Best Camera Phones: ఇన్‌స్టా రీల్స్ షూటింగ్ కోసం టాప్–3 కెమెరా ఫోన్లు ఇవే..
మీరు ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసే రీల్స్ క్వాలిటీ ఉండట్లేదా? వాటికి రీచ్ కూడా ఎక్కువగా రావట్లేదా? అయితే మీరు రీల్స్ వీడియో క్వాలిటీని పెంచాల్సిందే. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్ గా ఉండేవాళ్లు రీల్స్ కోసం మెరుగైన కెమెరా ఫోన్‌ను వాడాల్సి ఉంటుంది. అలాంటి కొన్ని బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇప్పుడు చూద్దాం.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు మంచి రీచ్ రావాలంటే ముందుగా ఆ రీల్ క్వాలిటీ బాగుండాలి. అంటే రీల్ తీసేటప్పుడు లైటింగ్, తర్వాత ఎడిటింగ్, సౌండ్ ఇవన్నీ కూడా చక్కగా సెట్ చేసుకోవాలి. అయితే వీటన్నింటికంటే ముఖ్యంగా ఆ రీల్ మంచి హెచ్‌డీ క్వాలిటీలో ఉండాలి. రీల్ షూట్ చేసే కెమెరాకు హెచ్‌డీఆర్ సపోర్ట్, స్లో మోషన్, లోలైట్ ఫీచర్స్ వంటివి ఉంటే రీల్ మరింత బెటర్‌గా వస్తుంది. మరి అలాంటి కెమెరా ఫీచర్లు ఉండే బెస్ట్ ఫోన్స్ ఏంటో చూసేద్దామా?
శాంసంగ్ ఎస్ 24/ ఎస్ 25
శాంసంగ్ ఫ్లాగ్ షిప్ ఫోన్స్ అయిన ఎస్ 24 లేదా ఎస్ 25 మొబైల్స్ లో మంచి కెమెరా ఉంటుంది. ఇది మంచి క్వాలిటీలో వీడియోలు తీయడమే కాకుండా హెచ్ డీఆర్ సపోర్ట్, స్లోమోషన్ వంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. అలాగే ఇందులో తీసిన ఫొటోలు, వీడియోలకు మంచి మంచి ఫిల్టర్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. అందుకే ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్లకు, రీల్స్ చేసేవారికి ఇదొక మంచి ఆప్షన్.
ఐఫోన్ 16
ఐఫోన్ 16 లో 48 మెగా పిక్సె్ల్ కెమరా ఉంది. ఇది మంచి వీడియోస్ తీయగలదు. ఇందులో హైక్వాలిటీ వీడియో అవుట్‌పుట్‌తో పాటు కలర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ కూడా బెటర్‌గా ఉంటుంది. ఐఫోన్ తో ఏకంగా సినిమానే తీయొచ్చని యాపిల్ సంస్థ చెప్తోంది. కాబట్టి రీల్స్ షూట్ చేయడానికి దీనికి మించిన బెస్ట్ చాయిస్ లేదు. అలాగే ఇందులో రీల్స్‌ను క్రియేటివ్‌గా ఎడిట్ చేసుకునేందుకు కూడా బోలెడు ఆప్షన్స్ ఉంటాయి.
వన్‌ప్లస్ 13 ఆర్
ఇక బడ్జెట్‌లో బెస్ట్ కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే వారికి వన్‌ప్లస్ 13 ఆర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇందులో 50 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది హెచ్‌డీ క్వాలిటీలో వీడియోస్ షూట్ చేయగలదు. అలగే స్లో మోషన్ వీడియో ఆప్షన్ కూడా ఉంది. రీల్స్ షూట్ చేయడానికి, ఎడిట్ చేసుకోడానికి ఇందులో చాలానే ఫీచర్లు ఉన్నాయి.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




