Wi-Fi: రాత్రి పడుకునే ముందు వైఫై ఆఫ్ చేయకపోతే ఏమవుతుందో తెలిస్తే షాకే..
రాత్రి పడుకునే ముందు మీ వైఫై రూటర్‌ను ఆఫ్ చేస్తున్నారా.. లేదంటే ఆ అలవాటును వెంటనే మార్చుకోవడం చాలా మంచిది. రాత్రి వై-ఫై ఆఫ్ చేయడం వల్ల కరెంట్ బిల్లు తగ్గడంతో పాటు రేడియేషన్ ప్రభావం తగ్గి మంచి నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. వై-ఫై ఆఫ్ చేస్తే కలిగే 5 ముఖ్యమైన ఆరోగ్య, ఆర్థిక ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

నేటి ఆధునిక జీవితంలో వై-ఫై ఒక అనివార్యమైన భాగంగా మారింది. కొద్దిసేపు నెట్ ఆగిపోతే అంతా ఆగమాగమవుతుంది. అయితే రాత్రి పడుకునే ముందు మీ వై-ఫై రూటర్‌ను ఆఫ్ చేస్తున్నారా..? చాలా మంది ఆన్‌లోనే ఉంచుతారు. కానీ రూటర్‌ను ఆఫ్ చేయడం చాలా మంచి అలవాటు అని నిపుణులు సూచిస్తున్నారు. ఈ చిన్న అలవాటును మార్చుకోవడం వల్ల ఆరోగ్యం, విద్యుత్ బిల్లుతో సహా అనేక రకాల ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.
రాత్రిపూట Wi-Fi ఆఫ్ చేయడం వలన 5 ప్రధాన ప్రయోజనాలు
విద్యుత్ ఆదా
రాత్రిపూట వైఫై రూటర్‌ను ఆఫ్ చేయడం వలన ఆ సమయంలో అనవసరంగా జరిగే విద్యుత్ వినియోగాన్ని ఆదా చేయవచ్చు. దీనివల్ల మీ నెలవారీ విద్యుత్ బిల్లులో కొంత మొత్తాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
రేడియేషన్ నుండి రక్షణ
వైఫై రూటర్లు పనిచేస్తున్నప్పుడు విద్యుదయస్కాంత క్షేత్రాలను విడుదల చేస్తాయి. ఇవి వెంటనే హానికరం కాకపోయినా, అనవసరమైన రేడియేషన్‌కు గురికావడం మంచిది కాదు. నిద్రపోయేటప్పుడు వైఫైని ఆఫ్ చేయడం ద్వారా మీరు మీ చుట్టూ ఉండే రేడియేషన్ మొత్తాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.
నిద్ర నాణ్యత
వైఫై వంటి ఎలక్ట్రానిక్ పరికరాల నుండి వచ్చే సిగ్నల్స్ నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. రాత్రిపూట వై-ఫైని ఆఫ్ చేయడం వలన మీరు ఎటువంటి అంతరాయాలు లేకుండా ప్రశాంతంగా, మంచి నాణ్యత గల నిద్రను పొందవచ్చు.
కణాల మరమ్మత్తు
కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రేడియేషన్‌కు గురికావడం వల్ల కణాల శక్తి ఉత్పత్తి తగ్గి, నిద్రలో జరిగే ముఖ్యమైన మరమ్మత్తు ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. రేడియేషన్‌కు దీర్ఘకాలికంగా గురికావడం పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.
రూటర్ జీవితకాలం పెంపు
ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాన్ని నిరంతరం ఉపయోగించడం వల్ల అది పాడైపోయే ప్రమాదం పెరుగుతుంది. రాత్రిపూట రూటర్‌కు విశ్రాంతి ఇవ్వడం వలన దాని అంతర్గత భాగాలు కూల్ అవుతాయి. దీనివల్ల అది ఎక్కువ కాలం మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంది.
ఈ ఆరోగ్య మరియు ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, రాత్రి పడుకునే ముందు వై-ఫై మోడెమ్‌ను ఆఫ్ చేయడం ఒక ఆరోగ్యకరమైన అలవాటుగా మార్చుకోవడం మంచిది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




