AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iPhone SE 4: లాంచ్‌కు ముందు చౌకైన ఐఫోన్ డిజైన్ లీక్.. ఎలా ఉంటుందో తెలుసా..?

iPhone SE 4: యాపిల్‌ నుంచి ఐఫోన్‌ వస్తుందంటే చాలు ఎదురు చూసే వాళ్లు చాలా మంది ఉంటారు. ఐఫోన్‌కు ఉన్న క్రేజ్ అట్లాంటిది. ప్రతి ఏడాది యాపిల్‌ కంపెనీ కొత్త ఫోన్‌ను విడుదల చేస్తుంటుంది. ఇటీవల ఐఫోన్‌ 16న మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో బడ్జెట్‌ ధరల్లో ఓ ఫోన్‌ విడుదల చేయనున్నట్లు సమాచారం..

iPhone SE 4: లాంచ్‌కు ముందు చౌకైన ఐఫోన్ డిజైన్ లీక్.. ఎలా ఉంటుందో తెలుసా..?
భారత్‌లో ఆపిల్ ఉత్పత్తిని విస్తరించడం అంత సులభం కాదు. మౌలిక సదుపాయాల లోపాలు, సరఫరా గొలుసు సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం వంటి సవాళ్లు ఉన్నాయి. చైనాలో ఉన్నట్లుగా అత్యాధునిక లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లు, నైపుణ్య కార్మికులు భారత్‌లో ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులో లేరు. అదనంగా, భారత్‌లో దిగుమతి చేసుకునే కాంపోనెంట్‌లపై 26% టారిఫ్ ఉండటం వల్ల ఐఫోన్ ధరలు తగ్గే అవకాశం తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
Subhash Goud
|

Updated on: Jan 19, 2025 | 8:15 PM

Share

యాపిల్ కంపెనీ త్వరలో తన సరికొత్త ఐఫోన్​ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ SE 4 లేదా ‘ఐఫోన్ 16E’ పేరుతో దీన్ని ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్​లో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. Apple రాబోయే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ iPhone SE 4 గురించి గత ఏడాది కాలంగా చర్చలు కొనసాగుతున్నాయి. అనేక లీక్‌లు, నివేదికలలో దీని ఫీచర్స్‌ గురించి అలాగే డిజైన్ గురించి వెల్లడవుతున్నాయి. ఐఫోన్ 16e పేరుతో కంపెనీ దీన్ని కూడా పరిచయం చేయవచ్చని టెక్‌ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడు దీని డిజైన్‌కి సంబంధించిన కొత్త విషయాలు తెరపైకి వచ్చాయి.

లీక్‌లను విశ్వసిస్తే.. ఐప్యాడ్ లతో పాటు మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ డివైజ్‌కు సంబంధించి కంపెనీ ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు అవుతున్నాయి. సోషల్ మీడియాలో సోనీ డిక్సన్, X (గతంలో ట్విట్టర్) వినియోగదారు, iPhone SE 4 డమ్మీ యూనిట్ ఫోటోలను పంచుకున్నారు. iPhone SE 4 వెనుక ప్యానెల్, సైడ్ ఫ్రేమ్ డిజైన్ ఈ ఫోటోలలో కనిపిస్తుంది. వెనుక ప్యానెల్ డిజైన్ ఐఫోన్ 4 లాగా కనిపిస్తుంది. ఫోన్‌లో సింగిల్ రియర్ కెమెరా సెన్సార్, దానితో పాటు ఫ్లాష్ లైట్ ఉంది. ఫోన్ రెండు వేర్వేరు రంగు వేరియంట్‌లు ఫోటోలు ఉన్నాయి. ఇది కనీసం రెండు రంగుల ఆప్షన్‌లలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. డమ్మీ యూనిట్‌లో ఆపిల్ లోగో కనిపించదు. కానీ డిజైన్‌ను చూస్తే దాని ఆపిల్ స్టైల్ స్పష్టంగా కనిపిస్తుంది.

సైడ్ ఫ్రేమ్ పైభాగంలో వాల్యూమ్ రాకర్ బటన్‌లు, దీని పైన, ఫోన్‌ను సైలెంట్, జనరల్ మోడ్‌కి మార్చడానికి స్లైడర్ బటన్ ఉంది. SIM ట్రే ఒక విభాగం దిగువన ఉంటుంది. ఈ ఫొటోలో ఫోన్ బ్యాక్, సైడ్ యాంగిల్ కన్పిస్తుంది. మొదటి చూపులో ఈ ఫోన్ ఐఫోన్ 14 మాదిరిగానే ఉంటుంది. గత కొన్ని నెలలుగా అనేక మీడియా కథనాల్లో కూడా ఇదే చర్చించారు. ఈ ఫోన్ వెనక భాగంలో టాప్ లెఫ్ట్​ కార్నర్​లో సింగిల్ కెమెరా, బ్యాక్ కెమెరా పక్కనే పెద్ద ఎల్‌ఈడీ ఫ్లాష్ లైట్ ఉంది. ఇది తక్కువ బ్రైట్‌నెస్‌లో మంచి ఫోటోలు తీసేందుకు సహాయపడుతుంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో