పొరపాటున కూడా గూగుల్‌లో ఈ 4 విషయాలపై సెర్చ్ చేయోద్దు.. సమస్యలే కాదు ఏకంగా జైలుకే..

Never Search These Things on Google: సాధారణంగా ఏదైనా అంశం గురించి సమాచారం అవసరమైతే చాలామంది గూగుల్‌లో తెగ వెతికేస్తుంటారు. కానీ గూగుల్‌లో కొన్ని విషయాలను పొరపాటున కూడా సెర్చ్ చేయకూడదు. అలాంటి 4 విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటివి సెర్చ్ చేస్తే జైలుకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంటుంది.

పొరపాటున కూడా గూగుల్‌లో ఈ 4 విషయాలపై సెర్చ్ చేయోద్దు.. సమస్యలే కాదు ఏకంగా జైలుకే..
Google Search

Updated on: Aug 07, 2025 | 8:52 AM

Never Search These things on Google: ఇంటర్నెట్ మానవుల జీవితంలోకి ప్రవేశించినప్పటి నుంచి అంతా మారిపోయింది. ఎలాంటి అర్థం కాని సమాచారం కనిపించినా.. జటస్ట్ గూగుల్ చేస్తే పూర్తి వివరణ ఇచ్చేస్తుంది. అయితే, గూగుల్‌లో సెర్చ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది. అలా కాదని మీరు సెర్చ్ చేస్తే, మీ ఐపీ అడ్రస్‌ను ట్రాక్ చేస్తారు. అలాగే, నిఘా సంస్థలు లేదా పోలీసులు డైరెక్ట్‌గా మీ ఇంటికి చేరుకుంటారు. దీంతో ఏకంగా జైలుకు కూడా వెళ్లాల్సి రావొచ్చు. అయితే, గూగుల్‌లో ఎలాంటివి సెర్చ చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

1. బాంబు ఎలా తయారు చేయాలో వెతకొద్దు: బాంబులు లేదా ఆయుధాలను తయారు చేసే పద్ధతి గురించి మీరు Googleలో ఎప్పుడూ సెర్చ్ చేయకూడదు. దేశంలోని నిఘా సంస్థలు ఇటువంటి కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతాయి. బాంబులు తయారు చేసే పద్ధతి లేదా పేలుడు పదార్థాలను తయారు చేసే పద్ధతి గురించి సెర్చ్ చేస్తే, అనుమానాస్పద కార్యకలాపాలుగా పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో మీపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇటువంటి సందర్భంలో, స్థానిక పోలీసులు మిమ్మల్ని ప్రశ్నించడంతోపాటు అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఏదైనా అనుమానాస్పద కేసులో మీ ప్రమేయం ఉన్నట్లు తేలితే అరెస్టు కూడా చేయవచ్చు.

2. హ్యాకింగ్ నేర్చుకోవడానికి: గూగుల్‌లో డివైస్‌ని ఎలా హ్యాక్ చేయాలి, పాస్ వర్డ్‌ని ఎలా హ్యాక్ చేయాలి లేదా హ్యాకింగ్ టూల్స్ డౌన్‌లోడ్ ఎలా చేసుకోవాలి అని సెర్చ్ చేయకూడదు. సైబర్ క్రైమ్ యూనిట్‌లో ఉన్న వ్యక్తుల దృష్టికి ఈ విషయం చేరితే, హ్యాకింగ్ చట్ట ప్రకారం నేరం, కాబట్టి అనుమానాస్పద కార్యకలాపాలుగా తేల్చి పోలీసులు మిమ్మల్ని ప్రశ్నించడానికి వచ్చేస్తారు. హ్యాకింగ్ చేసి ఉంటే మిమ్మల్ని అరెస్టు కూడా చేస్తారు.

ఇవి కూడా చదవండి

3. పైరేటెడ్ సినిమాలపై సెర్చింగ్: ప్రస్తుతం OTT లేదా థియేటర్‌లకు వెళ్లే బదులు, ప్రజలు Googleలో ఉచిత సినిమాల కోసం వెతుకుతున్నారు. ఇక్కడ సినిమా పైరేటెడ్ వెర్షన్‌ను చూడొచ్చు. కానీ అలా చేయడం చట్ట ప్రకారం నేరం. మీరు Googleలో పైరేటెడ్ సినిమాను డౌన్‌లోడ్ చేసుకుంటే లేదా సెర్చ్ చేస్తే, మీకు జరిమానా లేదా జైలు శిక్ష కూడా పడే ఛాన్స్ ఉంటుంది. భారతదేశంలో కాపీరైట్ చట్టం ప్రకారం పైరసీ నేరం కిందకు వస్తుంది.

4. పిల్లల అశ్లీల ఫొటోలు, వీడియోల కోసం Google చేయోద్దు: మీరు Google లో పిల్లల అశ్లీల కంటెంట్‌ కోసం సెర్చ్ చేస్తే నేరం చేస్తున్నట్లే. ఇలా చేయడం ప్రపంచవ్యాప్తంగా నేరంగా పరిగణిస్తున్నారు. మీరు పిల్లల అశ్లీల కంటెంట్‌ కోసం సెర్చ్ చేస్తే.. మీపై కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. POCSO అంటే లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం కింద మీపై కేసు నమోదు చేయవచ్చు. ఈ క్రమంలో సుదీర్ఘ జైలు శిక్ష, జరిమానా విధించే ఛాన్స్ ఉంది. ఇటువంటి కంటెంట్‌ను సెర్చ్ చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ విభాగం నిశితంగా నిఘా ఉంచుతుంది. ఇది తీవ్రమైన నేరం.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..