One Plus Offers: ఆ వన్‌ప్లస్‌ ఫోన్‌పై మతిపోయే ఆఫర్‌.. ఏకంగా రూ.4 వేల తగ్గింపు

దేశంలో మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉండడంతో వారికి అందుబాటు ధరల్లో కూడా వన్‌ప్లస్‌ ఫోన్స్‌ లాంచ్‌ చేసింది. అయితే కొత్త ఏడాదిలో వన్‌ప్లస్‌ మొబైల్‌ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వన్‌ ప్లస్‌ భారతదేశంలో వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 ధరను తగ్గించింది. ఏకంగా ఈ ఫోన్‌పై రూ.4 వేలను తగ్గించింది.

One Plus Offers: ఆ వన్‌ప్లస్‌ ఫోన్‌పై మతిపోయే ఆఫర్‌.. ఏకంగా రూ.4 వేల తగ్గింపు
One Plus Nord 3

Edited By:

Updated on: Jan 03, 2024 | 6:35 PM

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా యువత ఖర్చుకు వెనుకాడకుండా సరికొత్త ఫీచర్లతో వచ్చే స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో ప్రీమియం ఫోన్ల మార్కెట్‌లో వన్‌ ప్లస్‌ ఓ సంచలనంగా మారింది. అయితే దేశంలో మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉండడంతో వారికి అందుబాటు ధరల్లో కూడా వన్‌ప్లస్‌ ఫోన్స్‌ లాంచ్‌ చేసింది. అయితే కొత్త ఏడాదిలో వన్‌ప్లస్‌ మొబైల్‌ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వన్‌ ప్లస్‌ భారతదేశంలో వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 ధరను తగ్గించింది. ఏకంగా ఈ ఫోన్‌పై రూ.4 వేలను తగ్గించింది. వన్‌ప్లస్‌ నార్డ్‌3 రూ. 33,999 వద్ద ప్రారంభించారు. కానీ ఇప్పుడు ఈ ఫోన్‌ను వన్‌ప్లస్‌ కంపెనీ రూ. 29,999 కంటే తక్కువగా విక్రయిస్తోంది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 8జీబీ + 128 జీబీ, 16 జీబీ + 256 జీబీ ట్రిమ్‌ల ఎంపికలో రూ. 29,999, రూ. 33,999కి అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ ఫోన్స్‌ అసలు ప్రారంభ ధర రూ. 33,999, రూ. 37,999 నుంచి రూ. 4,000 తగ్గింది. సవరించిన ధర వన్‌ప్లస్‌ సొంత త వెబ్‌సైట్‌తో పాటు కంపెనీకు సంబంధించిన అధికారిక ఆన్‌లైన్ సేల్ భాగస్వామి అయిన అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ తగ్గింపు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

వన్‌ప్లస్‌ నార్డ్‌3 ఫీచర్లు

వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 టెంపెస్ట్ గ్రే, మిస్టీ గ్రీన్‌తో సహా రెండు రంగుల్లో వస్తుంది. ఈ ఫోన్‌ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో చేసిన ఫ్లాట్ ఛాసిస్‌ను కలిగి ఉంది. బయటి ఫ్రేమ్ ప్లాస్టిక్‌తో తయారు చేశారు. మీరు ఈ ఫోన్‌లో ఐపీ 54 రేటింగ్‌తో పాటు అలర్ట్ స్లైడర్, ఐఆర్‌ బ్లాస్టర్‌ని పొందవచ్చు. ఈ ఫోన్‌ 1080 పిక్సెల్‌ రిజల్యూషన్, 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే ఈఫోన్‌ ప్యానెల్ హెచ్‌డీఆర్‌ 10+కి మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్‌ డ్రాగన్‌ట్రైల్ గ్లాస్ ద్వారా రక్షించబడుతుంది.
ఈ ఫోన్‌ మీడియా టెక్‌ డైమన్సిటీ 9000, 80 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీని కలిగి ఉంది. నార్డ్‌ 3 ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది 50 ఎంపీ, 8 ఎంపీ, అల్ట్రావైడ్, 2 ఎంపీ మాక్రో కలయికతో ఉంటుంది. ముందు భాగంలో 16 ఎంపీ కెమెరాను పొందుతారు. మూడు సంవత్సరాల మేజర్ ఓఎస్‌, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌ల హామీతో ఆండ్రాయిడ్‌ 13 ఆధారంగా ఆక్సిజన్‌ ఓఎస్‌13.1 ద్వారా పని చేస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి.