Samsung: రూ. 25వేల ఫోన్ రూ. 18వేలకే సొంతం చేసుకునే ఛాన్స్‌.. అమెజాన్‌ అద్భుతమైన డీల్‌..

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ మొన్నటి వరకు గ్రేట్ ఫ్రీడమ్‌ సేల్‌ పేరుతో భారీ సేల్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ మొదలు, అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందించారు. అయితే ఈ సేల్‌ పూర్తికాగా ఇప్పటికీ కొన్ని ప్రొడక్ట్స్‌పై అమెజాన్‌లో డిస్కౌంట్స్‌ లభిస్తున్నాయి.....

Samsung: రూ. 25వేల ఫోన్ రూ. 18వేలకే సొంతం చేసుకునే ఛాన్స్‌.. అమెజాన్‌ అద్భుతమైన డీల్‌..
Samsung Galaxy M35
Follow us

|

Updated on: Aug 16, 2024 | 6:45 PM

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ మొన్నటి వరకు గ్రేట్ ఫ్రీడమ్‌ సేల్‌ పేరుతో భారీ సేల్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ మొదలు, అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందించారు. అయితే ఈ సేల్‌ పూర్తికాగా ఇప్పటికీ కొన్ని ప్రొడక్ట్స్‌పై అమెజాన్‌లో డిస్కౌంట్స్‌ లభిస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్స్‌పై అమెజాన్‌ ఛాయిస్‌ పేరుతో డిస్కౌంట్స్‌ అందిస్తున్నారు. ఇందులో భాగంగానే సామ్‌సంగ్ కంపెనీకి చెందిన ఓ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఇంతకీ ఆ స్మార్ట్‌ ఫోన్‌ ఏంటి.? దానిపై ఎలాంటి డీల్‌ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

సామ్‌సంగ్ గ్యాలక్జీ ఎమ్‌35 స్మార్ట్‌ ఫోన్‌పై అమెజాన్‌లో మంచి డీల్‌ లభిస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 24,999కాగా అమెజాన్‌లో 18 శాతం డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ రూ. 19,999కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ డిస్కౌంట్స్‌ ఇక్కడితో ఆగిపోలేవు. పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే ఈ ఫోన్‌పై రూ. 2000 డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 17,999కే సొంతం చేసుకోవచ్చు. 6జీబీ ర్యామ్‌, 128 జీబీ వేరియంట్ ఫోన్‌ను ఈ ధరకు సొంతం చేసుకోవచ్చు.

ఇక సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎమ్‌ 35 స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇక ఇందులో 6.6 ఇంచెస్‌తోకూడిన సూపర్‌ అమోఎల్‌ఈడీ ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 1080 x 2340 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ సొంతం. స్క్రీన్ ప్రొటెక్షన్‌ కోసం ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ను అందించారు. ఇక వాపర్‌ కూలింగ్ చాంబర్‌ ఈ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందింఆచరు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6000 ఎమ్‌ఏహెచ్‌ కెపాసిటీతో కూడిన లిథియం ఐయాన్‌ బ్యాటరీని అందించారు. 25 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌ను మూన్‌ లైట్ బ్లూ కలర్‌లో లాంచ్‌ చేశారు. స్టీరియో స్పీకర్‌, డ్యయల్ సిమ్‌, బిల్ట్ ఇన్‌ జీపీఎస్‌ వంటి ఫీచర్లను ఇందులో ప్రత్యేకంగా అందించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

అయ్యయ్యో! తాగిపడేసిన బీర్ టిన్‌లో దూరిన పాము.. ఆ తర్వాత జరిగింది?
అయ్యయ్యో! తాగిపడేసిన బీర్ టిన్‌లో దూరిన పాము.. ఆ తర్వాత జరిగింది?
అందరి జాతకాలు చెప్పే.. వేణు స్వామికి జాతకం ఎవరు చెబుతారు.?
అందరి జాతకాలు చెప్పే.. వేణు స్వామికి జాతకం ఎవరు చెబుతారు.?
ఇక నుంచి Jr.NTR కాదు Mr.NTR | సమంతతో డేటింగ్‌.? అసలు ఎవరీ రాజ్‌.?
ఇక నుంచి Jr.NTR కాదు Mr.NTR | సమంతతో డేటింగ్‌.? అసలు ఎవరీ రాజ్‌.?
హిట్టా.? ఫట్టా.? పూరీ కం బ్యాక్ ఇచ్చారా.? రామ్ మెప్పించాడా.?
హిట్టా.? ఫట్టా.? పూరీ కం బ్యాక్ ఇచ్చారా.? రామ్ మెప్పించాడా.?
పవర్లోకొచ్చాక పవన్ ఎలా పని చేస్తున్నారు.? డిప్యూటీ సీఎం మార్క్.!
పవర్లోకొచ్చాక పవన్ ఎలా పని చేస్తున్నారు.? డిప్యూటీ సీఎం మార్క్.!
వయసు పెరిగినా యంగ్‌గా కనిపించాలా.? అయితే ఇది మీ కోసమే.!
వయసు పెరిగినా యంగ్‌గా కనిపించాలా.? అయితే ఇది మీ కోసమే.!
పిల్లిని కాపాడేందుకు యువకుడి ఖతర్నాక్‌ ఐడియా.. వీడియో వైరల్.!
పిల్లిని కాపాడేందుకు యువకుడి ఖతర్నాక్‌ ఐడియా.. వీడియో వైరల్.!
శ్రీశైలంలో మళ్లీ చిరుత.. ప్రహరీ గోడమీదుగా ఇంటిఆవరణలోకి ఎంట్రీ.
శ్రీశైలంలో మళ్లీ చిరుత.. ప్రహరీ గోడమీదుగా ఇంటిఆవరణలోకి ఎంట్రీ.
నమ్మినవాళ్లే నన్ను మోసం చేశారు.. నాన్నను జాగ్రత్తగా చూసుకో.!
నమ్మినవాళ్లే నన్ను మోసం చేశారు.. నాన్నను జాగ్రత్తగా చూసుకో.!
శ్రీహరి కోట నుండి నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3.. లైవ్
శ్రీహరి కోట నుండి నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3.. లైవ్