iphone 16: అప్పుడే క్యూరియాసిటీ పెంచేస్తున్న ఐఫోన్‌16.. లీకైన ఫీచర్స్‌..

ఐఫోన్‌ సిరీస్‌లో భాగంగా ఐఫోన్‌ 16ని లాంచ్‌ చేయడానికి యాపిల్‌ సిద్ధమవుతోంది. అయితే ఈ ఫోన్‌ లాంచ్‌ కావడానికి ఇంకా చాలా సమయం ఉన్నా ఇప్పుడే టెక్‌ మార్కెట్లో ఈ ఫోన్‌కు సంబంధించి వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా ఐఫోన్‌ 16 ఫీచర్లకు సంబంధించి కొన్ని లీకుల నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. డీజైన్‌, ఫీచర్స్‌, ప్రత్యేకతలు ఇవేనంటూ కొన్ని కథనాలు వైరల్‌ అవుతున్నాయి. వీటి ఆధారంగా ఐఫోన్‌ 16లో...

iphone 16: అప్పుడే క్యూరియాసిటీ పెంచేస్తున్న ఐఫోన్‌16.. లీకైన ఫీచర్స్‌..
Iphone 16
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 26, 2023 | 7:40 AM

టెక్‌ మార్కెట్లో ఐఫోన్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐఫోన్‌ నుంచి కొత్త ఫోన్‌ వస్తుందంటే చాలు హడావుడి మాములుగా ఉండదు. యాపిల్‌ స్టోర్స్ ముందు భారీగా క్యూలైన్లు సర్వసాధారణంగా కనిపిస్తాయి. తాజాగా ఐఫోన్‌ 15 మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే తాజాగా ఐఫోన్ 16కి సంబంధించి ఇప్పుడే వార్తలు షికార్లు చేస్తున్నాయి.

ఐఫోన్‌ సిరీస్‌లో భాగంగా ఐఫోన్‌ 16ని లాంచ్‌ చేయడానికి యాపిల్‌ సిద్ధమవుతోంది. అయితే ఈ ఫోన్‌ లాంచ్‌ కావడానికి ఇంకా చాలా సమయం ఉన్నా ఇప్పుడే టెక్‌ మార్కెట్లో ఈ ఫోన్‌కు సంబంధించి వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా ఐఫోన్‌ 16 ఫీచర్లకు సంబంధించి కొన్ని లీకుల నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. డీజైన్‌, ఫీచర్స్‌, ప్రత్యేకతలు ఇవేనంటూ కొన్ని కథనాలు వైరల్‌ అవుతున్నాయి. వీటి ఆధారంగా ఐఫోన్‌ 16లో ఎలాంటి అంశాలు ఉండనున్నాయంటే..

నెట్టింట లీక్‌ అయిన సమాచారం ఆధారంగా ఐఫోన్‌ 16లో సాలిడ్-స్టేట్ బటన్‌లను ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది ఒత్తిడి, స్పర్శను గుర్తించేలా డిజైన్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఐఫోన్‌ 16 సిరీస్‌లో భాగంగా ప్రో, ప్రో మ్యాక్స్‌, 16 ప్లస్‌, 16 ఫోన్‌లను తీసుకురానున్నారని తెలుస్తోంది. ఐఫోన్‌ 16 ప్రోలో 6.3 ఇంచెస్ స్క్రీన్‌, ప్రో మ్యాక్స్‌లో 6.9 ఇంచెస్‌ స్క్రీన్‌, ఐఫోన్‌ 16లో 6.1 ఇంచెస్‌ ఐఫోన్‌ 16 ప్లస్‌లో 6.7 ఇంచెస్‌ స్క్రీన్‌ను ఇవ్వనున్నారని సమాచారం.

అలాగే ఈ సిరీస్‌ ఫోన్స్‌లో సామ్‌సంగ్ అందించేఓఎల్ఈడీ స్క్రీన్‌ను అందించనున్నట్లు తలెఉస్తోంది. బ్లూ ఫాస్ఫోరోసెన్స్‌తో బ్లూ ఫ్లోరోసెంట్ టెక్నాలజీని ఇవ్వనున్నారని తెలుస్తోంది. మైక్రో ఎల్ఈడీ డిస్‌ప్లే టెక్నాలజీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్‌ 16 సిరీస్‌లో 3 నానోమీటర్ A18 చిప్‌ అందించనున్నారి తెలుస్తోంది. ఇక కెమెరా విషయానికొస్తే.. ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్‌లు ‘టెట్రా-ప్రిజం’ టెలిఫోటో కెమెరాను ఇవ్వనున్నారని టాక్‌ నడుస్తోంది.

అద్భుతమైన ఫొటోలు తీసుకునేందుకు వీలుగా ఆప్టికల్ జూమ్ 3ఎక్స్ నుంచి 5ఎక్స్ వరకు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఐఫోన్ 16 ప్రో సిరీస్ కోసం ఉపయోగించే 48 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా తక్కువ వెలుతురులో కూడా మంచి క్వాలిటీతో కూడిన ఫొటోలు తీసుకోవచ్చని తెలుస్తోంది. 2024లో లాంచ్‌ కానున్న ఐఫోన్‌ 16 సిరీస్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..