Samsung Galaxy F14: అతి తక్కువ ధరకే 5జీ ఫోన్.. ఫ్లిప్ కార్ట్ లో అదిరే ఆఫర్..
5జీ ఫోన్ల రేటు కాస్త ఎక్కువగానే ఉంటున్నాయి. దీంతో తక్కువ ధరలో దొరికే స్మార్ట్ ఫోన్ల కోసం వినియోగదారులు వెతుకుతున్నారు. మీరు కూడా అలాంటి ఫోన్ల కోసమే ఎదురుచూస్తుంటే మీ వెతుకులాటకు ఇక ఫుల్ స్టాప్ పెట్టేయొచ్చు. శామ్సంగ్ గెలాక్సీ నుంచి ఓ 5జీ ఫోన్ అనువైన ధరలో అందుబాటులో ఉంది. పైగా దానిపై పలు ఆఫర్లు కూడా ఉన్నాయి. ఆ స్మార్ట్ ఫోన్ మోడల్ పేరు శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ.

ఇటీవల కాలంలో 5జీ స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. ఎయిర్ టెల్, జియో వంటి టెలికాం సంస్థలు అన్ని నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తేవడంతో అందరూ 5జీ ఫోన్లను కావాలనుకుంటున్నారు. అయితే 5జీ ఫోన్ల రేటు కాస్త ఎక్కువగానే ఉంటున్నాయి. దీంతో తక్కువ ధరలో దొరికే స్మార్ట్ ఫోన్ల కోసం వినియోగదారులు వెతుకుతున్నారు. మీరు కూడా అలాంటి ఫోన్ల కోసమే ఎదురుచూస్తుంటే మీ వెతుకులాటకు ఇక ఫుల్ స్టాప్ పెట్టేయొచ్చు. శామ్సంగ్ గెలాక్సీ నుంచి ఓ 5జీ ఫోన్ అనువైన ధరలో అందుబాటులో ఉంది. పైగా దానిపై పలు ఆఫర్లు కూడా ఉన్నాయి. ఆ స్మార్ట్ ఫోన్ మోడల్ పేరు శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ. ఈ శామ్సంగ్ 5జీ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, పీచర్లు, అందుబాటులో ఉన్న డిస్కౌంట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ..
శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ ఫోన్ అత్యల్ప ధరకు అందుబాటులో ఉంది. ఇది అధిక ధర కలిగిన శామ్సంగ్ గెలాక్సీ ఎం14 5జీలో ఉన్న అవే ఫీచర్లు ఉంటాయి. అయితే దీనికి దానికి ఉన్న ఒకే ఒక్క తేడా కెమెరా. ఎం సిరీస్ లో అధిక రిజల్యూషన్ ఉన్న కెమెరా ఉంటుంది. కాగా ఎఫ్14 5జీ ఫోన్ పై ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ లో ప్రత్యేక ఆఫర్ లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ లో భాగంగా ఈ శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్14 ను రూ. 11,490కి కొనుగోలు చేయొచ్చు. అంతేకాక కొన్ని బ్యాంక్ ఆఫర్‌లు ఉన్నాయి. అవన్నీ కలిపితే దీనిని కేవలం రూ. 10,000కే కొనుగోలు చేయొచ్చు.
ఆఫర్ల వివరాలు ఇవి..
శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ ఫోన్ ధర రూ. 11,490గా ఉంది. వాస్తవానికి ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 12,990గా ఉండింది. అంటే వినియోగదారులు దీనిపై ఫ్లాట్ రూ. 1,500 డిస్కౌంట్ లభిస్తోంది. దీనికి అదనంగా కొన్ని బ్యాంకు కార్డులపై అదనంగా 10శాతం తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ కూడా కలుపుకుంటే ఇంకా తగ్గుతుంది.
శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ స్పెసిఫికేషన్లు..
మీరు కనుక 5జీ స్మార్ట్ ఫోన్ తక్కువ ధరకే కావాలనుకుంటే మాత్రం ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది మీ అంచనాలకు అనుగుణంగా ఉంటుంది. దీనిలో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. అలాగే దీనిలో అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంటుంది. 6,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీని కెమెరా పనితీరు కూడా చాలా బాగుంటుంది. వినియోగదారులు రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను పొందలేరు. ప్రజలు పాత ఛార్జర్‌పై అదనపు ఖర్చు చేయకుండా ఉండేందుకు దాన్ని ఉపయోగించడాన్ని పరిగణించవచ్చు. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. వెనుకవైపు కెమెరా ట్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు, 2ఎంపీ కెమెరా ఉంటుంది. ముందు వైపు 13ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఎక్సినోస్ 1330, ఆక్టా కోర్ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..