smartwatch: మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ వాచ్‌లు.. అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే వంటి అధునాతన ఫీచర్స్‌

స్మార్ట్ వాచ్‌లకు పెట్టింది పేరైనా అమేజ్‌ఫిట్ భారత మార్కెట్లోకి రెండు కొత్త స్మార్ట్ వాచ్‌లను లాంచ్‌ చేసింది. అమేజ్ఫిట్ చీతా రౌండ్‌, అమేజ్‌ఫిట్ చీతా స్క్వేర్‌ పేరుతో రెండు కొత్త వాచ్‌లను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ వాచ్‌ల ధర రూ. 20,999గా ఉన్నాయి. ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని ఈ వాచ్‌లను లాంచ్‌ చేశారు. ధరకు తగ్గట్లుగానే ఈ స్మార్ట్‌ వాచ్‌లో ఫీచర్స్‌ అదే స్థాయిలో ఉన్నాయి..

smartwatch: మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ వాచ్‌లు.. అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే వంటి అధునాతన ఫీచర్స్‌
Amazfit Smartwatch
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 22, 2023 | 7:26 AM

ఒకప్పుడు వాచ్‌ అంటే కేవలం సమయం తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక వస్తువు మాత్రమే. అయితే ప్రస్తుతం కాలం మారిపోయింది. మారిన కాలానికి అనుగుణంగా టెక్నాలజీ మారిపోయింది. దీంతో గ్యాడ్జెట్స్‌ తయారీలోనూ స్పష్టమైన మార్పు వచ్చింది. ముఖ్యంగా స్మార్ట్ వాచ్‌ల హవా నడుస్తోంది. రకరకాల ఫీచర్స్‌తో స్మార్ట్ వాచ్‌లను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. దాదాపు అన్ని ప్రముఖ ఎలక్ట్రానిక్‌ కంపెనీలు మార్కెట్లోకి స్మార్ట్ వాచ్‌లను తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా అమేజ్‌ఫిట్‌ కూడా రెండు కొత్త వాచ్‌లను లాంచ్‌ చేసింది. ఇంతకీ ఈ వాచ్‌ల్లో ఎలాంటి ఫీచర్స్‌ ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

స్మార్ట్ వాచ్‌లకు పెట్టింది పేరైనా అమేజ్‌ఫిట్ భారత మార్కెట్లోకి రెండు కొత్త స్మార్ట్ వాచ్‌లను లాంచ్‌ చేసింది. అమేజ్ఫిట్ చీతా రౌండ్‌, అమేజ్‌ఫిట్ చీతా స్క్వేర్‌ పేరుతో రెండు కొత్త వాచ్‌లను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ వాచ్‌ల ధర రూ. 20,999గా ఉన్నాయి. ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని ఈ వాచ్‌లను లాంచ్‌ చేశారు. ధరకు తగ్గట్లుగానే ఈ స్మార్ట్‌ వాచ్‌లో ఫీచర్స్‌ అదే స్థాయిలో ఉన్నాయి. లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించిన ఈ స్మార్ట్‌ వాచ్‌లలో యూజర్ల ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు పొందే అవకాశం ఉంటుంది.

ఇక అమేజ్‌ఫిట్‌రౌండ్‌ మోడల్‌ స్మార్ట్ వాచ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.39 ఇంచెస్‌తో కూడి హెచ్‌డీ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇక స్క్వేర్‌ మోడల్‌ విషయానికొస్తే ఇందులో 1.75 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఈ రెండు స్మార్ట్‌ వాచ్‌లు సెప్టెంబర్‌ 24వ తేదీ నుంచి అమేజ్‌ఫిట్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, కొన్ని రిటైల్‌ స్టోర్స్‌లో అందబాటులోకి రానున్నాయి.

ఇక ఈ స్మార్ట్ వాచ్‌ల పూర్తి ఫీచర్స్‌ విషయానికొస్తే.. ఛీతా రౌండ్‌ వాచ్‌లో 454×454 పిక్సెల్స్ రిజల్యూషన్ స్క్రీన్‌ ఉండడం ప్రత్యేకత. 10 మీటర్ల వరకు బ్లూటూత్‌ 5.2 కనెక్టివిటీ, బ్లూటూత్ కాలింగ్‌ సపోర్ట్ వంటి ఫీచర్స్‌ను అందించారు. అలాగే శరీరంలో ఆక్సిజన్‌ శాతాన్ని లెక్చించేందుకు ఎస్‌పీఓ2 మానిటర్‌, స్లీప్‌ ట్రాకింగ్, ఫైండ్‌ మై ఫోన్‌, వాయిస్‌ అసిస్టెంట్‌, రన్నింగ్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌తో పాటు 150కిపైగా స్పోర్ట్స్‌ మోడ్‌లకు ఈ వాచ్‌లు సపోర్ట్‌ చేస్తాయి. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ వాచ్‌లు డస్ట్‌, వాటర్‌ నుంచి రెసిస్టెంట్‌ కోసం 5ఏటీఎమ్‌ రేటింగ్‌ను అందించారు. ఈ స్మార్ట్‌ వాచ్‌లను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 12 రోజులు నాన్‌స్టాప్‌గా నడుస్తాయి. ఇప్పటికే ఇండియన్‌ మార్కెట్లోకి వచ్చిన ఈ స్మార్ట్‌ వాచ్‌లు సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అమ్మకానికి రానున్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి…