AI Prompts: పాత ఫొటోలు కొత్తగా మార్చాలా? ఈ ప్రాంప్ట్స్ టైప్ చేయండి చాలు!

మీ దగ్గర పాత బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు ఉన్నాయా? వాటిని హెచ్‌డీ క్వాలిటితో కలర్ లోకి మార్చాలనుకుంటున్నారా? ఇప్పుడా పని చిటికెలో అయిపోతుంది. జెమిని, పర్‌‌ప్లెక్సిటీ వంటి ఏఐ టూల్స్ వచ్చాక ఫోటోలు, వీడియోలకు సంబంధించిన చాలా టెక్నిక్స్ అందుబాటులోకి వచ్చాయి. ఫొటో అప్‌లోడ్ చేసి ఎలా మార్చమంటే అలా మార్చేస్తున్నాయి ఈ టూల్స్. మరి పాత ఫొటోలను కొత్తగా మార్చడం కోసం ఎలాంటి ప్రాంప్ట్స్ వాడాలో తెలుసుకుందామా?

AI Prompts: పాత ఫొటోలు కొత్తగా మార్చాలా? ఈ ప్రాంప్ట్స్ టైప్ చేయండి చాలు!
Ai Prompts

Updated on: Oct 14, 2025 | 3:28 PM

పాత ఫోటోల్లో ఎన్నో జ్ఞాపకాలు దాగి ఉంటాయి.  చాలామంది వాటిని చాలా భద్రంగా కాపాడుకుంటారు. అయితే గాలి, తేమకు గురికావడం వల్ల పాత ఫొటోలు మసకబారుతుంటాయి. అయితే ఇప్పుడొచ్చిన ఏఐ ద్వారా పాత ఫోటోలను కొత్త వాటిలాగే తిరిగి సృష్టించొచ్చు.  పాత బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను కలర్ లోకి మార్చడం ఇప్పుడు చాలా ఈజీ. జెమినీ, చాట్ జీపీటీ, పర్‌‌ప్లెక్సిటీ వంటి ఏఐ టూల్స్ లోకి వెళ్లి మీ పాత ఇమేజ్ ను అప్‌లోడ్ చేస్తే చాలు మీరు కోరుకున్న విధంగా ఇమేజ్ రెడీ అవుతుంది. అయితే దీనికై సరైన ప్రాంప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇచ్చే ప్రాంప్ట్ ను బట్టి ఇమేజ్ తీరు మారుతుంది. పాత ఫొటోలను కొత్తగా తీర్చిదిద్దడానికి ఎలాంటి ప్రాంప్ట్స్ ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం.

బెస్ట్ ప్రాంప్ట్స్ ఇవే

  • పాత ఫోటోలో ఒకే వ్యక్తి ఉంటే అప్పుడు ఆ ఫొటోను ఏఐ టూల్‌లో అప్‌లోడ్ చేసి..“Enhance the clarity and sharpness of this old portrait photo. Repair the cuts and torn out sections. Restore facial details naturally without over-smoothing. Maintain original colors and lighting” అనే ప్రాంప్ట్‌ను జోడించండి. ఇప్పుడు  ఫొటో లేటెస్ట్ గా తీసిన ఫొటోలా మారిపోతుంది.
  • పాత ఫోటోలో సరిగ్గా క్లారిటీ లేకపోతే “Make this blurry face photo clearer, improving eyes, skin texture, and hair details while keeping it realistic. Repair any cuts and torn” అన్న ప్రాంప్ట్ వాడండి. ఫొటోలోని గీతలు మాయమై స్పష్టమైన ఇమేజ్ జనరేట్ అవుతుంది.
  • ఒకవేళ మీ దగ్గర పాత ఫ్యామిలీ ఫొటో ఉంటే “Fix the torn areas of this family photo, make the faces clear and sharp, and restore the colors naturally.” అనే ప్రాంప్ట్ ఎంటర్ చేయండి. పాత ఫ్యామిలీ ఫొటో కొత్త ఫ్యామిలీ ఫొటోగా మారిపోతుంది.
  • బ్లాక్ అండ్ వైట్ ఫొటోను కలర్ లోకి మార్చాలంటే “ Colorize this old black-and-white photo, remove the cracks, and enhance the facial details for better recognition” అనే ప్రాంప్ట్‌ ఎంటర్ చేస్తే సరిపోతుంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి