AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Scooter: సూపర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. బ్యాటరీ అయిపోయినా ప్రయాణం అగదు.. సైకిల్‌గా మారే ఈవీ

Electric Scooter: అద్భుతమైన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అందుబాటులోకి వస్తుంది. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కు బ్యాటరీ అయిపోయినా నో టెన్షన్‌. సైకిల్‌గా మార్చి ముందుకు సాగవచ్చు. ఇలాంటి స్కూటర్‌ను మీరు ఎప్పుడు చూడకపోవచ్చు. మరి ఈ స్కూటర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Electric Scooter: సూపర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. బ్యాటరీ అయిపోయినా ప్రయాణం అగదు.. సైకిల్‌గా మారే ఈవీ
Vinfast Electric Scooter
Subhash Goud
|

Updated on: Apr 03, 2026 | 4:15 PM

Share

VinFast Electric Scooter: విన్‌ ఫాస్ట్ చక్కటి ఎలక్ట్రిక్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. మధ్య తరగతి ప్రయాణీకులకు అందుబాటులో ఉండేలా వీటిని తయారు చేస్తుంది. ఈ విన్‌ఫాస్ట్ (VinFast) మధ్యతరగతి ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ‘అమియో’ (Ameo) అనే సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేసింది. ఇది కేవలం స్కూటర్ మాత్రమే కాదు, అవసరమైతే సైకిల్‌లా కూడా వాడుకోగలిగే 2-ఇన్-1 డిజైన్‌తో రావడం దీని ప్రత్యేకత.

పెడల్ సిస్టమ్:

సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్లలో బ్యాటరీ అయిపోతే బండి ఆగిపోతుంది. కానీ అమియోలో అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే పెడల్స్ ఉంటాయి. ఛార్జింగ్ అయిపోయినప్పుడు దీనిని హాయిగా సైకిల్‌లా తొక్కుకుంటూ వెళ్లవచ్చు.

VinFast Ameo

VinFast Ameo

తేలికపాటి డిజైన్:

పట్టణాల్లోని ఇరుకైన గల్లీల్లో, ట్రాఫిక్‌లో సులభంగా ప్రయాణించేలా దీనిని చాలా తేలికగా రూపొందించారు. విద్యార్థులు, మహిళలు, వృద్ధులకు ఇది ఎంతో అనుకూలం. అలాగే దీని గరిష్ట వేగం తక్కువగా ఉండటం వల్ల, దీనిని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇది విద్యార్థులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. బరువు తక్కువగా ఉండటం వల్ల ట్రాఫిక్‌లో, పార్కింగ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు. నగరాల్లో చిన్న రోడ్లు, గల్లీల్లో ప్రయాణించేందుకు ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఒక్కసారి ఛార్జింగ్‌తో 70 కిలోమీటర్ల ప్రయాణం:

ఇక అమియో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ స్కూటర్‌లో 800W ఇన్-హబ్ మోటార్ ఉంటుంది. ఇది ఎక్కువ వేగం కోసం కాదు. కానీ సేఫ్‌గా, సౌకర్యంగా ప్రయాణించడానికి సరిపడేలా ఉంటుంది. దీని గరిష్ట వేగం సుమారు గంటకు 30 కిలో మీటర్ల వరకు ఉంటుంది. ఇందులో 1.024 kWh లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ఉంటుంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది.

ధర:

ఇక ఈ స్కూటర్‌ ధర విషయానికొస్తే ఎంట్రీ లెవల్ వినియోగదారులను ఆకట్టుకునేలా విన్‌ఫాస్ట్ దీని ధరను నిర్ణయించింది. ప్రారంభ ధర సుమారు రూ.65,000, టాప్ ఎండ్ వేరియంట్‌ ధర రూ. సుమారు రూ.81,000.

ఎవరికి బెస్ట్ ఆప్షన్?

తక్కువ దూరాలు ప్రయాణించే వారికి ఆఫీసులకు లేదా కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు, తక్కువ ఖర్చుతో పర్యావరణహితంగా ప్రయాణించాలనుకునే వారికి విన్‌ఫాస్ట్ అమియో ఒక అద్భుతమైన ఎంపిక. భారత మార్కెట్లోకి విన్‌ఫాస్ట్ తన లైనప్‌ను విస్తరిస్తున్న తరుణంలో అమియో మోడల్ ఎంట్రీ లెవల్ ఈవీ సెగ్మెంట్‌లో కీలక పాత్ర పోషించనుంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం