చోడలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. సిరికొండ మండలం సోంపెల్లి గ్రామానికి చెందిన కొందరికి ఇటీవల వాట్సాప్ గ్రూప్‌లో పీఎం కిసాన్‌ పేరుతో ఓ యాప్‌ లింక్‌ వచ్చింది. ఇంతకీ ఆ లింక్‌ ఏంటని క్లిక్‌ చేశారు. దీంతో వెంటనే వారి వాట్సాప్‌ పూర్తిగ అవతలి వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. వాట్సాప్‌ ఎంతకీ ఓపెన్‌ కాకపోవడం, ఇతర యాప్‌లు వాటంతటవే ఆపరేట్ అయ్యాయి. వాట్సాప్‌లోని గ్రూప్‌లకు వాటంతటవే మెసేజ్‌లు ఫార్వర్డ్‌ అవుతున్నాయి.

దీంతో తమ ఫోన్‌ హ్యాక్‌కి గురైనట్లు భావించిన సదరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సైబర్‌ క్రైం డీఎస్పీ హసీద్‌ ఉల్లా మాట్లాడుతూ.. మొబైల్‌లో వచ్చే యాప్‌లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పీఎం కిసాన్‌ యాప్‌లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్‌ చేయొద్దని తెలిపారు. ఏదైనా సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..