- Telugu News Photo Gallery Technology photos Best instant water bucket water heater, check here for full details
Water Heater: చలికాలం ఈ వాటర్ హీటర్‌తో బిందాస్.. తక్కువ ధరలో ఫుల్ సేఫ్టీ..
చలికాలం వచ్చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతోంది. మరీ ముఖ్యంగా ఉదయం చలి తీవ్రతను తట్టుకోవడం కష్టంగా మారుతోంది. ఇక చలికాలంలో ఎదురయ్యే ప్రధాన సమస్య ఉదయం స్నానం చేయడం. చల్లటి నీటితో స్నానం చేస్తే నరకం కనిపిస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే మార్కెట్లోకి ఒక ఇంట్రెస్టింగ్ వాటర్ హీటర్ వచ్చేసింది...
Updated on: Nov 26, 2023 | 9:03 AM

సాధారణంగా గ్రిజర్స్‌ను కొనుగోలు చేయాలంటే ధర ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో గ్రీజర్స్‌కు సరిపోయే ప్లంబర్ సెటప్ ఉండాలి. ఇలాంటి వారి కోసమే ఇన్‌స్టాంట్ వాటర్ గ్రీజర్స్ అందుబాటులోకి వచ్చాయి.

సాధారణ వాటర్ హీటర్స్‌తో పోల్చితే ఇవి సేఫ్టీ విషయంలో ఎంతగానో ఉపయోగపడతాయి. సాధారణ వాటర్ హీటర్ రాడ్స్‌తో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇన్‌స్టాంట్ వాటర్ గ్రీజర్స్‌తో భద్రతకు భరోసా ఉంటుంది.

ఇలాంటి ఇన్‌స్టాంట్ వారట్ హీటర్స్‌లో బకెట్ వాటర్ హీటర్ ఒకటి. Abirami పేరుతో ఈ వాటర్ గ్రీజర్‌ను తీసుకొచ్చారు. 20 లీటర్స్ కెపాసిటీతో ఉండే ఈ ఇన్‌స్టాంట్ వాటర్ హీటర్ షాక్ ప్రూఫ్‌తో తీసుకొచ్చారు.

బకెట్‌లో నీరు పోసుకొని ప్లబ్ ఇన్‌సర్ట్ చేస్తే చాలు నీరు వేడెక్కుతుంది. బకెట్‌లోనే ఇన్‌బిల్ట్‌గా హీటర్‌ను అందించారు. రాడ్ బయటకు తీయాల్సి అవసరం ఉండదు. దీంతో సేఫ్టీ విషయంలో ఎలాంటి భయం ఉండదు.

ఇక ధర విషయానికొస్తే.. ఈ ఇన్‌స్టాంట్ బకెట్ వాటర్ హీటర్ ధర రూ. 1699కి అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లోనూ ఈ బకెట్ వాటర్ హీటర్ అందుబాటులో ఉంది.





























