Google Privacy: గూగుల్‌లో మీ సమాచారం సేఫ్‌గా ఉండాలంటే.. ఈ పనిచేయాల్సిందే..

Google Privacy: ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు రోజులో కనీసం ఒక్కసారైనా గూగుల్‌ను ఓపెన్‌ చేయని వారు ఉండనరంలో ఎలాంటి సందేహం లేదు. ఏ చిన్న సందేహం వచ్చినా వెంటనే గూగుల్‌ ఓపెన్‌ చేసి వెతికేసే రోజులు వచ్చేశాయి. కేవలం సెర్చింగ్‌ మాత్రమే కాకుండా..

Google Privacy: గూగుల్‌లో మీ సమాచారం సేఫ్‌గా ఉండాలంటే.. ఈ పనిచేయాల్సిందే..
Google Privacy
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 10, 2022 | 3:57 PM

Google Privacy: ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు రోజులో కనీసం ఒక్కసారైనా గూగుల్‌ను ఓపెన్‌ చేయని వారు ఉండనరంలో ఎలాంటి సందేహం లేదు. ఏ చిన్న సందేహం వచ్చినా వెంటనే గూగుల్‌ ఓపెన్‌ చేసి వెతికేసే రోజులు వచ్చేశాయి. కేవలం సెర్చింగ్‌ మాత్రమే కాకుండా.. మెయిల్‌, మ్యాప్స్‌, ఫొటోలు, కాంటాక్ట్స్‌, షాపింగ్‌ ఇలా ప్రతీది గూగుల్‌లో దొరుకుతుంది. అయితే ఈ సేవలను మనం పొందాలంటే కచ్చితంగా ఎంతో కొంత మన వ్యక్తిగత సమాచారాన్ని గూగుల్‌కు ఇవ్వాల్సి ఉంటుంది.

దీంతో గూగుల్‌లో సేవ్‌ అయిన ఈ సమాచారం ఇతరులకు కూడా కనిపించే అవకాశం ఉంటుంది. దీంతో డేటా ప్రైవసీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. అయితే గూగుల్‌లో కొన్ని సింపుల్‌ సెట్టింగ్స్‌తో మీ డేటాను భద్రపరుచుకోవచ్చనే విషయం మీకు తెలుసా.? మీ డేటాను సేఫ్‌గా ఉంచుకోవాలంటే చేయాల్సిన ఆ మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం..

* ఇందుకోసం ముందుగా గూగుల్‌ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.

* అనంతరం మేనేజ్‌ యువర్‌ గూగుల్‌ అకౌంట్‌ అనే ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి.

* వెంటనే మీ గూగుల్‌ అకౌంట్‌ ఓపెన్‌ అవుతుంది.

* అందులో ఉండే పర్సనల్‌ మీ ఇన్ఫో సెక్షన్‌పై క్లిక్‌ చేస్తే చూజ్‌ వాట్‌ అథర్స్‌ సీ అనే ఆప్షన్ క్లిక్‌ చేయాలి.

* అనంతరం అబౌట్‌ మీపై క్లిక్‌ చేయగానే, యాడ్‌, ఎడిట్‌, రిమూవ్‌ ఆప్షన్లు వస్తాయి.

* పైన వచ్చిన ఆప్షన్స్‌ ఆధారంగా మీ అకౌంట్‌ వివరాలు మార్చుకోవచ్చు.

* ఇక మీ సమాచారం ఎవరికీ కనిపించకుడదనుకుంటే ‘ఓన్లీ మీ’ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

Also Read: Watch Video: ఇది కోహ్లీ స్టైల్ పుష్ప డ్యాన్స్.. ఇరగదీశావంటోన్న ఫ్యాన్స్.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

Tollywood: సీఎం జగన్‌తో భేటీ అనంతరం టాలీవుడ్ హీరోల కామెంట్స్ ఇవే.. మీరూ చూసేయండి

Sudheer Babu : నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టమని కామెంట్ చేశారు.. సుధీర్ బాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్