Amazon: మరికొన్ని గంటల్లోనే అమెజాన్ సేల్.. ఈ ఫోన్‌లపై ఊహకందని డిస్కౌంట్స్
ఈ సేల్‌లో భాగంగా అమెజాన్ అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొదలు, గృహోపకరణలపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తోంది. మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్‌పై భారీ ఆఫర్లను ప్రకటించింది. అమెజాన్ ఆఫర్‌తో పాటు ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేసిన వారికి ఇన్‌స్టాంట్‌గా 10 శాతం డిస్కౌంట్ అందించనున్నారు. ఈ సేల్‌లో భాగంగా సామ్‌సంగ్‌తో పాటు వన్‌ప్లస్, లావా బ్లేజ్ ఎక్స్ వంటి ఫోన్‌లపై..
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ పేరుతో సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అమెజాన్ ఈ సేల్‌ను అందిస్తోంది ఆగస్టు 6వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది. అయితే సాధారణ యూజర్లకు మంగళవారం మధ్యాహ్నం నుంచి సేల్ ప్రారంభమవుతుండగా ప్రైమ్ యూజర్లకు మాత్రం సోమవారం అర్థరాత్రి నుంచి సేల్ అందుబాటులోకి వస్తోంది.
ఈ సేల్‌లో భాగంగా అమెజాన్ అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొదలు, గృహోపకరణలపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తోంది. మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్‌పై భారీ ఆఫర్లను ప్రకటించింది. అమెజాన్ ఆఫర్‌తో పాటు ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేసిన వారికి ఇన్‌స్టాంట్‌గా 10 శాతం డిస్కౌంట్ అందించనున్నారు. ఈ సేల్‌లో భాగంగా సామ్‌సంగ్‌తో పాటు వన్‌ప్లస్, లావా బ్లేజ్ ఎక్స్ వంటి ఫోన్‌లపై ఊహకందని డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. మరి అమెజాన్ సేల్‌లో అందుబాటులో ఉండనున్న కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్‌పై ఓ లుక్కేయండి..
ఐఫోన్ 13 (128జీబీ):
ఐఫోన్ 13 స్మార్ట్ ఫోన్ 128 జీబీ వేరియంట్‌పై అమెజాన్ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అన్ని ఆఫర్లు కలుపుకొని ఈ ఫోన్‌ను కేవలం రూ. 47,999కే సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.1 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే ఈ ఫోన్ సొంతం. ఇందులో 12 ఎంపీతో కూడిన రెయిర్ కెమెరాను అందించారు.
వన్‌ప్లస్ 12ఆర్…
అమెజాన్ సేల్‌లో లభిస్తోన్న మరో బెస్ట్ డీల్ వన్‌ప్లస్ 12ఆర్ ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్‌ను ఆఫర్‌లో భాగంగా రూ.40,999కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 1.5 కే రిజల్యూషన్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ సొంతం. 50 ఎంపీతో కూడిన ప్రూమర్ కెమెరాను అందించారు. 100 వాట్స్ సూపర్‌వూక్‌కు సపోర్ట్ చేసే 5500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.
సామ్‌సంగ్ ఎస్24…
అమెజాన్ సేల్‌లో భాగంగా సామ్‌సంగ్ ఎస్24 ఫోన్‌ను రూ. 74,999కి సొంతం చేసుకోవచ్చు. ఇందులో 15.64 సెంటీమీటర్లతో కూడిన స్క్రీన్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.
వీటితో పాటు.. వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ స్మార్ట్ ఫోన్ రూ. 16,999కాగా సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్21 ఎఫ్‌ఈ 5జీ ఫోన్ రూ. 24,999కే లభిస్తోంది. అలాగే ఇటీవల లాంచ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ 4 ధర రూ. 27,999, లావా బ్లేజ్ ఎక్స్ రూ. 13,249కే లభిస్తోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..